For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Syed Sohel Ryan ఆటపట్టించిన పిడుగులు.. బిగ్‌బాస్ సెలబ్రిటీ అలా హౌజ్ అరెస్ట్ అయి..

  |

  టాలీవుడ్‌ హీరో కార్తికేయ గుమ్మకొండ నటించిన 90ml చిత్రంతో దర్శకుడిగా పరిచమైన శేఖర్ రెడ్డి ఎర్ర రూపొందించిన తాజాగా చిత్రం హౌజ్ అరెస్ట్. ప్రతిభావంతులైన బాల నటులతో రూపొందించిన ఈ చిత్రంలో మంచి సామాజిక సందేశంతోపాటు పూర్తిస్థాయి వినోదంగా ఉందనే టాక్ వినిపిస్తున్నది. హౌజ్ అరెస్ట్ చిత్రంలో నటించిన ఐదుగురు బాల నటులు పెర్ఫార్మెన్స్ గురించి సినీ వర్గాలు గొప్పగా చెప్పుకొంటున్నారు. ఆగస్టు 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలోని చైల్డ్ ఆర్టిస్టులను బిగ్‌బాస్ ఫేమ్ సోహైల్ ర్యాన్‌తో ముచ్చటించడానికి ప్రయత్నంగా.. ఆయనను ఓ రేంజ్‌లో ఆట్టుకొన్నారు. సోహైల్ ర్యాన్ పరిస్థితి ఏమిటో ఓసారి చూద్దాం.

  హౌజ్ అరెస్ట్‌కు మంచి రెస్సాన్స్

  హౌజ్ అరెస్ట్‌కు మంచి రెస్సాన్స్

  ఇక హౌస్ అరెస్ట్ విషయానికి వస్తే.. మణిరత్నం రూపొందించిన అంజలి, ఇటీవల వచ్చిన లిటిల్ సోల్జర్స్ చిత్రాల తర్వాత మంచి ఫీల్‌గుడ్‌తో ఉన్న కిడ్స్ మూవీ ఇంత వరకు రాలేదు. ఆ కోవలో వచ్చిన చిత్రమే హౌజ్ అరెస్ట్. ఆగస్టు 27న రిలీజ్ అయిన ఈ చిత్రం గురించి మంచి ఫీడ్ బ్యాక్ వస్తున్నది. శేఖర్ రెడ్డి టేకింగ్, పిల్లల్నితో యాక్టింగ్ రాబట్టుకొన్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, తాగుబోతు రమేష్, తదితరులు నటించిన ఈ చిత్రం థియేటర్లలో గుడ్ రెస్పాన్స్‌ను అందుకొంటున్నది. ఈ నేపథ్యంలో పిల్లల్ని ఇంటర్వూ చేశాడు...

  సోహైల్ నీవు ఇంటెలిజెంటే అనుకోవచ్చు

  సోహైల్ నీవు ఇంటెలిజెంటే అనుకోవచ్చు

  హౌజ్ అరెస్ట్ చిత్రంలో వశీ, శివ, ఖుషి, నేత్ర, రితేష్ నటించారు. వారి పేర్లను చెప్పి నేను ఇంటెలిజెంట్‌నే కాదా అని సోహైల్‌ అంటే అతడికి ఇంటెలిజెంట్ అనుకోవచ్చు అని షాకిచ్చారు. మీరు ఏ సినిమాలో నటించారు అని సోహైల్ అడగక ముందే మేము యాక్టింగ్ నేర్చుకొనే సినిమాల్లోకి వచ్చాం అని ఖుషీ అంటే.. నేను అడగలేదుగా అని సోహైల్ అంటే.. నీవు అడగక ముందే చెప్పామని సమాధానం ఇచ్చారు.

  మీ కంటే చిన్నోడిని అంటూ సోహైల్

  మీ కంటే చిన్నోడిని అంటూ సోహైల్


  బాలనటుడు వశీ ఇప్పటికే 90ml చిత్రంలో నటించగా, శివ నాకు హౌజ్ అరెస్ట్ రెండో మూవీ. నా ఫస్ట్ లవకుశ అని చెప్పారు. ఖుషి చెబుతూ నాకు ఐదో సినిమా. రితేష్ చెబుతూ .. ప్రతీ రోజు పండుగే, డియర్ కామ్రేడ్, సైరా నర్సింహరెడ్డి, అఖండ, 18 పేజెస్ చిత్రాల్లో నటించానని చెప్పారు. దాంతో పిల్లలందరూ నాకంటే సీనియర్స్.. నేను చిన్నోడిని నేను అంటూ సోహెల్ చెప్పారు. ఆ తర్వాత సోహైల్ విపరీతంగా ఆటపడ్డించారు.

  సింగరేణి ముద్దు బిడ్డ అని ఎందుకు అంటారంటే

  సింగరేణి ముద్దు బిడ్డ అని ఎందుకు అంటారంటే

  ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన సోహైల్‌ను ఇంటర్వ్యూ చేస్తూ.. నిన్ను సింగరేణి ముద్దు బిడ్డ అని ఎందుకు అంటారు అని వశీ.. అడిగితే.. నా డాడీ సింగరేణిలో పనిచేస్తారు అందుకే నన్ను సింగరేణి ముద్దు బిడ్డ అంటారు అని సోహైల్ సమాధానం ఇచ్చారు. రితేష్ ప్రశ్న అడుగుతూ.. చిన్నప్పుడు నీవు అల్లరి చేస్తే మీ నాన్న ఎలా రియాక్ట్ అయ్యేవారు అంటే.. నన్ను మా నాన్న పట్టించుకొనే వారు కాదు. మా డాడీ గాలికి వదిలేశాను. అందుకే నేను ఇలా తయరయ్యాను అంటూ సోహైల్ సమాధానం చెప్పారు.

