twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్థానం ఇవ్వగలం.. స్థాయిని తెచ్చుకోవాలి.. అదే అల వైకుంఠపురములో థీమ్.. త్రివిక్రమ్ కామెంట్స్

    |

    మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కలిసి చేసిన చిత్రం అల వైకుంఠపురములో. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి రెండు హిట్ చిత్రాలు రాగా.. హ్యాట్రిక్ కొట్టేందుకు అల వైకుంఠపురములోతో రాబోతోన్నారు. ఇప్పటికే పాటలతో రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేసింది అల వైకుంఠపురములో. ఇక టీజర్, ట్రైలర్ ఏ రేంజ్‌లో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జనవరి 12న రాబోతోన్న ఈ మూవీ విశేషాలను మీడియాతో పంచుకున్న త్రివిక్రమ్.. అనేక ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

    అంచనాలు పెరిగిపోతే..

    అంచనాలు పెరిగిపోతే..


    త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘ఎవరికైనా కెరీర్ స్టార్ట్ అయ్యేటప్పుడు తనలో ఉన్న ఆలోచనలన్నీ అందరికీ చెప్పెయ్యాలనీ, వాళ్లందరి ప్రశంసలూ పొందాలనీ, తన ఆలోచనలతో వాళ్లందరూ ఏకీభవించాలని ఉంటుంది. కొన్ని సంవత్సరాలు గడిచాక.. ప్రశంస తగ్గిపోతుంది, అంచనాలు పెరిగిపోతాయి. అప్రిసియేషన్ తగ్గిపోవడం మూలంగా, క్రియేట్ చేసేవాళ్లకు మన పనిలో ఏమైనా లోపముందా అనిపించే అవకాముంది. దాంతో దారి మార్చుకొని ఎందుకూ పనికిరాకుండా పోయే ప్రమాదమూ ఉంది. లేదంటే అంచనాలు పెరిగిపోవడం మూలంగా ఆ బరువుకు కుంగిపోయి, చెప్పాలనుకున్నది చెప్పలేక కుంగిపోయి, ఒక నార్మల్ లేదా సేఫ్ రూట్లోకి ఎస్కేప్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. ప్రతిసారీ ఈ రెంటినీ గెలవడానికి ఎవరైనా ప్రయత్నించాల్సిందే.

    అందుకే అల వైకుంఠపురములో..

    అందుకే అల వైకుంఠపురములో..

    'అజ్ఞాతవాసి' ఫ్లాపైన తర్వాత అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే.. ఆయనకు అలవాటైన హ్యూమర్లోకి, ఎంటర్టైన్మెంట్లోకి వెళ్లిపోతే బాగుంటుంది కదా.. అనిపిస్తుంది. నా చుట్టూ ఉన్నవాళ్లు కూడా ముందు దానివైపే తోస్తారు. నేనది చెయ్యలేదు. అది కావాలని తీసుకున్న డెసిషన్. ఎంత పరాజయం చూసినా కానీ కొత్తగా భయపెట్టేది ఏముంటుంది! ఈ భయాన్ని గెలవాలంటే ఇదే సమయం, ఇదే స్టెప్. అందుకని సీరియస్ గా ఉండే సబ్జెక్ట్ ట్రై చేశా. అందులో కమర్షియల్ గా ఉండే సాగ్స్ కానీ, హ్యూమర్ కానీ, ట్రాక్ కానీ.. అలాంటివేవీ మైండ్లోకి కూడా రానివ్వలేదు. దాన్ని నేను బిగ్గెస్ట్ టేకెవేగా ఫీలవుతా. 'అరవింద తర్వాత' మళ్లీ అలాంటి కథే చెప్పకూడదు కదా.. దాన్నుంచి బ్రేక్ కావాలి కదా.. ప్రతిసారీ మనం మారడానికి ప్రయత్నించడమే. అందుకే 'అల వైకుంఠపురములో' సినిమా తీశా.

    స్థానం ఇవ్వగలం కానీ..

    స్థానం ఇవ్వగలం కానీ..

    మనం ఎవరికైనా స్థానం ఇవ్వగలం కానీ, స్థాయి ఇవ్వలేం. స్థాయి అనేది ఎవరికి వాళ్లు తెచ్చుకోవాల్సింది. ఇదే థాట్ ఆఫ్ ద ఫిల్మ్. దానికి ఇల్లు ఆధారం. మనం ఏ కథ చెప్పినా రామాయణ భారతాలు దాటి చెప్పలేమనేది ఈ ప్రపంచంలో అందరూ ఒప్పుకొనే మాట. వాటిని దాటైతే మనం కొత్త కథ చెప్పలేం. అందువల్ల వాటికి సంబంధించిన ఏదో ఒక ఛాయ కథలో కనిపిస్తూ ఉండవచ్చు.

    అందుకే ఇంటి చుట్టూ..

    అందుకే ఇంటి చుట్టూ..


    మనం ప్రపంచం అంతా తిరగొచ్చు. కానీ ఇంటికొచ్చాక ఒక సుఖం వస్తుంది. ఇంటికొచ్చిన ఫీలింగే వేరు. అందుకే 'హోం కమింగ్' అంటాం. మనకు తెలీకుండానే ఇల్లు మన సంస్కృతిలో ఒక భాగం. అది చిన్నదే కావచ్చు. ఇంట్లో ఉంటే ఆ ఆనందమే వేరు. బహుశా నేను ఆ ఇంట్లో ఆనందాన్ని వెతుక్కొనే ప్రయత్నం చేస్తానేమో. అందుకే నా సినిమాల్లో కథకి ఇల్లు కేంద్రంగా ఉంటూ ఉండొచ్చు. 'అల.. వైకుంఠపురములో' మూవీలో 'వైకుంఠపురం' అనే ఇంటికి ఉన్న విలువను అలా సింబలైజ్ చేశాను. ఆ ఇంటికి హీరో వెళ్లడం ఎందుకు ముఖ్యమైన విషయమయ్యింది? అందుకే ఆ ఇంటికి ఆ పేరుపెట్టి, అదే సినిమాకి టైటిల్ గా పెట్టా'నని చెప్పుకొచ్చాడు

    English summary
    Trivikram About Ala Vaikunthapurramuloo In Media Interactions . Pooja Hegde, Tabu, Sushanth And Navadeep Are Main Lead. this movie Is Going To Be Realesed On 12th January.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X