మహేశ్ బాబుతో 4 సినిమాలు.. 2 చిత్రాలతో జీవితం తలకిందులు.. నిర్మాత పరిస్థితి ఏమిటంటే?
తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఎదిగారు మహేశ్ బాబు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని దిగ్విజయంగా ముందుకు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా తను తీసే సినిమాల విషయంలో మహేశ్ బాబు ఎంతో శ్రద్ధ వహిస్తుంటారు. సక్సెస్ అందుకుంటాయని మినిమమ్ అంచనా ఉంటేనే కథలకు ఓకే చెబుతారు. అయినప్పటికీ మహేశ్ బాబు నటించిన కొన్ని చిత్రాలు ఊహించని విధంగా ఫ్లాప్ అయ్యాయి. అందులో ఒకే నిర్మాత మహేశ్ బాబుతో 4 సినిమాలు చేసి 2 చిత్రాలతో ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని ఇటీవల ఆయనే వెల్లడించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మహేశ్ బాబుతో నాలుగు సినిమాలకు ప్రొడ్యూస్ చేసే అవకాశం దక్కించిన నిర్మాత మరెవరో కాదు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ అధిపతి అనిల్ సుంకర. ఆయన సొంత బ్యానర్లో బిందాస్, నమో వెంకటేశ, ఆహా నా పెళ్లాంట, దూకుడు, వెన్నెల 1/2, లెజెండ్, పవర్, కృష్ణగాడి వీర ప్రేమ గాథ, హైపర్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇవిగాక మరిన్ని సినిమాలు కూడా అలా వచ్చి ఇలా వెళ్లాయి. ఇప్పటికీ ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తూనే ఉన్నాయి.

ఇక ఇదే బ్యానర్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఏకంగా 4 చిత్రాల్లో నటించారు. అందులో 2 బ్లాక్ బాస్టర్ కాగా, మరో 2 చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. 2011లో శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన దూకుడు, 2020లో అనిల్ రావిపూడి దర్శకత్వంలోని సరిలేరు నీకెవ్వరు చిత్రాలు మంచి ఫలితానిచ్చాయి. బ్లాక్ బాస్టర్స్ గా నిలిచాయి. ఇక మిగిలిన రెండు చిత్రాలు 1 నెనొక్కడినే, ఆగడు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ రెండు సినిమాలతో నిర్మాతపై కాస్తా ఆర్థిక భారం పడటంతో పాటు అంచనాలను తలకిందులు చేసిన చిత్రాలివేనని ఆయనే స్వయంగా చెప్పారు.
రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. దూకుడు సినిమా సమయంలో చాలా పాజిటివ్ గా ఉన్నాం. మహేశ్ బాబు కూడా ఎంతో సరదా ఉన్నారు. సెట్స్ లో బయట సినిమాపై పెద్దగా అంచనాలు లేకుండానే ఉన్నాం. కానీ ఆ చిత్రం భారీ సక్సెస్ ను అందించింది. ఇక ఆ తర్వాత వచ్చిన 1: నేనొక్కడినే చిత్రంతో ఒక రకంగా డిస్సాపాయింట్ చేసింది. ఓవర్ ఎక్స్ పెక్టేషన్స్ తో వెళ్లిపోయాం. ఆ సినిమాను మేం సరైన పద్ధతిలో చూపించలేకపోయాం. ముందే ఆ సినిమా ఇలాంటిదని స్టోరీ చెప్పేసి ఉంటే ఫలితాలు మరోలా ఉండేది. యాక్షన్ ఫిల్మ్ అని ప్రేక్షకుల థియేటర్స్ వచ్చారు. కొంచెం డిస్సాపాయింట్ చేశాం.
ఇక ఆగడు చిత్రం 1: నేనొక్కడినే సినిమాకు చేసిన తప్పునకు రివర్స్ లో చేసిన తప్పుడు. ఆ సినిమాలో స్లో అయితే.. ఈ చిత్రంలో కథనం చాలా స్పీడ్ అయ్యిపోయింది. కానీ ఈ చిత్రం విడుదలైన ఫస్ట్ 3 రోజులకు మారుమోగిపోయింది. 4వ రోజుకు టాక్ పూర్తిగా నెగెటివ్ అయ్యిపోయింది. అయితే 1 నేనొక్కడినే చిత్రానికి మాకు ఫ్లాప్ అని ఆలోచించే సమయం లేదు. అప్పుడే లెజెండ్, దూకుడు రీమేక్ అయ్యి ఆ సక్సెస్ లో పెద్దగా భారం పడలేదు. కానీ ఆగడు చిత్రంతో కొంత ఆర్థికంగా ఎఫెక్ట్ అయ్యిందని, వెనక్కి డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. చివరిగా నిర్మాత ప్రొడ్యూస్ చేసిన ఏజెంట్, భోళా శంకర్ చిత్రాలూ ఫ్లాప్ అయ్యాయి. అయినా మజాకా అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ నిర్మాత భారీ చిత్రాలను కాకుండా చిన్న సినిమాల ప్రాధాన్యత ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











