twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డార్లింగ్... సినిమా సూపర్ హిట్... ఎనీ డౌట్స్ అంటున్నారు.. NVNN గురించి సందీప్ కిషన్

    |

    సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంట్టైన్మెంట్స్ సమర్పణలో రూపొందిన ఈ సినిమా జూలై 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా సందీప్ కిషన్ తో ఇంటర్వ్యూ ...

     మంచి సినిమా చేశాననే తృప్తి లభించింది

    మంచి సినిమా చేశాననే తృప్తి లభించింది

    నన్ను వీడని నీడ 'వెన్నెల' కిషోర్! అతడు నన్ను ఎందుకు వీడటం లేదనేది కథ. కొత్తగా ఉంటుంది. ఆల్రెడీ సినిమా చూశా. మంచి సినిమా చేశాననే ఫీలింగ్ వచ్చింది. కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. నాకు అయితే సినిమా చాలా చాలా నచ్చింది. బావుంది. హీరోయిన్‌కి డ‌బ్బింగ్ చెప్పాక... చిన్మయి 'అరే... మంచి సినిమా తీశావ్' అని చెప్పింది. రీరికార్డింగ్‌కి త‌మ‌న్‌కి సినిమా పంపిస్తే, ఫోన్ చేసి 'డార్లింగ్... సినిమా సూపర్ ఉంది. హిట్' అన్నాడు. 'బావుందా?' అని అడిగా. 'డౌట్స్ ఏం పెట్టుకోకు. హిట్' అన్నాడు. శుక్రవారం థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు కూడా బావుందని అంటారు. నాకు మంచి పేరు తీసుకొచ్చే చిత్రమిది.

     తెరపైనే చూస్తేనే మజా

    తెరపైనే చూస్తేనే మజా

    నేను చెప్పను. మీరు సినిమాలో చూడండి. ఆ కుర్రాడి ఆత్మ 'వెన్నెల' కిషోర్ కావొచ్చు. పూర్వ జన్మలో నేనే 'వెన్నెల' కిషోర్ కావొచ్చు. ఆ కథను మేం రిఫరెన్స్ తీసుకున్నామా? అనేది తెరపై చూడాలి. హారర్ ఫాంటసీ ఫిల్మ్. ఎమోషన్ కూడా ఉంటుంది.

    నాకు హారర్ సినిమాలంటే ఇష్టం

    నాకు హారర్ సినిమాలంటే ఇష్టం

    నాకు హారర్ సినిమాలు ఇష్టం. చూస్తూ ఎంజాయ్ చేస్తాను. యాక్ట‌ర్‌గా ప‌ర్‌ఫార్మెన్స్‌కి స్కోప్ ఉండదని ఫీలింగ్‌తో హార‌ర్ జాన‌ర్ ట‌చ్ చేయ‌లేదు. హారర్ జానర్ ట్రెండ్ నడిచినప్పుడు కూడా నేను అటువైపు వెళ్ళలేదు. కానీ, ఈ కథ విన్నప్పుడు హారర్ ను మించి ఒక విషయం ఉంది. అది నన్ను బాగా ఎగ్జయింటింగ్ అనిపించింది. థియేటర్ల నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులు కూడా ఇదొక హారర్ సినిమా అని చెప్పరు. వేరే అనుభూతితో వస్తారు. అందుకని, ఇన్నాళ్లు యాక్ట్ చేసిన నేను ఈ సినిమాతో నిర్మాతగా మారాను.

     పోసాని కృష్ణ మురళీ ఇరుగదీశాడు

    పోసాని కృష్ణ మురళీ ఇరుగదీశాడు

    హారర్ యూనివర్సల్ జానర్. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'లా తీసినా హిట్ అవుతుంది. 'గృహం'లా తీసినా, 'ప్రేమకథా చిత్రమ్'లా తీసినా హిట్ అవుతుంది. మా సినిమాలో కామెడీ ఉంటుంది. కానీ, కామెడీ కోసమని ఎక్కడా కామెడీ పెట్టలేదు. సినిమాలో నాకు అద్దంలో కనిపించేది 'వెన్నెల' కిషోర్. అంతకంటే ఏం చెప్పను? కథలో భాగంగా కామెడీ వస్తుంది. పోసాని కృష్ణమురళిగారు ఇరగదీశాడు. హారర్, కామెడీ కంటే ఎమోషన్ ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంటుంది.

    25 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందంటే

    25 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందంటే

    కథ చెప్పడానికి వచ్చే ముందు హారర్ సినిమా అని చెప్పలేదు. 'కొత్త కథ ఒకటుంది. వినండి' అంటే కలిశా. కథ చెప్పడం స్టార్ట్ చేశారు. పది నిమిషాలకు హారర్ కథ చెప్తున్నారేంటి? అనుకున్నాను. ముందుకు వెళ్లగా వెళ్లగా కథ స్వరూపమే మారింది. ఇదొక జానర్ షిఫ్టింగ్ ఫిలిం. కథ 2043లో మొదలవుతుంది. మళ్ళీ వర్తమానానికి వస్తుంది. ప్రజెంట్ నుంచి మళ్లీ ఫ్యూచర్ కి వెళ్తుంది. హారర్ జానర్ దాటి ఎమోషనల్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఒక ఐదు నిమిషాల పాటు 25 ఏళ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందనేది చూపించాం.

    English summary
    Ahead of the release of 'Ninu Veedani Needanu Nene' on July 12, Sundeep Kishan talks about the movie, what makes it so different, why it's not a regular horror flick, why he turned a producer and more. He said, Horror is a universal genre that can be enjoyed by all sections of audience. There have been novel films in the genre - like 'Ekkadiki Pothavu Chinnavada', 'Gruham', 'Prema Katha Chitram'. As I said, my film is more than just horror. The audience will not say that 'NVNN' is just a horror film after watching it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X