twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Telangana Devudu కేసీఆర్‌గా శ్రీకాంత్‌ను ఎందుకు ఎంపిక చేశామంటే.. ఆ డిగ్నిటి కోసమే.. దర్శకుడు వడత్యా హరీష్

    |

    ఉద్యమ నాయకుడిగా శ్రీకాంత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం తెలంగాణ దేవుడు. జిషాన్‌ ఉస్మాన్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ దర్శకుడు సాగర్ శిష్యుడైన వడత్యా హరీష్ ఈ చిత్రానికి దర్శకుడు. మొహమ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ నిర్మాత. ఈ చిత్రాన్ని ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు వడత్యా హరీష్ మీడియాతో మాట్లాడుతూ..

    ప్రశ్న:తెలంగాణ రాష్ట్ర చరిత్రపై చాలా సినిమాలే వచ్చాయి.. మరి మీ చిత్రం ఎలా ఉండబోతోంది?
    జవాబు: అవునండి రెండు సినిమాలు వచ్చాయి కానీ.. ఒకటి తెలంగాణ ఉద్యమం మీద మాత్రమే వచ్చింది.. ఇంకొకటి విడుదల కాలేదని తెలిసింది. కానీ మా 'తెలంగాణ దేవుడు' చిత్రం చాలా సవివరంగా ఉంటుంది. 1969 నుంచి కథను తీసుకోవడం జరిగింది ముఖ్యంగా కేసీఆర్‌గారి చిన్నతనం నుండి మొదలుకొని తన కాలేజ్ లైఫ్, ఉద్యయం, సీఎం వరకు కథ సాగుతుంది. కనుకే కేసీఆర్‌గారి జీవితం గురించి ఫ్రెష్‌గా చెబుతున్నాననే భావించి కమర్షియల్ బయోపిక్‌లా సినిమాను చేయడం జరిగింది. ఇందులో సాంగ్స్ కూడా పెట్టడం జరిగింది. ఆయనకు సాహిత్యం పట్ల అవగాహన ఉంది కనుకే జై బోలో తెలంగాణలో ఓ పాట కూడా రాయడం జరిగింది. అంతే కాదు ఆయన ఎక్కువగా సీనియర్ ఎన్ టి ఆర్, శోభన్ బాబు గారి సినిమాలు కూడా చూసే వారు అందుకే ఆ వే లో కూడా ఆయన్ను చూపించడం పాటలు పెట్టడం కూడా జరిగింది. చూసే ఆడియన్స్ కు కూడా మరీ డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ కలగనీయకుండా ఎక్కడ ఎమోషన్ ఉండాలి, ఎక్కడ కామెడీ ఉండాలి అని ఆలోచించి పెట్టడం జరిగింది.

    ప్రశ్న: సీఎం అయ్యేవరకు కథ ఉంటుందా లేక పరిపాలన విధానం కూడా ఉంటుందా?
    జవాబు: ఆయన చిన్నతనం నుంచి సీఎం అయ్యే వరకు ఉంటుంది.. ఆ తరువాత నాలుగేళ్ళ పరిపాలనను జస్ట్ టచ్ చేయడం జరిగింది.

    ప్రశ్న: తెలంగాణ దేవుడు కథ అనుకున్నప్పుడే శ్రీకాంత్ గారిని అనుకున్నారా?
    జవాబు: కథ రాసుకుంటున్నప్పుడే శ్రీకాంత్ గారినే అనుకొని రాయడం జరిగింది. ఆయన ఎన్నో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు చేశారు కానీ ఈ సినిమా లాంటి పాత్ర చేయలేదు. చాలా డిఫరెంట్‌గా ఆయనని చూపించడం జరిగింది. ఆయన హీరోయిజాన్ని కూడా ఎలివేట్ చేయడం జరిగింది. అయితే శ్రీకాంత్‌గారి చిన్నప్పటి పాత్ర అనుకోగానే జిషాన్ అందుకు పర్ఫెక్ట్ అనుకున్నాను. ఎందుకంటే శ్రీకాంత్ గారి హైట్, కలర్ బాడీ లాంగ్వేజ్ అన్నీ.. కానీ జిషాన్ ఉస్మాన్‌లో కనిపించాయి. అందుకే జిషాన్‌ను తీసుకోవడం జరిగింది.

    Telangana Devudu director Vadatya Harish about KCR Biopic

    ప్రశ్న: శ్రీకాంత్‌గారు కేసీఆర్ గారి బాడీ లాంగ్వేజ్‌ను ఇమిటేట్ చేశారా?
    జవాబు: అవునండి మరీ ఎక్కువగా కాదు ఆయన అసెంబ్లీ‌లో కౌంటర్లు వేయడం, తల ఊపడం, నడక లాంటివి ఇమిటేట్ చేయడం జరిగింది. అయినా కేసీఆర్‌గారి పాత్రకు ఒక డిగ్నిటీ ఉంటుంది. అందుకే శ్రీకాంత్‌గారి పర్సనాలిటీ అయితే సూట్ అవుతుందని అనిపించింది.

    ప్రశ్న: తెలంగాణ దేవుడు సినిమాలో శ్రీకాంత్ గారి పాత్ర, జిషాన్ పాత్ర ఎంత వరకు ఉంటాయి?
    జవాబు: ఫస్టాఫ్‌లో శ్రీకాంత్ గారి పాత్ర ఉంటుంది. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్‌లో చిన్ననాటి పాత్ర ఉంటుంది.. అప్పుడే జిషాన్ పాత్ర మొదలవుతుంది.

    ప్రశ్న: తెలంగాణ దేవుడు సినిమాలో ఆంధ్ర-తెలంగాణ అనే అంశాన్ని ఎలా చెప్పారు?
    జవాబు: చాలా స్నేహపూరితంగా చెప్పడం జరిగింది. సెన్సార్ వాళ్ళు చూసి చాలా బాగా చెప్పారని అభినందించి ఒక్క కట్ కూడా చెప్పలేదు.

    Recommended Video

    Mallika Sherawat Fires On Bollywood Director || Filmibeat Telugu

    ప్రశ్న: తెలంగాణ దేవుడులో ప్యాడింగ్ ఎక్కువగా ఉన్నట్టుంది?
    జవాబు: అవునండి.. పోసాని, బ్రహ్మనందం, అలీ, జబర్దస్త్ టీమ్‌లో ఓ నలుగురు, మధుమిత, వెంకట్ ఇలా చాలా మంది ఉన్నారు.. అంటూ ముగించారు.

    English summary
    Telangana Devudu director Vadatya Harish about KCR Biopic
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X