twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి మాదిరిగానే RRR.. ప్రేక్షకుడు మరో లోకంలో విహరించేలా.. రాజమౌళి క్లారిటీ

    |

    బాహుబలితో అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించుకొన్న ఎస్ఎస్ రాజమౌళి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం RRR. మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోలుగా కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం రెండో షెడ్యూల్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నది. ఈ నేపథ్యంలో రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ తన లేటేస్ట్ ప్రాజెక్ట్ గురించి వివరించారు. ఆయన ఏమన్నారంటే..

    ఆసక్తికరంగా కథ, కథనాలతో

    ఆసక్తికరంగా కథ, కథనాలతో

    దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకొనే కథతో రూపొందుతున్న చిత్రం RRR. బాహుబలి మాదిరిగానే భారీ ఎత్తున నిర్మిస్తున్నాం. ఆడియెన్స్‌కు ఆసక్తి కలిగించే కథ, కథనాలు, క్యారెక్టర్లను డిజైన్ చేశాం. తప్పకుండా ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది అని రాజమౌళి పేర్కొన్నాడు.

     మరో లోకంలో విహరించే విధంగా

    మరో లోకంలో విహరించే విధంగా

    నాకు ఫాంటసీ సినిమాలను నేను బాగా ఎంజాయ్ చేస్తాను. ప్రేక్షకుడు ఈ లోకాన్ని మరిచి మరో లోకానికి వెళ్లే విధంగా కథ చెప్పడం నాకు ఇష్టం. RRR సినిమా అందరి అంచనాలు తలదన్నేలా ఉంటుంది. ఇండస్ట్రీలో మంచి చిత్రంగా మారుతుందని నమ్ముతున్నాను అని రాజమౌళి వెల్లడించారు.

    దర్శకుడికి ప్రియా వారియర్ అదిరిపోయే కౌంటర్.. నేను నిజాలు బయటపెడితే!దర్శకుడికి ప్రియా వారియర్ అదిరిపోయే కౌంటర్.. నేను నిజాలు బయటపెడితే!

    ఏడాదిపాటు కథపై కసరత్తు

    ఏడాదిపాటు కథపై కసరత్తు

    ఇక రాజమౌళి ఫిల్మ్ మేకింగ్ గురించి చెప్పాల్సి వస్తే.. తాను రూపొందించే ప్రతీ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులపై భారీగా సమయాన్ని వెచ్చిస్తారు. బాహుబలి సినిమాకు దాదాపు ఏడాదిన్నర సమయాన్ని కేటాయించాడు. RRR సినిమాకు కూడా ఏడాదిపాటు కథపై కూర్చోవడం గమనార్హం.

    బాహుబలి మూవీ టీమ్‌తో

    బాహుబలి మూవీ టీమ్‌తో

    RRR సినిమా నిర్మాణంలో బాహుబలి టీమ్‌ను రాజమౌళి దించేశాడు. బాహుబలి సినిమాకు పనిచేసిన విజయేంద్ర ప్రసాద్ (కథ), రమ రాజమౌళి (క్యాస్టూమ్స్), వీ శ్రీనివాస మోహన్ (వీఎఫ్ఎక్స్), ఎంఎం కీరవాణి (మ్యూజిక్), సాబు సిరిల్ (ప్రొడక్షన్ డిజైన్), కేకే సెంథిల్ కుమార్ (సినిమాటోగ్రఫి) పనిచేస్తున్నారు.

    నాలుగు భాషల్లోకి

    నాలుగు భాషల్లోకి

    RRR సినిమా దాదాపు నాలుగు భాషల్లో విడుదల కానున్నది. ఈ చిత్రాన్ని ఏకకాలంలో వివిధ భాషల్లో షూట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్‌పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. రికార్డు ధరకు డిజిటల్, శాటిలైట్ హక్కులను కొనుగోలు చేసేందుకు పలు సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ చిత్రం 2020లో రిలీజ్ కానున్నది.

    English summary
    After Baahubali: The Beginning and Baahubali: The Conclusion, Director SS Rajamouli has now dedicated an entire year to the making of his upcoming ambitious project RRR which is slated to hit the screens in 2020. He said, RRR is a pan India film with which larger audience can relate to. It is a large scale movie just like Baahubali.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X