twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్యాన్స్ మధ్య సినిమా చూస్తే కిక్కే వేరు.. ఈలల వేసి గోల చేస్తూ.. సుస్మిత కొణిదెల

    |

    మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'వాల్తేరు వీరయ్య' ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించిన వాల్తేరు వీరయ్య అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మెగామాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించిన సుస్మిత కొణిదెల మీడియాతో మాట్లాడుతూ...

    వాల్తేరు వీరయ్య కథ చెప్పినప్పుడే నా మైండ్‌లో చాలా ఆలోచనలు వచ్చాయి. నాన్నను డిఫరెంట్‌గా చూపించాలని డిసైడ్ అయ్యాను. దర్శకుడు బాబీ ఆలోచనలు, నా ఆలోచనలు దాదాపు కలిశాయి. వాల్తేరు ఫోర్ట్, ఫిషర్ మ్యాన్, గ్యాంగ్ లీడర్ మాదిరిగా వింటేజ్ లుక్ అనగానే... నాకు పూర్తిగా క్లారిటీ వచ్చింది. నాన్నను మాస్ హీరోగా చాలా సినిమాల్లో చూడటం వల్ల పెద్దగా వీరయ్య పాత్ర కోసం రీసెర్చ్ అవసరం పడలేదు. క్యారెక్టరైజేషన్‌కు తగినట్టుగా వర్క్ చేశాం అని సుస్మిత చెప్పారు.

    Susmitha Konidela Interview about Waltair Veerayya and Chiranjeevi

    నాన్న (చిరంజీవి) గారితో పనిచేసేటప్పుడు ఫ్యాషన్ డిజైనర్‌గానే ఆలోచిస్తా. నాన్నగారితో డిజైన్ల గురించి చర్చిస్తాం. ఆయన సూచనలను స్వీకరించాం. లుంగీ డిజైన్లు, షర్ట్స్, గాగూల్స్ లాంటివి గురించి చెప్పారు. అయితే వింటేజ్ లుక్ అయినప్పటికీ.. పీరియాడిక్ సినిమా కావడంతో కాస్త పని సులభమైంది. వింటేజ్ లుక్ కావడంతో యూత్కు నచ్చేలా చేశాం. ఆయన లుక్‌కు వస్తున్న రెస్పాన్స్ చూసి హ్యాపీగా ఉంది అని సుస్మిత పేర్కొన్నారు.

    నాన్న గారి సినిమాను ఫ్యాన్స్ మధ్య కూర్చుని చూస్తే.. ఆ కిక్కు వేరే ఉంటుంది. ఫ్యాన్స్‌తోపాటు విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తాం. అభిమానిగా మేము చేసే పని అది. వాల్తేరు వీరయ్య సినిమాకు ఉదయం నాలుగు గంటలకు యూనిట్ అందరితో కలిసి వెళ్లాం. ఫ్యాన్స్‌తోపాటు ఈలలు వేస్తూ.. గోల చేస్తూ అరిచి ఎంజాయ్ చేశాం అని సుస్మిత కొణిదెల చెప్పారు.

    English summary
    Mega Star Chiranjeevi daughter Susmitha Konidela worked as Fashion designer for Waltair Veeraiah. She spokes about her father styles and work experience with Waltair Veeraiah experience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X