twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ మూవీ విషయంలో అలాంటి అసంతృప్తి.. త్రివిక్రమ్ వల్లే అంతా... వకీల్‌సాబ్ గురించి తమన్

    |

    హిందీలో ఘన విజయం సాధించిన పింక్ చిత్రం రీమేక్‌గా రూపొందిన వకీల్ సాబ్ ఏప్రిల్ 9వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా ప్రమోషన్లను భారీగా ప్రారంభించారు. ఇప్పటికే ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా వకీల్ సాబ్ గురించి సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ...

    అలా వైకుంఠపురం సక్సెస్ ఎంజాయ్ చేయలే

    అలా వైకుంఠపురం సక్సెస్ ఎంజాయ్ చేయలే

    గతేడాది లభించిన సక్సెస్‌ను ఊహించలేదు. మ్యూజిక్ రంగంలో సక్సెస్ అరుదుగా వస్తుంది. కెరీర్ ఆరంభంలో సినిమాలోని అన్ని పాటలు హిట్ అయ్యే అవకాశం మ్యూజిక్ డైరెక్టర్‌కు ఉంటుంది. అలా వైకుంఠపురంలో సినిమాలో పాటలు అన్నీ హిట్ అయ్యాయి. అందుకు కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్. వారికి నా థ్యాంక్స్. కానీ ఆ సక్సెస్‌ను ఏడాదిపాటు ఎంజాయ్ చేసే స్కోప్ ఉండేది. కానీ లాక్‌డౌన్ కారణంగా ఎంజాయ్ చేయాలేకపోయాను అని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అన్నారు.

    ఆ నిర్మాతను అభినందించాలి

    ఆ నిర్మాతను అభినందించాలి

    కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా సినిమా పరిశ్రమ చాలా నష్టపోయింది. ఇంకా ఆ నష్టాన్ని సరిగా ఎవరు గుర్తించడం లేదు. సినిమా థియేటర్లు మూసి వేయకుండా ఓపెన్ చేసి సినిమాలను ప్రదర్శించడం ఓ పాజిటివ్ అంశం. సోలో బతుకే సో బెటర్ సినిమాతో థియేటర్లలో సందడి మొదలైంది. అందరూ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే నిర్మాత బీవీవీఎన్ ప్రసాద్ మూవీని థియేటర్లలో రిలీజ్ చేసి ఓ ఛాలెంజ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. అందుకు ఆయనకు థ్యాంక్స్ చెప్పుకోవాలి అని తమన్ అన్నారు.

     క్రాక్, సోలో బతుకే సో బెటర్ సక్సెస్‌తో

    క్రాక్, సోలో బతుకే సో బెటర్ సక్సెస్‌తో

    లాక్‌డౌన్ తర్వాత సోలో బతుకే సో బెటర్, క్రాక్ సినిమాలకు మంచి సక్సెస్ లభించింది. ఈ రెండు సినిమాలు మ్యూజికల్ హిట్స్ కావడం హ్యాపీగా ఉంది. రీరికార్డింగ్, పాటలకు మంచి ఆదరణ లభించింది. అందుకు చాలా ఆనందంగా ఉంది అని తమన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

    వకీల్ సాబ్ అవకాశం త్రివిక్రమ్ వల్లే

    వకీల్ సాబ్ అవకాశం త్రివిక్రమ్ వల్లే

    వకీల్ సాబ్ సినిమా అవకాశం నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ద్వారా వచ్చింది. ఈ సినిమా త్రివిక్రమ్ గారితో ప్రారంభమైంది. ప్యారిస్‌లో సామజవరగమన పాట రికార్డింగ్ చేసే సమయంలో దిల్ రాజ్‌కు నన్ను పరిచయం చేశారు. వకీల్ సాబ్‌కు పనిచేస్తారని చెప్పారు. అలా నేను వకీల్ సాబ్ సినిమా అవకాశం అలా వచ్చింది అని తమన్ తెలిపారు.

    పవన్ ధాటికి పింక్ కనిపించదు

    పవన్ ధాటికి పింక్ కనిపించదు

    పింక్ సినిమా రీమేక్‌లో పాటలకు స్కోప్ లేదనిపించింది. కానీ రీరికార్డింగ్‌కు చాలా స్కోప్ ఉందనే ఫీలింగ్ ఉంది. అయితే కథలో చాలా మార్పులు చేసి పాటలకు, రీరికార్డింగ్ చాలా స్కోప్ ఇచ్చారు. వకీల్ సాబ్ చూస్తే పింక్ సినిమా అసలే కనిపించదు. ఆ కలర్ ఈ సినిమాలో ఉండదు. అమితాబ్, అజిత్ చేసినప్పటికీ.. పవన్ కల్యాణ్ రేంజ్ ఈ సినిమాకు ప్లస్ అయింది అని తమన్ పేర్కొన్నారు.

    English summary
    Power Star Pawan Kalyan's Vakeel Saab is set to release on April 9th. In this occassion, Promotions are gearing up. In this juncture, S Thaman shares his experience with Pawan, Trivikram and Dil Raju.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X