Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఆ సినిమా అట్టర్ ఫ్లాప్‌కు కారణాలు అనేకం.. ఆ ఫెయిల్యూర్ ఓ గుణపాఠం.. శ్రీవిష్ణు హాట్ కామెంట్స్
టాలీవుడ్‌లో జయాపజయాలు పట్టించుకోకుండా ఫీల్ గుడ్ చిత్రాల్లో నటిస్తున్న హీరో శ్రీవిష్ణు తాజా చిత్రం రాజ రాజ చోర. ఈ సినిమా ఆగస్టు 19న థియేట్లర్లో రిలీజ్ అవుతూ ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గురించి శ్రీవిష్ణు మాట్లాడుతూ..

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు హసిత్ గోలి గురించి గొప్పగా చెప్పారు, ఈ సినిమాపై కాన్పిడెన్స్ పెరగడానికి కారణం ఏమిటి?
హసిత్ గోలి చెప్పిన కథే నాలో కాన్ఫిడెన్స్ పెంచింది. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున అతడి గురించి గొప్పగా చెప్పాలనిపించింది. కథ గురించి వివరాలు చెప్పను. ఎందుకంటే సినిమా చూస్తే బాగుంటుంది. ఈ సినిమాలో చాలా మంచి విషయాలు ఉన్నాయి. ఏ సినిమాలోనైనా సిద్ద్ శ్రీరాం పాట పాడితే సక్సెస్ ఖాయమనే చెబుతుంటారు.
అలాంటి సక్సెస్ అందించే పాటను మా సినిమాలో సిధ్ శ్రీరాం పాడారు. ఆ పాటను రిలీజ్ చేయలేదు. సినిమా రిలీజ్ తర్వాతే పాటను రిలీజ్ చేస్తే మంచి ఫీల్, ఫీడ్ బ్యాక్ వస్తుందని స్ట్రాటిజిక్‌గా ఆపాం. తప్పకుండా సిధ్ శ్రీరాం పాడిన పాట ప్రేక్షకులను ఆకట్టుకొంటుందని భావిస్తున్నాం అని శ్రీవిష్ణు అన్నారు.
Tharagathi Gadhi Daati's పాయల్ రాధాకృష్ణ అందాల ఆరబోత.. నెవర్ బిఫోర్!

సినిమా ఈవెంట్లలో తక్కువగా మాట్లాడుతారు? కానీ రాజ రాజ చోర సినిమా ఈవెంట్‌లో ఎక్కువగా ఎందుకు మాట్లాడారు?
రాజ రాజ చోర మూవీ గురించి చెప్పాల్సిన అవసరం రావడం వల్లే గట్టిగా మాట్లాడాలని అనుకొన్నాను. ఈ సినిమాకు అవసరం కూడా. అందుకే ఈ సినిమా గురించి నిజాయితీగా మాట్లాడాను. ఈ సినిమాలో నేను దొంగగా నటిస్తున్నాను. దొంగ అంటే భారీ కుంభకోణాలు కాకుండా చిల్లర దొంగగా కనిపిస్తాను. సినిమా మొదలైన కొద్ది సేపట్లోనే రవిబాబు, శ్రీకాంత్ అయ్యంగార్, ఇతర పాత్రలు రివీల్ అయిపోతాయి. ఆ తర్వాత సరదా సరదాగా పాత్రలతో కనెక్ట్ అవుతాయి అని శ్రీవిష్ణు తెలిపారు.
Sai Pallavi తో నాగచైతన్య కెమిస్ట్రీ అదుర్స్.. వెండితెర మీద ఇక సారంగ ధరియే!

రాజ రాజ చోర సినిమాను అన్ని భాషల్లో సినిమా అని ప్రొజెక్ట్ చేశారెందుకు?
రాజ రాజ చోర సినిమా మంచి చిత్రం. అన్ని భాషల్లో రూపొందించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. అందుకే ఆ విధంగా చెప్పాను. ఇప్పటికే నేను నటించిన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అవుతున్నాయి. అవన్నీ ఎప్పుడు చెప్పుకోలేదు. ఈ సినిమా కథ చెప్పే విధానం బాగా ఉంటుంది. అందుకే ఈ సినిమా గురించి గొప్పగా చెప్పాల్సిన అవసరం ఏర్పడింది.

