For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆయన బాడీ లాంగ్వేంజ్ డిఫరెంట్..అతడి కళ్లలోనే అలాంటి పవర్.. సంయుక్త మీనన్ (Interview)

  |

  పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్‌తో టాలీవుడ్‌లోకి ప్రవేశించిన సంయుక్త మీనన్ మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకొన్నది. ప్రస్తుతం కల్యాణ్ రామ్‌తో కలిసి బింబిసార చిత్రంలో నటిస్తున్నది.ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో సంయుక్త మీనన్ తెలుగు ఫిల్మీ బీట్‌తో మాట్లాడుతూ..

  తెలుగు భాషపై అలా ఫోకస్ పెట్టా

  తెలుగు భాషపై అలా ఫోకస్ పెట్టా

  నా కెరీర్ ఆరంభంలోనే పవన్ కల్యాణ్, కల్యాణ్ రామ్, సాయిధరమ్ తేజ్ లాంటి పెద్ద స్టార్లతో నటించే అవకాశం వచ్చింది. అయితే షూట్ సమయంలో నాకు భాష తెలియకపోతే నా పాత్రతో కనెక్షన్ పోయే అవకాశం ఉంది. కేవలం పెదాలు ఆడించి నటించడం నాకు నచ్చదు. అందుకే తెలుగు భాషపై పట్టు సాధించాలని అనుకొన్నాను. నేను సాయిధరమ్ 15వ సినిమాలో నటిస్తున్నాను. ఆ సమయంలో యూనిట్ సభ్యుల కారణంగా తెలుగులో మాట్లాడటం వల్ల భాషను అర్ధం చేసుకొన్నాను. అంతేకాకుండా రోజు 1 గంట సేపు ట్యూటర్ పెట్టుకొని అలా నేను తెలుగు నేర్చుకొన్నాను. అందుకు SDT15 టీమ్‌కు థ్యాంక్స్ చెప్పుకోవాలి అని సంయుక్త మీనన్ అన్నారు.

  అనుకోకుండా హీరోయిన్ అయ్యాను

  అనుకోకుండా హీరోయిన్ అయ్యాను

  నేను అనుకోకుండా హీరోయిన్ అయ్యాను. స్టడీస్, జాబ్ చేస్తుండగా అనుకోకుండా అవకాశం లభించింది. దాంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. మలయాళంలో చేసిన సినిమాలు నాకు మంచి గుర్తింపు తెచ్చాయి. దాంతో తెలుగులో ఆఫర్లు వచ్చాయి. కోవిడ్‌ సమయంలో బింబిసార నుంచి ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత రెండు వారాల గ్యాప్‌లో SDT15 ఆఫర్ వచ్చింది. సెకండ్ లాక్‌డౌన్ తర్వాత భీమ్లా నాయక్ నుంచి నాకు ఆఫర్ రావడంతో కంగారు పడ్డాను. ఇప్పటికి నా సినిమాలు రిలీజ్ కాలేదు. పెద్ద ప్రాజెక్టులో నటించగలనా అనే అనుమానం కలిగింది అని సంయుక్త మీనన్ చెప్పింది.

   బింబిసారలో మోడరన్ యువతిగా

  బింబిసారలో మోడరన్ యువతిగా

  బింబిసార సినిమా విషయానికి వస్తే.. ఇది టైమ్ ట్రావెల్ మూవీ. ప్రస్తుతం కాలంలో, అలాగే చాలా ఏళ్ల క్రితం జరిగిన కథతో సినిమా నడుస్తుంది. ప్రజెంట్ డేలో జరిగే కథలో మోడరన్ యువతిగా నటిస్తున్నాను. సింపుల్ పాత్ర కావడంతో ఎక్కువ కష్డపడాల్సిన అవసరం లేకుండా పోయింది. నాకు పిరియాడిక్ కాన్సెప్ట్‌తో సాగే ఎపిసోడ్‌లో నడిస్తే బాగుండేదనిపించింది. ఎందుకంటే..నాకు బాహుబలి, బాజీరావు మస్తానీ లాంటి సినిమాలు అంటే ఇష్టం అని సంయుక్త మీనన్ చెప్పారు.