  ఖర్ఖానాలో ఏం చేసేవాడివి అంటే..

  ఖర్ఖానాలో ఏం చేసేవాడివి అంటే..


  సోహైల్‌ను నేత్ర ప్రశ్న అడుగుతూ.. నీవు బిగ్‌బాస్‌లో వంట చాలాసార్లు చేశావు కదా.. ఈ వంట ఎక్కడ నేర్చుకొన్నారు అంటే.. 12 ఏళ్లుగా బ్యాచ్‌లర్ లైఫ్. నా ఫ్రెండ్స్ అందరూ పేకాట ఆడుతూ.. నాతో ఏదో ఒక వంట చేయించే వాళ్లు. అలా నేను నాకు తెలియకుండానే వంట చేశాను అని సోహైల్ చెప్పారు. ఇక ఖుషి ప్రశ్నిస్తూ. కార్ఖానా అంటే ఏమిటి? అని అడిగితే.. రాత్రి 9 తర్వాత చదువుకోవడమన్న మాట. హెల్తీ కూల్ డ్రింక్ తాగడం అని అంటే.. కూల్ డ్రింక్స్‌లో హెల్తీగా ఉంటాయా? అని ఎదురు ప్రశ్న వేసి కంగుతినిపించారు. దాంతో మీకు దొరికేశానా అంటూ సోహైల్ అంటే.. కూల్ డ్రింక్ కాదు.. హెల్తీ జ్యూస్ అంటూ సోహైల్ సర్ది చెప్పుకొన్నారు. అయితే హెల్తీ కూల్ డ్రింక్ గురించి మరోలా చెప్పారని అని పిల్లలు అడిగితే దానిని సర్దిచెప్పడానికి చాలా కష్టపడ్డారు.

  మీరు ఫేమస్ అవ్వడం గ్యారెంటీ

  మీరు ఫేమస్ అవ్వడం గ్యారెంటీ


  ఖుషి మరో ప్రశ్న అడుగుతూ.. నీకు ఎందుకంత కోపం అంటే.. నేనో పిచ్చివాడిని. నా బ్యాచ్‌లో అంతా అలానే ఉంటారని సోహైల్ చెప్పడంతో పిల్లలంతా నవ్వుల్లో మునిగిపోయారు. అయితే మా హౌస్ అరెస్ట్ ట్రైలర్, టీజర్ చూశారా అంటే.. ట్రైలర్ అదిరిపోయింది. అలాంటి కాన్సెప్ట్ ఎక్కడా రాలేదు. మీరంతా బాగా చేశారనిపించింది. ఈ సినిమా ద్వారా మీరంతా ఫేమస్ అవుతారు. ఎప్పుడైనా నేను కనిపిస్తే.. నన్ను పట్టించుకోండి అంటూ సోహైల్ అన్నాడు. దాంతో అన్న నీవు హీరో అయితే నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే.. అరేయ్.. నేను ఇప్పటికే ఒక సినిమా చేశాను. రెండో సినిమా కూడా చేస్తున్నాను.. నేను హీరోనా కాదా.. నా ఇజ్జత్ తీస్తున్నారురా మీరంతా అని సోహైల్ కంగారుపడిపోయారు.

  Sohel Fun With House Arrest Movie Kids..నవ్వులే నవ్వులు

  సోహైల్ నీవు అప్‌కమింగ్ స్టార్‌వు అంటూ..


  హౌస్ అరెస్ట్ పోస్టర్ చూస్తూ.. చిన్న పిల్లలైనా మీకు అవకాశం ఇస్తే.. దేశాన్ని అమ్మేస్తారు అంటే.. మేము చిన్న పిల్లలు కాదు.. చిచ్చర పిడుగులం. పిడుగులకే పిడుగలం అంటూ సోహైల్‌ను ఆటపట్టించారు. ఈ సినిమా గురించి, మీ యాక్టింగ్ గురించి అడిగితే.. డైరెక్టర్ మీ గురించి, మీ యాక్టింగ్ స్కిల్స్ గురించి గొప్పగా చెప్పారు అందుకు కంగ్రాట్స్ అని సోహైల్ అంటే.. మీకు కూడా కంగ్రాట్స్.. ఎందుకంటే.. మీరు అప్ కమింగ్ హీరో కద అని సోహైల్‌ను ఖుష్ చేశారు. దాంతో సోహైల్ గాలిలో తేలిపోయినంత పనిచేశారు. బిగ్ బాస్‌కు ఎందుకు వెళ్లావని అడిగితే.. మూడు నెలలు ఇంటి రెంట్, ఫుడ్, కారు ఈఎంఐలు లేకుండా బిందాస్ లైఫ్ గడపడానికి వెళ్లాను.. హ్యాపీగా జీవితాన్ని గడపడమే నా లైఫ్ ఫిలాసఫీ అంటూ సోహైల్ చెప్పారు.

  English summary
  Bigg Boss Telugu 4 fame Syed Sohel Ryan Funny interviewed with House Arrest's Child artists. This interview went very Intertaining.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X