Don't Miss!
- Sports
INDvsNZ : తొలి టీ20లో ఈ సీన్స్ చూసి.. ఫ్యాన్స్ కూడా షాక్!
- Automobiles
రిషబ్ పంత్ ప్రాణాలు కాపాడిన వారికి గొప్ప గుర్తింపు.. వీడియో
- News
Ratha saptami 2023: రథసప్తమికి కచ్చితంగా ఈ పనులు చెయ్యండి.. ఆరోగ్యం, అన్నింటా విజయం!!
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
అందుకే ఇండస్ట్రీకి వచ్చా.. కానీ వాళ్లు నన్ను కమెడియన్‌ను చేశారు.. సప్తగిరి
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ప్రేమ కథా చిత్రం సినిమాలతో స్టార్ కమెడియన్‌గా మారిన సప్తగిరి ఆ తర్వాత హీరోగా మారిపోయారు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బీ చిత్రాలతో హీరోగా నిలబడ్డాడు. కలెక్షన్లతోపాటు పేరు సంపాదించుకొన్నాడు. మరోసారి గోవింద నామ స్మరణతో మళ్లీ వజ్రకవచధర గోవింద అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రం జూన్ 14న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సప్తగిరి తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. సప్తగిరి చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

జూన్ 14న వజ్రకవచధర గోవింద

సినిమాకు కథనే బలం
వజ్రకవచధర గోవింద చిత్రం చాలా తక్కువ బడ్జెట్ చిత్రం. సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమా చేసేటప్పుడే దర్శకుడు అరుణ్ పవార్‌తో చేయాలని అనుకొన్నాం. ఆ మేరకే వజ్రకవచధర గోవింద చేయాలని నిర్మించాం. కథ చాలా బలమైనది. నాలోని అసిస్టెంట్ డైరెక్టర్ ఆలోచనల మేరకే ఈ కథను ఎంచుకొన్నాను. మహేంద్ర మంచి కథను అందించాడు. అరుణ్ పవార్ చక్కగా తెరకెక్కించారు.

కామెడీ పాత్రలకు నేను రెడీ
హీరోగా చేస్తున్నప్పటికీ.. నేను కమెడియన్‌గా నటించడానికి రెడీగా ఉన్నాను. కానీ కొందరు నేను కమెడియన్ పాత్రలు వేయనని డిసైడ్ అయినట్టు కనిపిస్తుంది. కామెడీ పాత్రలు చేయడానికి ఎప్పుడూ నేను రెడీనే అని సప్తగిరి అన్నారు. కథను మాత్రమే నమ్మకుని చేసిన సినిమా ఇది. ఈ సినిమా తర్వాత హీరోగా అవకాశాలు వస్తే కథను మాత్రమే నమ్ముకొంటాను అని సప్తగిరి చెప్పారు.

నాలో కమెడియన్ లేడు అని నమ్మకం
అసలు నాలో కమెడియన్ అనేవాడు లేడనేది నా నమ్మకం. ఎందుకంటే సింధూరం, భారతీయుడు సినిమాలు చూసి డైరెక్టర్ కావాలనుకొని ఇండస్ట్రీకి వచ్చాను. కానీ నా బాడీ లాంగ్వేజ్, మాట తీరు చూసిన వాళ్లు కమెడియన్ ఉన్నారని నమ్మారు. అలా వాళ్లు నన్ను కమెడియన్ చేశారు. దాంతో నేను కమెడియన్‌గా ఫిక్స్ అయ్యాను. నేను నటించిన సినిమాల్లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమా నాకు బాగా నచ్చింది. ఆ సినిమాను చూసి బాగా నవ్వుకొన్నాను. ప్రేమ కథా చిత్రం కూడా నాకు నవ్వు తెప్పించలేదు అని సప్తగిరి అన్నారు.