మీ కెరీర్‌లో కొత్త డైరెక్టర్లతో చేయడానికి కారణం ఏమిటి?
సాగర్ చంద్రతో అప్పట్లో ఒకడుండే వాడు, వేణు ఊడుగులతో నీది నాదే ఒకే కథ, మెంటల్ మదిలో లాంటి సినిమాలు చేశాను. కొత్త వాళ్లతో చేస్తే బాధ్యత ఉంటుంది. కొత్త వాళ్లతో పని చేసే ముందు వాళ్లు సరిగా హ్యాండిల్ చేస్తారనే విషయం తెలిసిన తర్వాత వచ్చే కిక్ మాములుగా ఉండదు. అలాగే కొత్త వాళ్లతో చేసిన సినిమాలే ఎక్కువగా సక్సెస్ ఇచ్చాయి. వాళ్లతో చేస్తే మన బుర్ర కూడా పనిచేయడానికి వీలవుతుంది. పెద్ద డైరెక్టర్లతో చేస్తే వాళ్లే చూసుకొంటారనే ఫీలింగ్ ఉంటుంది అని శ్రీవిష్ణు చెప్పారు.

రాజ రాజ చోర సినిమా బలాలు ఏమిటి?
రాజా రాజ చోర చిత్రం చూస్తే ముందుగా మాట్లాడేది మ్యూజిక్ డైరెక్టర్ గురించే. వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమా బలం. సినిమా క్లైమాక్స్‌లో మ్యూజిక్ హైలెట్‌గా ఉంటుంది. సిద్దు పాత్ర ఎంట్రీ తర్వాత సినిమాలో మ్యూజిక్ హిలేరియస్‌గా ఉంటుంది. పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది అని శ్రీవిష్ణు అన్నారు.

హీరోయిన్ల గురించి చెప్పాల్సి వస్తే?
రాజ రాజ చోర సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. నేను తొలిసారి ఇద్దరు హీరోయిన్లతో నటిస్తున్నా. ఇద్దరు తెలుగువాళ్లే. తెలుగులో సినిమాలు చేశారు. కాకపోతే తమిళంలో సెటిల్ అయ్యారు. సునయన, మేఘా ఆకాశ్ నటించారు. ఈ సినిమా తర్వాత వాళ్లకు మంచి ఆఫర్లు వస్తాయి. వాళ్ల కెరీర్‌లో బెస్ట్ సినిమా అవుతుంది అని శ్రీవిష్ణు చెప్పారు.

గాలి సంపత్ సినిమా రిజల్ట్ విషయానికి వస్తే.. ?
గాలి సంపత్ సినిమా ఫెయిల్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ సినిమాతో చాలా డిస్సాపాయింట్ అయ్యాను. అర్ధగంట సినిమా చూస్తే కథంటో అర్ధమవుతుందని చాలా మంది చెప్పారు. సినిమా ఏదైనా తేడా అనిపిస్తే వదిలేస్తావు. ఆ సినిమా ఎందుకు చేశావని అడిగిన వాళ్లు కూడా ఉన్నారు. మీ సినిమాల్లో నిజాయితీ కనిపిస్తుంది.
కానీ ఆ సినిమాలో అది కనిపించలేదని చెప్పారు. గాలి సంపత్ ఆడకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక్క కారణమని చెప్పలేం. నేను ఆ సినిమా గురించి ఇప్పుడు చర్చించడం సబబు కాదు. ప్రతీ ఫెయిల్యూర్ నుంచి కొత్త విషయాలు నేర్చుకొంటాం. ఆ సినిమా విషయంలో కూడా అదే జరిగింది అని శ్రీ విష్ణు చెప్పారు.