twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ రెండు పాయింట్లే లవ్ స్టోరి.. సాయిపల్లవిని ఎందుకు తీసుకొన్నానంటే.. దర్శకుడు శేఖర్ కమ్ముల

    |

    తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం లవ్ స్టోరి. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించగా, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించిన చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. అనంతరం ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మరింత వేగం పెంచారు. సెప్టెంబర్ 24వ రిలీజ్ అవుతున్న లవ్ స్టోరి మూవీ గురించి శేఖర్ కమ్ముల వెల్లడిస్తూ..

    కుల వివక్ష, ఆడ, మగ తారతమ్యం గురించి

    కుల వివక్ష, ఆడ, మగ తారతమ్యం గురించి

    లవ్ స్టోరీ ఫీల్‌గుడ్ మూవీ. ఓ అమ్మాయి, అబ్బాయికి మధ్య ఉండే రొమాన్స్, మ్యూజిక్ అన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. దాంతో పాటు సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లే కీలక పాయింట్ ఉంటుంది. అదే ఈ సినిమాకి గొప్ప బలం అని నమ్ముతున్నాను. తెర మీద మంచి లవ్ స్టోరీలా ఉంటుంది. కుల వివక్షత, లింగ భేదం అనే విషయాలను చర్చించాం. ఆడ మగ తారతమ్యం, ఇతర విషయాలపై సినిమాలో బలంగా చూపించడం జరిగింది అని శేఖర్ కమ్ముల అన్నారు.

    కుల వివక్షను పూర్తిస్థాయిలో

    కుల వివక్షను పూర్తిస్థాయిలో

    లీడర్ సినిమా తీసినప్పుడు అందులో కుల వివక్షను ఓ చిన్న పాయింట్‌గా చూపించాను. ఆ తర్వాత అదే పాయింట్‌తో పూర్తిస్థాయిలో సినిమా తీయాలని అనుకొన్నాను. అది లవ్ స్టోరీ మూవీ రూపంలో కుదిరింది. సమాజంలో ఎప్పుడూ ఏదొక సమస్య ఉంటూనే ఉంటున్నది. అలా చూసి చూసి ఫైనల్‌గా రెండు బలమైన పాయింట్స్‌తో లవ్ స్టోరీ‌లో చూపించడం జరిగింది అని దర్శకుడు శేఖర్ కమ్ముల చెప్పారు.

    లాక్‌డౌన్ కారణంగా చాలా సమస్యలు

    లాక్‌డౌన్ కారణంగా చాలా సమస్యలు

    లాక్‌డౌన్ విధించే సమాయానకిి కేవలం కొన్ని రోజులు షూట్ మాత్రమే మిగిలి ఉంది. ఆ తర్వాత ఆ పార్ట్‌ను పూర్తి చేయాలని చాలా రోజులు ఎదురు చూశాం. లాక్‌డౌన్ వల్ల వచ్చిన గ్యాప్‌లో ఎడిటింగ్ కంప్లీట్ చెయ్యాలి అనుకున్నాం కానీ ఆ టైం లో చేయలేకపోయాం. లాక్‌డౌన్ తర్వాత కోవిడ్ ప్రోటోకాల్స్ తీసుకొని టాలీవుడ్‌లో ఫస్ట్ షూట్ కూడా మేమే స్టార్ట్ చేసాం. అలా ప్రారంభించిన కొద్ది రోజులకే మళ్లీ సెకండ్ వేవ్ వచ్చేసింది. ఆ సమయంలో మరో నిర్మాలు ఎవరైనా ఉంటే.. ఖచ్చితంగా లవ్ స్టోరిని ఓటీటీకి ఇచ్చేసేవాళ్ళు. కానీ మా నిర్మాతలు మాత్రం థియేటర్స్‌లోనే రిలీజ్ చేస్తామని పట్టుదలతో కనిపించారు. థియేటర్స్‌లో రిలీజ్ చేయడానికి ఇన్నాళ్లు ఎదురు చూశారు. ఇక ఫైనల్ ఈ సెప్టెంబర్ 24 కి ఈ సినిమాని తీసుకురావాలని ఫిక్స్ అయ్యాం అని శేఖర్ కమ్ముల వెల్లడించారు.

    చిరంజీవి, అమీర్ ఖాన్‌తో మరచిలేని అనుభూతి

    చిరంజీవి, అమీర్ ఖాన్‌తో మరచిలేని అనుభూతి

    లవ్ స్టోరి ప్రీ రిలీజ్ ఈవెంట్ నా జీవితంలో మరిచిపోలేని అనుభూతి. చిరంజీవి, ఆమీర్ ఖాన్ ఈవెంట్‌కు హాజరై సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. ఆ ఇద్దరు గొప్ప నటులకు స్పెషల్ థాంక్స్. నాగచైతన్య‌ను తెలంగాణ కుర్రాడిగా చూపించడానికి ఆయనతో పాటు మేము కూడా కష్టపడ్డాం, సినిమాలో తన డైలాగ్స్ నుంచి మ్యానరిజమ్స్ వరకు ప్రతీ అంశంలో చాలా జాగ్రత్తలు తీసుకొన్నాం. చైతూని ఇంతకు ముందు ఎవరూ చూపించని విధంగా చూపించాం. ఖచ్చితంగా చాలా నమ్మకంగా చెప్తున్నాం ఈ సినిమాలో చాలా కొత్త నాగ చైతన్యని అందరూ చూస్తారు అని శేఖర్ కమ్ముల చెప్పారు.

    Recommended Video

    Bigg Boss Telugu Season 5 Update : Jr NTR టీవి షో కూడా అప్పుడే ! || Filmibeat Telugu
    సాయిపల్లవిని ఎందుకు తీసుకొన్నానంటే..

    సాయిపల్లవిని ఎందుకు తీసుకొన్నానంటే..

    ఫిదా తర్వాత సాయి పల్లవిని మళ్లీ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఆమె ఒక మంచి పెర్ఫార్మర్. అంతకు మించి మరో కారణం ఏమీ లేదు. ఫిదా నుంచి ట్రావెల్ అయ్యాం కాబట్టి తన గురించి బాగా తెలుసు. అందుకే ఈ సినిమాకి సాయిపల్లవిని తీసుకున్నాం. ఫిదాతో పోలిస్తే ఈ సినిమాలో కంప్లీట్ దానికి వ్యతిరేకంగా కనిపిస్తుంది. చాలా షేడ్స్, లెటర్స్ ఉన్న రోల్ అది దానిని తను చాలా కష్టపడి చేసింది. తప్పకుండా ఆమె పాత్రకు మంచి రెస్సాన్స్ వస్తుంది అని శేఖర్ కమ్ముల తెలిపారు.

    English summary
    Shekhar Kammula about Love Story, Naga Chaitanya and Sai Pallavi roles in the movie. This movie is set to release on September 24th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X