Thaman: నా మాటలను అపార్థం చేసుకున్నారు.. రామ్ చరణ్ హుక్ స్టెప్స్‌ వివాదంపై తమన్ క్లారిటీ

Ram Charan -Thaman: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టిన రామ్ చరణ్, అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. చిరుత సినిమాతో టాలీవుడ్ లో రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చారు. మగధీరతో టాలెంట్, స్టామినా చూపించారు. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ స్థాయికి చేరాడు. అయితే.. ఈ ఏడాది భారీ అంచనాలతో విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. కానీ, ఈ సినిమా అభిమానులను నిరాశ పరిచింది. ఈ సమయంలో ఓ వివాదం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తాజాగా ఆ కాంట్రవర్సీపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్పందించారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సెన్సెషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరెక్కిన సినిమా 'గేమ్ ఛేంజర్'. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాలతో సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. కానీ, మిక్స్డ్ టాక్ సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. ఈ మూవీ ఫలితంపై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు సోషల్ మీడియాలో అనేక వాదనలు వినిపించాయి. ముఖ్యంగా, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Thaman Clarifies Ram Charan Game Changer Hook Steps Controversy

హుక్ స్టెప్స్ వివాదం

గేమ్ ఛేంజర్ సినిమా ఫెయిల్యూర్ తర్వాత తమన్ చేసిన ఒక కామెంట్ చర్చనీయాంశమైంది. ఆయన మాట్లాడుతూ, " హీరో- హీరోయిన్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా హుక్ స్టెప్స్ లేకపోవడమే సినిమాకు మైనస్ అయింది" అని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ను కొంతమంది తమన్ కావాలని రామ్ చరణ్‌ను టార్గెట్ చేసినట్లుగా ప్రచారం చేశారు. ఈ వివాదం సోషల్ మీడియాలో సెన్సెషన్ గా మారింది. మెగా ఫ్యాన్స్ రెచ్చిపోయారు. తమన్ ను టార్గెట్ చేస్తూ తెగ కామెంట్స్ చేశారు. కానీ, అప్పుడు ఈ విషయంపై అటు రామ్ చరణ్ గానీ, ఇటు తమన్ గానీ స్పందించలేదు.

తమన్ రియాక్షన్

తాజాగా ఈ వివాదంపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్లారిటీ ఇచ్చారు. నేను ఒకటి చెప్పాను, కొందరు దాన్ని వేరేలా అర్థం చేసుకుని ప్రచారం చేశారు. నేను హీరోను టార్గెట్ చేసి మాట్లాడినట్లేదు. గేమ్ ఛేంజర్ విషయంలో రామ్ చరణ్ డ్యాన్స్ టాలెంట్‌ను సరిగ్గా వాడుకోలేకపోయారన్నది నా బాధ. ఆయన గొప్ప వ్యక్తి. అందుకే ఆయన్ని 'మెగా హార్ట్ స్టార్' అని పిలుస్తుంటాను. నా మాటలను కొందరు వక్రీకరించారు 'ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

'రామ్ చరణ్ ఓ పెద్ద డ్యాన్సర్. ఫస్ట్ మూవీ నుంచే ఆయన ఎనర్జీని చూపించారు. "రామ్ చరణ్ పెద్ద డ్యాన్సర్. మొదటి సినిమా 'నాయక్'లో లైలా ఓ లైలా, 'బ్రూస్ లీ'లో మెగా మెగా మీటర్ వంటి పాటలకు అద్భుతంగా స్టెప్పులు ఇచ్చారు. అలాంటి ఆయనకు కొరియోగ్రాఫర్లు సరైన మూమెంట్స్ ఇవ్వలేకపోయారు. అలాంటి టాలెంటెడ్ హీరోకు సరైన హుక్ మూమెంట్స్ ఇవ్వలేకపోయారనేది నా బాధ. కానీ, హీరోపై నెగిటివ్‌ కామెంట్స్ చేయలేదు 'అని తమన్ అన్నారు.

తమన్ ఇంకా మాట్లాడుతూ రామ్ చరణ్‌తో తన సంబంధం ఎల్లప్పుడూ స్నేహపూర్వకంగానే ఉందని, అలాగే 'ఓజీ' సినిమాకు సంబంధించి రామ్ చరణ్ తనతో ప్రత్యేకంగా మ్యూజిక్ గురించి మాట్లాడారని గుర్తు చేశారు. చరణ్ ఓ పాటను "ఫైర్ మోడ్.. తమన్, చేతులపై కిరోసిన్ పోసుకుని సంగీతం అందించావా?" అని ప్రశ్నించిన సందర్భాన్ని కూడా తెలిపారు. మొత్తానికి తమన్ వ్యాఖ్యల ద్వారా, 'గేమ్ ఛేంజర్' హుక్ స్టెప్స్ వివాదంపై పలు అపార్థాలను తొలగించి, రామ్ చరణ్‌పై గౌరవాన్ని, వారి స్నేహబంధాన్ని పబ్లిక్‌కు స్పష్టంగా తెలియజేశారు.

More from Filmibeat

Read more about: ram charam thaman game changer
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X