For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  నా పేరు సూర్య విషయంలో అది జరిగింది.. నన్ను క్షమించండి.. వక్కంతం వంశీ

  By Rajababu
  |
  Vakkantham Vamsi Special Interview With Filmibeat

  అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం నా పేరు సూర్య. కథా రచయితగా మంచి పేరు తెచ్చుకొన్న వక్కంతం వంశీ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆర్మీ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈ చిత్రంపై అన్ని వర్గాల నుంచి ప్రేక్షకుల ప్రశంసలు అందుతున్నాయి. ఇప్పటికే వంద కోట్ల క్లబ్‌కు చేరువైన ఈ చిత్రం కలెక్షన్లపరంగా దూసుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో దర్శకుడు వక్కంతం వంశీ మీడియాతో ముచ్చటించారు. ఆయన వెల్లడించిన పలు విషయాలు తెలుగు ఫిల్మీబీట్ రీడర్ల కోసం..

   మంచి రెస్పాన్స్

  మంచి రెస్పాన్స్

  నా పేరు సూర్య చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తున్నది. సాధారణంగా ప్రతీ చిత్రానికి రిలీజ్ తర్వాత తొలి సోమవారం లిట్మస్ టెస్ట్ లాంటిది. అలాంటి రోజున కలెక్షన్ల బాగా ఉన్నాయి. జనరల్ ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. డైరెక్టర్ కావాలన్నది ఎన్నో ఏళ్ల కల. అందుకే ఆడియో ఫంక్షన్‌లో ఎమోషనల్ అయ్యాను. నా ఎన్నో ఏళ్ల కలకు మంచి ఫలితం లభించింది. మంచి అప్రిషియేషన్ వస్తున్నది.

   కథ రాసుకొన్న తర్వాతే

  కథ రాసుకొన్న తర్వాతే

  ప్రతీ ఆలోచనను నా పేరు సూర్య కథగా రాసుకొన్నాను. ఆ తర్వాతే అల్లు అర్జున్‌ను సంప్రదించాను. ఫిజికల్ ఫిటినెస్‌పై దృష్టిపెట్టే యువ హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. గంటన్నర కథ చెప్పగానే బన్నీ ఒకే చెప్పారు. ఆ తర్వాత పూర్తి కథను సిద్దం చేశాను. సూర్య పాత్రలో అల్లు అర్జున్ తప్పా మరొకరిని ఊహించుకోలేదు. ముఖం మీద గాటు కూడా అల్లు అర్జున్ ఐడియాదే.

   ఎన్టీఆర్‌తో కథ సెట్ కాలేదు

  ఎన్టీఆర్‌తో కథ సెట్ కాలేదు

  జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాల్సింది. ఆయన నన్ను డైరెక్టర్ చేస్తానని మాటిచ్చాడు. ఆయనతో కథా చర్చలు జరిగాయి. కథ సెట్ కాలేదు. కానీ కథపై పూర్తి సంతృప్తి చెందకపోవడంతో ఎన్టీఆర్‌తో సినిమా చేయలేకపోయాను. ఎన్టీఆర్ నాకు బాగా సన్నిహితుడు. నాకు ఇష్టమైన హీరోల్లో ఆయన ఒకరు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌కు సరిపడే కథ ఉాందా అని అడిగారు. ఆ సమయంలోనే ఈ కథ చెప్పాను. ఆ రకంగా డైరెక్టర్ అయ్యాను.

   హీరో పాత్రకు ఆర్మీ బ్యాక్‌డ్రాప్

  హీరో పాత్రకు ఆర్మీ బ్యాక్‌డ్రాప్

  నా పేరు సూర్య కథకు ఎలాంటి స్ఫూర్తి లేదు. హాలీవుడ్ సినిమాకు ఆధారం కాదు. సైనికుల్లో ఓ ఉద్వేగం, ఆవేశం ఉంటుంది. అందుకే హీరో పాత్రకు ఆర్మీ బ్యాక్‌డ్రాప్ అనుకొన్నాను. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ జత చేశాను. హీరోకు తనకు జరిగిన అన్యాయం వల్ల కోపం, ద్వేషాన్ని పెంచుకొంటాడు. దాని వల్లనే అతను స్వయంగా నష్టపోయాను. అన్వర్ పాత్ర కోపం వల్ల దేశానికి నష్టం కలుగుతుందనే పాయింట్ జత చేశాను.

   క్లైమాక్స్ అనూహ్య మలుపు

  క్లైమాక్స్ అనూహ్య మలుపు

  నా పేరు సూర్య కథ క్లైమాక్స్ అనూహ్య మలుపు తిరగడం ప్లాన్ ప్రకారం చేసిందే. విలన్ కంటే అతి పెద్ద సమస్య అన్వర్ ఎపిసోడ్. దేశానికి సైనికుడు చేసే సేవను సినిమాగా చెప్పాను. అందుకు అవకాశం కూడా లభించింది. ఉగ్రవాదిని తన మాటలతో మార్చే అంశం అద్భుతమైన పాయింట్. అందుకే కాన్సెప్ట్ క్లైమాక్స్ డిజైన్ చేశాం. సాధారణ ప్రేక్షకులకు బాగా నచ్చతుంది.

   అందుకే కమర్షియల్ హంగులు

  అందుకే కమర్షియల్ హంగులు

  ఉద్వేగంగా సాగుతున్న కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం పాటలు ఇరికించడం జరిగింది. ఆ విషయంలో క్షమించమని కోరుతాను. కమర్షియల్ సినిమాలో ప్రేక్షకులకు కొంత వెసలుబాటు ఉండాలనే ఉద్దేశంతో సెకండాఫ్ ‌లో మాస్ పాటను పెట్టాలనుకొన్నాను. సినిమా పెద్ద వ్యాపారం. పెద్ద మొత్తంలో బడ్జెట్ ఉన్నందున నిర్మాత శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని కమర్షియల్‌గా పాటలు పెట్టాను. లెంగ్త్ ఎక్కుడా ఎక్కు కాలేదనే నా అభిప్రాయం. నిడివి సమస్య కానే కాదు. నిడివి సమస్య వల్ల మంచి సీన్లు డిలీట్ చేశాను.

   సుకుమార్‌ ఫోన్ చేసి

  సుకుమార్‌ ఫోన్ చేసి

  నా పేరు సూర్య చిత్రంపై ప్రముఖుల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ చూసి ఫోన్ చేసి అభినందించాడు. చాలా ఉద్వేగానికి గురయ్యానని సుకుమార్ చెప్పాడు. కొన్నిసార్లు కంటతడి పెట్టానని చెప్పాడు. ఓ దర్శకుడు అంతగా ఫీలై చెప్పడం కంటే ఇంకా ఏమీ కావాలి చెప్పండి. నాలోని మాటల రచయిత ఓ దర్శకుడిని మద్దతు తెలిపాడు. దాంతోనే ఈ సినిమాను దర్శకుడు గొప్పగా తీశాడు అని వక్కంతం వంశీ తెలిపారు.

  English summary
  Naa Peru Surya, Naa Illu India is Telugu language action film written and directed by Vakkantam Vamsi. Produced by Shirisha and Sridhar Lagadapati under the banner Ramalakshmi Cine Creations, it stars Allu Arjun and Anu Emmanuel in the lead roles. This movie released on May 4th, 2018. In this occassion, This movie got good response all over the world. Allu Arjun's minted Rs.86 crores all over the world in three days. In this occassion, Director Vakkantam Vamsi speaks to Telugu filmibeat.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more