ఆ బాలీవుడ్ హీరోతో రొమాన్స్ చేయాలని ఉంది.. బాలీవుడ్ ఎంట్రీపై సమంత షాకింగ్ కామెంట్
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తన టాలెంట్‌తో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన సమంత అక్కినేని కొన్ని భాషలకే పరిమితమయ్యారు. తమిళ, తెలుగు, మలయాళ భాషల్లోనే విభిన్నమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. అయితే బాలీవుడ్‌కు ఎందుకో దూరంగా ఉంటూ వచ్చారు. అయితే బాలీవుడ్‌లో చూడాలని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ప్రేక్షకులు ఆ సమయం రానే వస్తున్నది. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో హిందీ సినీ పరిశ్రమలో అడుగుపెట్టబోతున్నది. ఈ సందర్భంగా బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ....

గతంలో బాలీవుడ్ ఆఫర్లు
గతంలో బాలీవుడ్‌లో నాకు ఆఫర్లు వచ్చాయి. చాలా సినిమా కథలు నా ముందుకు వచ్చాయి. కానీ నేను దక్షిణాదిలో బిజీగా ఉండటం వల్ల మరో ఛాన్స్ తీసుకోలేకపోయాను. కొన్నిసార్లు కథలు నచ్చినా డేట్స్ కుదరకపోవడం వల్ల చేయలేకపోయాను. బాలీవుడ్‌లో చేయాలనే కోరిక మాత్రం ఉంది అంటూ సమంత అక్కినేని చెప్పారు.

బాలీవుడ్ టాలెంట్‌కు భయపడి
బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి ఇంత సమయం ఎదుకు తీసుకొన్నారు.. దానికి కారణమేమిటని ఇంటర్యూ చేసే వ్యక్తి పదే పదే ప్రశ్నించగా.. పెద్దగా కారణం ఏమి లేదు. ఇక్కడ ఉండే వాళ్లకు చాలా టాలెంట్ ఎక్కువ. దానికి భయపడే బాలీవుడ్‌కు రాలేదు. ప్రతిభ పరంగా అమేజింగ్. అందుకే సమయం తీసుకొన్నాను. ఇప్పుడు కొంచెం ధైర్యం తెచ్చుకొన్నాను. నా టాలెంట్‌తో ఆకట్టుకోవాలని అనుకొంటున్నాను అని సమంత చెప్పారు.

రణ్‌బీర్ కపూర్‌తో రొమాన్స్ చేయాలని...
బాలీవుడ్‌లో నటించాలని అనుకొంటే.. మనోజ్ బాజ్‌పేయ్‌తో కాకుండా ఏ హీరోతో నీవు రొమాన్స్ చేయాలని కోరుకొంటావు అనే ప్రశ్నకు సమంత సమాధానం ఇస్తూ.. ఠక్కున రణ్‌బీర్ కపూర్ అని చెప్పారు. రణ్‌బీర్ కపూర్ అంటే నాకు ఇష్టం. అతడితో కలిసి జంటగా నటించాలని తన మనసులోని కోరికను బయటపెట్టింది.

ఆ పాత్రకు నాగార్జున అక్కినేని కరెక్ట్
ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సౌత్‌లో తీసి ఉంటే.. హిందీ ఫ్యామిలీ మ్యాన్‌లో శ్రీకాంత్ తివారీ పాత్రలో నటించిన మనోజ్ బాజ్‌పేయ్ పాత్రలో తెలుగులో ఎవరైతే బాగుంటుందని అనుకొంటున్నారు అనే ప్రశ్నకు సమంత ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. సౌత్‌లో శ్రీకాంత్ తివారీ పాత్రకు నాగార్జున అక్కినేని కరెక్టుగా సరిపోతారు అని సమంత చెప్పింది.
Recommended Video

ఫ్యామిలీ మ్యాన్ 2 స్క్రిప్టు గురించి
ఫ్యామిలీ మ్యాన్ స్క్రిప్టులో అన్ని అంశాలు నచ్చాయి. నా క్యారెక్టర్ చాలా నిజాయితీగా డిజైన్ చేశారు. నా వల్లనే ఫ్యామిలీ మ్యాన్ 2 బ్లాక్‌బస్టర్ అవుతుందని ఒప్పుకొను. కానీ నా పాత్రను అద్బుతంగా తీర్చి దిద్దారు. దాని వల్లనే రిలీజ్‌కు ముందే సూపర్‌హిట్ అయిందనే ఫీలింగ్ కలుగుతున్నది అని సమంత చెప్పారు.


Click it and Unblock the Notifications











