Gaalodu లో హీరోయిన్‌గా రష్మీని అందుకే తీసుకోలేదు.. మా మధ్య అలా రొమాన్స్..సుడిగాలి సుధీర్

జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‍‍‍‍ హీరోగా ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో సంస్కృతి ఫిలింస్ నిర్మాణ సారథ్యంలో రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న చిత్రం గాలోడు. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా టీజ‌ర్, ట్రైలర్లకు ఇప్పటికే విశేషమైన స్పందన లభించింది. ఈ చిత్రం నవంబర్ 18న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలవుతోన్న సందర్భంగా హీరో సుడిగాలి సుధీర్ మీడియాతో మాట్లాడుతూ..

గాలోడు రొటీన్ కథే.. కానీ

గాలోడు రొటీన్ కథే.. కానీ

గాలోడు కొత్త కథ అని చెప్పను గానీ.. మంచి మాస్ కమర్షియల్ అంశాలన్నీ ఉంటాయి. చిన్నతనం నుంచి మాస్ సినిమాలంటే ఇష్టం, చిరంజీవి, రజనీకాంత్ గారి సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. మా మాస్ ఆడియెన్స్‌ని మెప్పించేందుకు ఈ సినిమాను చేశాను. గాలోడు కథ నాకు చాలా నచ్చింది. నా పాత్ర డిజైన్ చేసిన‌ తీరు కూడా బాగుంటుంది. అందుకే సినిమాను ఒప్పుకున్నాను. ఊర్లో పనీ పాట లేకుండా తిరిగే వ్యక్తి సమస్యల్లో పడి సిటీకి రావడం, మళ్లీ సిటీలో ఇంకో సమస్యలో చిక్కుకోవడం, ఈ మధ్యలో ప్రేమ కథ ఉంటుంది.. చిన్న చిన్న టిస్టులతో మంచి మాస్ కమర్షియల్ అంశాలతో ఈ సినిమా న‌డుస్తుంది అని సుధీర్ చెప్పారు.

కొన్ని సీన్లను సెన్సార్ వాళ్లు చూసి..

కొన్ని సీన్లను సెన్సార్ వాళ్లు చూసి..

గాలోడు మూవీ కథకు తగ్గట్టుగానే ఈ సినిమా టైటిల్‌ను పెట్టాం. కాలేజ్‌లో గాలోడు చేష్టలు చేస్తుంటాడు. ఈ పాత్రను చూస్తేనే గాలోడులా అనిపిస్తుంది. కొన్ని సీన్లు నేను సుధీర్‌లా ఆలోచించి.. వద్దని అనేవాడ్ని. కానీ గాలోడు అలానే చేస్తాడు అని మా డైరెక్టర్‌ చెప్పేవారు. కానీ నేను అభ్యంతరం చెప్పిన కొన్ని సీన్లను సెన్సార్ వాళ్లు రిజెక్ట్ చేశారు. దాంతో నా అభిప్రాయమే కరెక్ట్ అనిపించింది అని సుధీర్ తెలిపారు.

గాలోడు సినిమా ఎందుకు చేశానంటే?

గాలోడు సినిమా ఎందుకు చేశానంటే?


సుధీర్ అంటే కామెడీ ఇమేజ్ ఉంది. మాస్ ఆడియెన్స్‌కి కూడా సుధీర్ అంటే ఇష్టమే. పూర్తి కమర్షియల్ సినిమా చేయాలనే ఉద్దేశ్యంతోనే గాలోడు చేశాను. ప్రయోగాలు చేస్తుండాలని అందరూ చెబుతుంటారు. ఇమేజ్ మార్చే సినిమా వస్తే ప్రయత్నం చేయాలి. జనాలు చూస్తారా? లేదా? అన్నది తరువాత. కానీ మనం మాత్రం ప్రయత్నం చేయాలి. హీరోగా కంటే నేను ఎంటర్టైనర్ అని అనిపించుకునే దానిలో నాకు ఎక్కువ సంతోషం ఉంటుంది. కమెడియన్, హీరో అనిపించుకోవాలని నాకు లేదు అని సుధీర్ చెప్పారు.

రష్మీ గౌతమ్‌కే ముందు కథ చెప్పారు..

రష్మీ గౌతమ్‌కే ముందు కథ చెప్పారు..

గాలోడు సినిమా కథ ముందుగా రష్మీ గౌతమ్ గారికే చెప్పారు. ఆమె డేట్స్ కుదరకపోవడంతో రష్మీ చేయలేదు. బుల్లితెరపై మా ఇద్దరి కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉంది. వెండితెరపై మేం ఇద్దరం కలిసి చేయాలని అనుకుంటున్నాం. మంచి కథ దొరికితే మాత్రం కచ్చితంగా చేస్తాం అని సుధీర్ అన్నారు.

రష్మీతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అలా..

రష్మీతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అలా..


హీరోయిన్‌తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అంటే నాకు అంతగా ఇష్టం ఉండదు. రష్మీ గారికి నాకు ఎందుకు అలా కుదిరిందంటే.. మేం ఇద్దరం పట్టుకోం.. ముట్టుకోం. కళ్లతోనే మా భావాలు చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాం. ఆన్ స్క్రీన్ మీద రొమాన్స్ మాత్రం వద్దని చెబుతాను. కానీ డైరెక్టర్‌కు నేను చెప్పే పొజిషన్‌లో లేను. ఆ స్థాయికి వచ్చినప్పుడు మాత్రం కచ్చితంగా అలాంటివి వద్దని చెబుతాను అని సుధీర్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X