  కల్యాణ్ రామ్ కళ్లలో అలాంటి పవర్

  కల్యాణ్ రామ్ కళ్లలో అలాంటి పవర్

  కల్యాణ్ రామ్ చాలా ఎమోషనల్ యాక్టర్. ఆయన కళ్లతోనే భావాలను పలికిస్తారు. బింబిసార సినిమా షూట్‌కు మొదటిసారి వెళ్లినప్పుడు రాజు గెటప్‌లో ఉన్నాడు. ఓ సీన్‌లో ఆయన చూపును చూస్తే..నిజంగా రాజులానే పాత్రలో లీనమై కనిపించాడు. ఆయన ఫెర్ఫార్మెన్స్‌కు అది ఒక శాంపిల్. కల్యాణ్ రామ్‌ది ఒక భిన్నమైన బాడీ లాంగ్వేజ్. మొదటి రోజు నా వద్దకు వచ్చి..మీరు మా ప్రాజెక్టులో ఉండటం గర్వంగా భావిస్తున్నామని చెప్పడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నా కెరీర్‌లో ఎవరూ కూడా అలా చెప్పలేదు. అది ఆయన మంచితనానికి నిదర్శనం అని సంయుక్త మీనన్ తెలిపారు.

  సీనియర్ హీరోయిన్ల ఇంటర్వ్యూలు చూసి

  సీనియర్ హీరోయిన్ల ఇంటర్వ్యూలు చూసి

  ఒకే సమయంలో నాలుగైదు పెద్ద ప్రాజెక్టుల్లో ఆఫర్లు రావడం చాలా ఆనందంగా ఉంది. వివిధ పాత్రలు చేయడానికి సీనియర్ హీరోయిన్ల ఇంటర్వ్యూలు చూస్తాను. వాళ్లు చెప్పే విషయాలను నోట్ చేసుకొంటాను. టాప్ పొజిషన్‌కు చేరుకోవడానికి వారు ఏం చేశారో తెలుసుకొంటాను. పాత్ర గురించి అధ్యయనం చేసి నేను ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తుంటాను అని సంయుక్త మీనన్ చెప్పారు.

   టాలీవుడ్‌లో గ్రాండియర్‌గా సినిమాలు

  టాలీవుడ్‌లో గ్రాండియర్‌గా సినిమాలు

  మలయాళంలో సినిమాలు రియల్ లొకేషన్లలో షూట్ చేస్తారు. కడువ కూడా లోకల్‌ ప్రాంతాల్లో షూట్ చేశారు. దాని వల్ల స్థానికంగా ఉండే గ్రామీణ ప్రజలు, వారి భాషను తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. తెలుగు సినిమా పరిశ్రమ విషయానికి వస్తే.. స్టూడియోలో పెద్ద పెద్ద సెట్లు వేసి షూట్ చేస్తారు. అందుకే టాలీవుడ్ సినిమాలు గ్రాండియర్‌గా ఉంటాయి. మలయాళం మేకింగ్ వేరు..తెలుగు సినిమాల మేకింగ్ డిఫరెంట్ అనే వ్యత్యాసం గ్రహించాను అని సంయుక్త మీనన్ చెప్పారు.

   ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో నటించడం గురించి

  ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో నటించడం గురించి


  నా కెరీర్ ఆరంభంలోనే ఎన్టీఆర్ ఆర్ట్స్ లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్‌లో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నా కెరీర్‌కు, భవిష్యత్‌కు సేఫ్ లాంటి ఆఫర్. ఎన్టీఆర్ బ్యానర్‌లో సినిమా చేస్తున్నానని చెబితే అందరికి తెలిసిపోతుంది. నా కెరీర్‌కు ప్లస్ పాయింట్ అవుతుంది. నా ఫ్రొఫైల్‌కు బాగా పనికి వస్తుంది అని సంయుక్త మీనన్ తెలిపారు.

  English summary
  Vakeel Saab fame Samyuktha Menon is doing Kalyan Ram's Bimbisara movie. This movie set to release on August 5th. In this occassion, Telugu filmibeat brings Exclusive interview of Samyuktha Menon.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X