twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sai Pallavi గార్గీ సినిమా చూసి సూర్య, జ్యోతిక, స్టాలిన్ అలాంటి రియాక్షన్.. సాయిపల్లవి ఇంటర్వ్యూ

    |

    గార్గీ మూవీకి సంబంధించిన కథ బాగా నచ్చింది. ఈ కథ మన జీవిత ప్రయాణంలో ఎక్కడో ఒకచోట ఎదురుపడుతుంది. ఈ పాత్ర కోసం నేను ఏం చేయాలి? ఎంత చేయాలి? ఎంత వరకు చేయవచ్చు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమా చేశాను. ఈ సినిమా ఒక వకీల్ సాబ్, జై భీమ్ లాంటి అనుభూతిని కలిగించే చిత్రంగా ఉంటుంది. నటిగా పరిపూర్ణమైన అనుభవాన్ని అందించే చిత్రం గార్గీ నాకు అనిపించింది. గార్గీ నాకు మంచి అవకాశంగా భావించాను. కోర్టు సీన్లు, న్యాయం లాంటి అంశాలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి అని సాయిపల్లవి చెప్పారు. గార్గీ సినిమా గురించి మాట్లాడుతూ..

    వాస్తవ సంఘటనల ఆధారంగా

    వాస్తవ సంఘటనల ఆధారంగా

    గార్గీ సినిమా కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా చేసుకొని రూపొందిచారు. ఈ సినిమాలో తండ్రి, కూతుళ్ల మధ్య జరిగే ఎమోషనల్ డ్రామా. నేను ఇది వరకు ఫిదా, లవ్ స్టోరి, విరాటపర్వం సినిమాల్లో తండ్రి, కూతుళ్ల కథలో నటించాను. కానీ గార్గీ సినిమాలో ఉండే భావోద్వేగం డిఫరెంట్‌గా ఉంటుంది. గత చిత్రాల్లో తండ్రితో కలిసి ఉండే క్యారెక్టర్ పోషించాను. యుముడితో పోరాటం చేసి సావిత్రి భర్త ప్రాణాలు దక్కించుకొన్నట్టు.. ఈ సినిమాలో నాకు దూరమైన నా తండ్రి కోసం నేను న్యాయపోరాటం చేస్తాను అని సాయిపల్లవి తెలిపారు.

    గార్గీ అర్ధం ఏమిటంటే?

    గార్గీ అర్ధం ఏమిటంటే?

    గార్గీ అంటే పురాణాల్లోని ఓ క్యారెక్టర్. ఒక సమయంలో పురుషుడికి పవర్, అవకాశాలు ఉన్నాయనే భావన ఉండేది. సమకాలీన సమయంలో మహిళలకు కూడా సమాన భాగం ఉండే ఒక వెసులుబాటు ఉంటుంది. ఈ కథలో గార్గీ పాత్రకు కూడా అలానే ప్రాధాన్యం ఉంటుంది. ఈ సినిమాలో నేను టీచర్ పాత్రను పోషించాను. టీచర్ ఎలా ఉంటుందనే కాకుండా కుటుంబంలో ఉండే సమస్య గురించి కథ ఎక్కువగా ట్రావెల్ అవుతుంది అని సాయిపల్లవి అన్నారు.

    హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ కథను తీసుకొచ్చి

    హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ కథను తీసుకొచ్చి


    గార్గీ సినిమా కథ ముందుగా హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ వద్దకు వెళ్లింది. ఐశ్వర్య లక్ష్మీకి, దర్శకుడు గౌతమ్ రాంచంద్రన్‌కు క్లోజ్ ఫ్రెండ్‌షిప్ ఉంది. కథ గురించిన తెలిసిన తర్వాత తన సోదరుడు, దర్శకుడు గౌతమ్‌తో కలిసి ఐశ్వర్య లక్ష్మీ నిర్మించింది. ఒక హీరోయిన్ అయి ఉండి.. నా కోసం ఈ సినిమాను నాకు ఇవ్వడం చాలా హ్యాపీగా ఫీలయ్యాను. నా కెరీర్‌లో నా ముందుకు వచ్చిన కథలను వేరే వారు చేస్తే బాగుంటుందని నేను నిర్మాతలకు సిఫారసు చేశాను అని సాయిపల్లవి చెప్పారు.

    సమాజంలో మార్పు కోసం కాదు.. కానీ

    సమాజంలో మార్పు కోసం కాదు.. కానీ

    సమాజంలోని మార్పు కోసం సినిమా చేయాలన్నది గార్గీ ఉద్దేశం కాదు. ఒక సినిమా మాదిరిగానే చూడండి. మీ మనసులోకి ఈ సినిమా వెళ్లిపోయి ఒక ఆలోచనను రేకెత్తిస్తుంది. ఇటీవల ఈ సినిమాను సూర్య, ఉదయనిధి స్టాలిన్ చూశారు. చూసిన వెంటనే ఇతరులకు సినిమా చూసే ప్రయత్నం చేశారు. సూర్య ఈ సినిమా చూడగానే మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత ఆ మూడ్ నుంచి బయటకు వచ్చి.. ఈ సినిమాను నేను రిలీజ్ చేస్తానని చెప్పారు. ఆ తర్వాత జ్యోతిక వచ్చి నేను కూడా ఈ సినిమాలో భాగమవుతానని అన్నారు అని సాయిపల్లవి చెప్పారు.

    సూర్య, జ్యోతిక ఈ సినిమాలో అలా భాగమై

    సూర్య, జ్యోతిక ఈ సినిమాలో అలా భాగమై

    గార్గీ సినిమాలో సూర్య, జ్యోతిక భాగమైన తర్వాత ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. ముందుగా నాకు ఎందుకు సినిమా చూపించలేదు. నేను కూడా ఈ సినిమాలో భాగమయ్యే వాడిని. అయినా ఈ సినిమాకు నా ప్రోత్సాహం ఉంటుంది. ఈ సినిమాను పెద్ద మూవీగా మార్చి భారీగా ప్రమోట్ చేద్దామని చెప్పారు. ఈ సినిమాను కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. మలయాళంలో తమిళ భాషలోనే రిలీజ్ చేస్తున్నాం అని సాయిపల్లవి తెలిపారు.

    English summary
    After Virataparvam, Sai Pallavi's new movie is Gargi. It is releasing on July 15th. Here is the exclusive interview of Telugu Filmibeat
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X