Don't Miss!
- News
Telangana Budget 2023: గవర్నర్ తమిళిసై ఏం చెప్పబోతున్నారు..?
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Hunt మూవీ చూసి ఉంటే.. సూపర్ స్టార్ కృష్ణ ఆ మాట చెప్పేవారేమో.. సుధీర్ బాబు ఎమోషనల్
నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'హంట్'. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. మహేష్ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదలకు సిద్దమైంది. హంట్ చిత్రంలో గతం మరిచిపోయిన పోలీస్ ఆఫీసర్‌గా సుధీర్ బాబు విభిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. యాక్షన్ ప్రధానంగా సాగే ఎమోషనల్ మూవీకి జాన్ విక్ 4 లాంటి సినిమాకు వర్క్ చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్లు పనిచేశారు. ఇలాంటి విషయాలను, విశేషాలను సుధీర్ బాబు మీడియాతో పంచుకొన్నారు. ఆయన చెప్పిన వివరాల్లోకి వెళితే..
కథ డిమాండ్ చేయడంతో శ్రీకాంత్, భరత్ హంట్ ప్రాజెక్టులో చేరారు. వారిద్దరి ఎంపిక దర్శకుడిదే. శ్రీకాంత్ పాత్ర నిడివి తక్కువే.. కానీ ఆ పాత్ర ప్రభావం సినిమాపై ఎక్కువగా ఉంటుంది. భరత్ తమిళంలో మంచి సినిమాలు చేస్తూ ఉన్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్ ఆ పాత్రకు సరిపోతుందనే అడిగితే.. చాలా గ్యాప్ తర్వాత తెలుగులో చేయడానికి ఒప్పుకొన్నాడు. అయితే హంట్ సినిమాను తమిళంలో రిలీజ్ చేయాలని ముందు అనుకోలేదు. వారం క్రితమే ఈ ఆలోచన వచ్చింది. హంట్ తెలుగులో రిలీజైన వారం తర్వాత తమిళ రిలీజ్ గురించి ఆలోచిస్తాం అని సుదీర్ బాబు తెలిపారు.

నా నిజ జీవితంలో పోలీస్ ఆఫీసర్ కావాలని అనుకోలేదు. నటుడిగా మారిన ఎవరైనా తన కెరీర్‌లో ఒక్కసారైనా పోలీస్ క్యారెక్టర్ చేయాలని అనుకొంటారు. హంట్ సినిమాలో నేను వేసిన పోలీస్ పాత్రలో రెండు వేరియేషన్ష్ ఉన్నాయి. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు ఉన్నా ఎంత వరకు ఉండాలో, అంతే ఉంటాయి. సినిమా కోర్ పాయింట్ ఎమోషనే అని సుధీర్ బాబు తెలిపారు.
దర్శకుడు మహేష్ కొత్తవారే. ఆయనకు పెద్దగా సక్సెస్ ట్రాక్ లేదు. అయితే ఆయన చెప్పిన కథ నాకు నచ్చింది. ఓ నటుడు 50, 60 కథలు వింటుంటే ఒక మంచి పాయింట్ వద్ద ఆగిపోతాడు. దాన్ని ఎందుకు వదులుకోవడం అనిపిస్తుంది. కథలో ఏదైనా నాకు డౌట్స్ ఉంటే ముందు ప్రశ్నలు అడుగుతా. తర్వాత టెస్ట్ షూట్ చేయమని చెబుతా. పైగా, ఈ సినిమాకు భవ్య క్రియేషన్స్ అండగా ఉంది కదా! వాళ్ళు ఉండటంతో నమ్మకం వచ్చింది అని సుధీర్ బాబు అన్నారు.
కృష్ణగారు నాకు ప్రేమ, మెమోరీస్ మాత్రమే కాదు ధైర్యాన్ని ఇచ్చారని ప్రెస్ మీట్‌లో చెప్పింది నిజమే. ఆయన చేసే ధైర్యం, నాకు ఇచ్చిన నమ్మకంతోనే హంట్ సినిమాతో రిస్క్ చేశారు. హంట్ సినిమా చేయడం డేరింగ్ అటెంప్ట్. ఇలాంటి కథ కృష్ణ చేసి ఉండకపోవచ్చు. కానీ, తన కెరీర్‌లో చాలా ప్రయోగాలు చేశారు. కెరీర్ అంతా కొత్తగా ట్రై చేశారు. అందుకని, ఈ సినిమాకు ఆయన రియాక్షన్ తెలుసుకోవాలని అనుకున్నాను. ప్రతిసారీ నా సినిమా విడుదలైనప్పుడు ఆయన ఫోన్ చేసి తన జడ్డిమెంట్ చెప్పేవారు. లేదంటే ఇంటికి పిలిచి నాతో మాట్లాడేవారు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ విడుదలైనప్పుడు మాట్లాడాను. అప్పుడు కూడా హంట్ చూసి ఏం అంటారోనని అనుకున్నాను. ఆయన అప్రిషియేట్ చేస్తారని అనుకున్నాను. ఇప్పుడు ఆయన మన మధ్యలో లేకపోవడంతో బాధగాను, వెలితిగాను ఉంది. ఆయనకు తప్పకుండా నచ్చుతుందనే అనుకొంటాను అని సుధీర్ బాబు ఎమోషనల్ అయ్యారు.
హంట్ తర్వాత నటుడు హర్షవర్ధన్ దర్శకత్వంలో మామా మశ్చీంద్ర అనే సినిమా చేస్తున్నా. ఇది కామెడీ అండ్ యాక్షన్ జానర్ సినిమా. ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. అందులో ట్రిపుల్ రోల్ చేస్తున్నాను. యువీ క్రియేషన్స్‌లో ఇంకో సినిమా ఉంది. తండ్రీ కొడుకుల మధ్య జరిగే డ్రామా అది. రెండు మూడు రోజుల్లో టైటిల్ అనౌన్స్ చేస్తారు అని సుధీర్ బాబు తెలిపారు.