Rashmika Mandanna సీతా రామం కథను మలుపు తిప్పే పాత్రలో రష్మిక.. హను రాఘవపూడి

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా ప్రఖ్యాత వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో 'యుద్ధంతో రాసిన ప్రేమకథ'గా ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం సీతా రామం. బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన కీలక పాత్రలో కనిపిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ నేపధ్యంలో దర్శకుడు హను రాఘవపూడి ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

వైజయంతి మూవీస్‌ బ్యానర్‌తో పనిచేయడం అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్. కాగితం మీద ఉన్న కథను స్క్రీన్ మీదకి రావాలంటే విజన్ ఒక్కటే సరిపోదు. దర్శకుడి విజన్‌ను బలంగా నమ్మే నిర్మాత ఉండాలి. వైజయంతి మూవీస్, నిర్మాత స్వప్న దత్ సినిమా పట్ల గొప్ప సంకల్పం వున్న నిర్మాతలు. కథ ఒప్పించడానికి ప్రయత్నించకూడదు. కథ బాగా ఉండాలి. కథ బాగుటే అన్నీ జరిగిపోతాయి. సినిమా అనేది నచ్చితేనే చేస్తారు. అందులో వైజయంతి మూవీస్ మరింత క్లారిటీ‌గా ఉంటుంది అని హను రాఘవపూడి అన్నారు.

 Rashmika Mandanna change the story in Sita ramam says Hanu Raghavapudi

మన జీవితాల్లో ఒకప్పుడు ఉత్తరాలు కీలకంగా ఉండేవి. అవి సున్నితమైన అంశంగా ఉండేది. ఉత్తరం అనేది చాలా ప్రత్యేకమైన ఎమోషన్. ప్రేమ కథకి కమ్యునికేషన్ ప్రధాన సమస్య. ఒకప్పుడు ప్రేమ కథలు చాలా హృద్యంగా ఉండటానికి కారణం.. ఇప్పుడంత కమ్యునికేషన్ లేకపోవడమేనని భావిస్తా. ఉత్తరంలో ఎమోషన్ వేరు. ఆ మ్యాజిక్‌ను ఇప్పటి తరం మిస్ అయిపోతున్నారు. ఆ మ్యాజిక్‌ని బాగానే డీల్ చేశానని అనుకుంటున్నా అని హను రాఘవపూడి తెలిపారు.

సీతారామం సినిమాలో రష్మిక మందన్న పోషించిన పాత్ర కథలో అత్యంత కీలకంగా ఉంటుంది. కథని మలుపు తిప్పే పాత్ర. ఆ పాత్ర జర్నీలో ఏం జరుగుతుందో అనేది ఒకరకంగా ఈ కథ. అదే కాదు.. ఇందులో పాత్రలన్నీ కథని ఎదో ఒకరకంగా మలుపు తిప్పుతాయి. సుమంత్, భూమిక, ప్రియదర్శి.. అన్నీ ముఖ్యమైన పాత్రలే అని ఓ ప్రశ్నకు హను రాఘవపూడి సమాధానం ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X