Don't Miss!
- News
అటెన్షన్ అమరావతి: అందరి చూపూ అటు వైపే..!!
- Sports
పాపం సర్ఫరాజ్‌ఖాన్.. సెలెక్టర్ల బాక్స్ బద్దలు కొట్టినా ఎంపికవ్వలేదు: రవిచంద్రన్ అశ్విన్
- Lifestyle
సంబంధంలో సాన్నిహిత్యం, నమ్మకాన్ని పెంపొందించడానికి చిట్కాలు
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
వైఎస్ జగన్‌తో అలా ఎంజాయ్.. ఈ ఐదేళ్లే కాదు.. మరెన్నో ఏళ్లు అధికారంలో.. సూర్య
దక్షిణాదిలో స్టార్ హీరో సూర్య, ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. వారిద్దర మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తాజా ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అఖండ విజయం సాధించడంపై సూర్య ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన నటించిన ఎన్‌జీకే సినిమా మే 31న రిలీజ్ కానున్న నేపథ్యంలో సూర్య తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్‌తో ఉన్న అభిమానాన్ని, అనుబంధాన్ని వెల్లడించారు. సూర్య చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

జగనన్న అని పిలుస్తాను
వైఎస్ జగన్మోహన్‌రెడ్డితోపాటు వారి కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. నేను జగనన్న అని పిలుస్తాను. వైఎస్ జగన్ కజిన్స్ అనిల్ రెడ్డి నాకు క్లాస్ మెట్స్. మరో కజిన్ సునీల్ నాకు మంచి ఫ్రెండ్. మేమిద్దరం కలిసి చదువుకొన్నాం. జగన్ అలా నాకు పరిచయం. మేమిద్దరం చెన్నైలో కలుసుకొనే వాళ్లం. ఆ సమయంలో ఎక్కువగా ఐస్ క్రీం పార్లర్లకు వెళ్లే వాళ్లం. జగన్‌కు ఐస్ క్రీమ్ అంటే ఎక్కువగా ఇష్టం. మేము ఎంజాయ్ చేయడానికి అదో కారణం అని హీరో సూర్య అన్నారు.

జగన్‌ను ఎక్కువగా కలుసుకోలేకపోయాను
నా ప్రొఫెషన్ వేరే అయినందున వైఎస్ జగన్‌ను ఎక్కువగా కలుసుకోలేకపోయాను. కానీ అనిల్ రెడ్డిని ప్రతీ విషయాన్ని అడిగి తెలుసుకొన్నాను. పదేళ్ల క్రితం వారి కుటుంబానికి జరిగిన అన్యాయంతో నాతోపాటు అందరూ తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. వైఎస్ జగన్ జీవితంలో చాలా సంఘటనలు చోటుచేసుకొన్నాయి. వాటన్నింటిని తట్టుకొని తాను అనుకొన్నది సాధించాడు అని సూర్య పేర్కొన్నారు.

వైఎస్ జగన్ పట్టుదల.. కృషి గొప్పది
గత పదేళ్లలో ఎన్నో కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యారు. ఎన్నో కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆయన పట్టుదల, కృషి, అంకుఠిత దీక్ష చాలా బలమైనది. ఆయన పట్టుదల చూసి ప్రజలు ఆయనకు అధికారం అప్పగించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు లభించిన విజయాన్ని బట్టి జగన్‌పై ఎన్ని ఆశలు పెట్టుకొన్నారో అర్ధమవుతుంది. ప్రజల ఆకాంక్షను జగన్ నెరవేరుస్తారని నేను ఆశిస్తున్నాను అని సూర్య అభిప్రాయపడ్డారు.

ఆయనపై గొప్ప భారం ఉంది
ప్రజలు కోరుకొనే మార్పును వైఎస్ జగన్ సాధిస్తాడు. ఆయనపైన హిమాలయాలంత భారం ఉంది. తప్పకుండా అన్నీ సాధిస్తాడు. రాజకీయాలంటే బిగ్ గేమ్. దానిలో సక్సెస్ అవుతాడు. ఈ ఐదేళ్లే కాదు. మరెన్నో సంవత్సరాలు అధికారంలోకి వస్తాడని ఆశిస్తున్నాను. ఆయన విజన్‌తో ఏపీ ప్రజలకు మేలు చేయాలని అనుకొంటాను అని జగన్‌పై హీరో సూర్య ప్రశంసలతో ముంచెత్తారు.