For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రేమికుల రోజున ఎవరితో.. ఎలా గడిపానంటే.. సింగిల్ ఫరెవర్.. రష్మిక మందన్న

  |

  టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న కన్నడ భామ రష్మిక మందన్న. గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్‌బస్టర్ విజయాలను సొంతం చేసుకొన్న ఈ అందాల తార ప్రస్తుతం నితిన్ కథానాయకుడిగా సితార ఎంటర్టైన్మెంట్శ్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన సినిమా 'భీష్మ'లో హీరోయిన్‌గా నటించారు. వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫిబ్రవరి 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రష్మికతో మీడియాతో మాట్లాడుతూ..

  భీష్మ చిత్రం ఎలా ఉంటుందంటే

  భీష్మ చిత్రం ఎలా ఉంటుందంటే

  భీష్మ చిత్రంలో మంచి వినోదాన్ని మీరు ఆశించవచ్చు. అయితే నా సినిమాని నేను జడ్జ్ చెయ్యలేను. ఇందులో నేను చైత్ర అనే మంచి క్యారెక్టర్ చేశాను. భీష్మ అనే ఆర్గానిక్స్ కంపెనీలో పని చేస్తుంటా. నా పాత్ర నుంచి ఎక్కువగా చెప్పను. కానీ ఎంజాయ్ చేస్తారు. సినిమా మాత్రం సూపర్‌గా అందర్నీ ఆలోచింపజేస్తుందని చెప్పగలను. ఈ సినిమాతో రష్మిక బాగా నటిస్తుందనీ, బాగా డాన్సులు చేస్తుందనీ, బాగా పాడుతుందని కూడా అందరూ అనుకుంటారు అని పేర్కొన్నారు.

  సితారా ఎంటర్‌టైన్‌మెంట్ గురించి

  సితారా ఎంటర్‌టైన్‌మెంట్ గురించి

  నాకు వచ్చిన స్క్రిప్ట్స్ లో నాకు నచ్చినవి చేసుకుంటూ పోతున్నానంతే. ఇందులో లక్ ఫ్యాక్టర్ ఎంత ఉందో నాకు తెలీదు. ఈ సినిమా చేసేటప్పుడు నాలుగైదు సార్లు నిర్మాత నాగవంశీ గారిని కలిశాను. చాలా ప్రశాంతంగా ఉంటారు. ఈ సినిమా చూసినవాళ్లు ప్రొడక్షన్ విలువల గురించి కూడా మాట్లాడుకుంటారు. అంత క్వాలిటీతో నాగవంశీ గారు 'భీష్మ'ను నిర్మించారు. భీష్మ' ఈ రెండో రకానికి చెందిన సినిమా. డబ్బింగ్ చెప్పేప్పుడు నేనే నవ్వలేక పొట్టచేత్తో పట్టుకున్నాను అని అన్నారు.

   పాత్రల ఎంపికలో

  పాత్రల ఎంపికలో

  పాత్రల ఎంపికలో ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నాను. కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్ని, మనసుకు నచ్చిన పాత్రల్ని ఎంచుకుంటున్నాను. ప్రస్తుతం పాత్రల విషయంలో మరింత కొత్తదనం కోసం చూస్తున్నా. ఇది ప్రయోగాలు చెయ్యడమే. తర్వాత ఏమవుతుందనే ఉత్కంఠ కలిగించే సబ్జెక్టులు ఎంచుకుంటున్నా. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు మంచి సినిమా చూశామనే అనుభూతిని పొందాలి.. అది ఎమోషనల్ కావచ్చు, మరొకటి కావచ్చు. లేదంటే వాళ్లు సరదాగా ఎంజాయ్ చేసేటట్లయినా ఉండాలి. కడుపు నొప్పి పుట్టేంతగా వాళ్లు నవ్వాలి అని రష్మిక తెలిపారు.

  IT Rides On Rashmika Mandanna's House !
  ప్రేమికుల రోజున నేను..

  ప్రేమికుల రోజున నేను..

  గత రెండేళ్లుగా ప్రేమికుల రోజును చాలా సాదాసీదాగా గడుపుతున్నాను. ఆ రోజు మార్నింగ్ జిమ్‌కు వెళ్లి వచ్చాను. అన్ని పనులు క్యాన్సిల్ చేసుకొని ఓ సినిమా చూశాను. ఆ తర్వాత సినిమా బోర్ కొట్టడంతో ఇంట్లోనే ఏదో పని చేసుకొంటూ కాలం గడిపాను. ఆ తర్వాత నేను స్నేహితురాలితో కలిసి డిన్నర్‌కు వెళ్లాను. ఇక కొన్నేళ్లు ఇలానే సింగిల్‌గానే ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లాలని ప్లాన్ చేసుకొన్నాను. భీష్మ ఉప శీర్షిక సింగిల్ ఫరెవర్ అనేది ప్రస్తుతం నాకు కరెక్ట్‌గా సరిపోతుందని అనుకొంటాను అని రష్మిక చెప్పారు.

  English summary
  Female Actor Rashmika Mandanna has big movies in her kitty. He got very good success with Sarileru neekevvaru. Now, She is doing Bheeshma with Nithiin.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X