For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Yashoda పైసా వసూల్ మూవీ.. కథనే హీరో.. సమంతతో అలాంటి అనుభవం.. వరలక్ష్మీ శరత్‌కుమార్

  |

  సౌత్‌లో స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు నటించిన యశోద చిత్రం నవంబర్‌ 11 తేదీన రిలీజ్ అవుతున్నది. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకొన్నాయి. ఈ క్రమంలో యశోద సినిమాలో కీలక పాత్రలను పోషించిన వరలక్ష్మీ శరత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ...

  దర్శకులు యశోద కథ చెప్పినప్పుడు..

  దర్శకులు యశోద కథ చెప్పినప్పుడు..

  దర్శకులు హరి, హరీష్ నాకు యశోద కథ చెప్పినప్పుడు నేను మొట్టమొదటి చెప్పిన మాట.. మీరు ఎలా ఇలా ఆలోచించారని అన్నాను. నా పాత్ర గురించి వస్తే.. నేను ఎప్పుడూ ఛాలెంజింగ్‌గా ఫీలవ్వను. పాత్ర గురించి చెప్పినప్పుడు అర్ధం చేసుకొని నటిస్తాను. కొంత పాజిటివ్, మరికొంత నెగిటివ్ షేడ్స్ ఉండే పాత్ర. ఫస్టాఫ్‌లో కామ్‌గా, ప్రజెంట్‌గా ఉంటుంది. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్‌లో నా రోల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఉల్లిగడ్డను ఒలిస్తే ఎలా పొరలు ఉంటాయో.. అలా నా రోల్‌లో అలా వేరియేషన్స్ ఉంటాయి అని వరలక్ష్మీ శరత్ కుమార్ తెలిపారు.

  రెండు రకాల పాయింట్స్‌తో

  రెండు రకాల పాయింట్స్‌తో

  యశోద సినిమా రెండు రకాల పాయింట్స్‌తో సాగుతుంటుంది. ఆ రెండు పాయింట్స్ సమంత పాత్ర చుట్టూ ఎలా కాన్‌ఫ్లిక్ట్‌గా మారిందనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. సినిమాలో రెండు ప్యార్‌లల్ స్టోరీలు రన్ అవుతుంటే.. నా రోల్ ఎంట్రీ ఇస్తుంది. నాది చాలా ఇంపార్టెంట్ పాత్ర. ఈ సినిమా గురించి అంతకంటే ఎక్కువ చెప్పలేను అని వరలక్ష్మీ శరత్ కుమార్ అన్నారు.

  నాది డాక్టర్ పాత్ర కాదు అంటూ

  నాది డాక్టర్ పాత్ర కాదు అంటూ

  యశోద సినిమాలో నాది డాక్టర్ పాత్ర కాదు. ఒక ఫెసిలిటి హెడ్‌గా పనిచేస్తుంటాను. డబ్బును ఎక్కువగా ప్రేమిస్తాను. రిచ్ పర్సన్‌గా నటించాను. కానీ నేను నా జీవితంలో అలాంటి వాటికి దూరం. ఈ సినిమాకు హరీ, హరీష్ దర్శకత్వం వహించారు. నేను ఇప్పటి వరకు పనిచేసిన దర్శకుల్లో చాలా కామ్. క్యారెక్టర్లను చాలా అద్బుతంగా రాశారు. సినిమా చూస్తే ఈ మీకే అర్ధం అవుతుంది అని వరలక్ష్మీ శరత్ కుమార్ తెలిపారు.

  యాక్టర్లు సరోగసి కోసం ప్రయత్నించడం వల్లే

  యాక్టర్లు సరోగసి కోసం ప్రయత్నించడం వల్లే

  సరోగసి అనే కాంప్లికేట్ సబ్జెక్ట్ కాదు. సెలబ్రిటీల వల్ల కారణంగా వల్ల కాంప్లికేట్ అవుతున్నది. కొంతమంది యాక్టర్లు సరోగసి కోసం ప్రయత్నించడం చర్చ జరుగుతున్నది. ఈ సినిమాలో సరోగసి ఒక టాపిక్ మా్తరమే. సరోగసి మంచా? చెడా అనేది మేము చెప్పడం లేదు. కంప్లీట్‌గా ఇది ఫిక్షన్ మూవీ. వాస్తవిక సంఘటనల ఆధారంగా సినిమా తీయలేదు. నాకు, మురళీశర్మ, ఉన్ని ముకుందన్, రావు రమేష్ మధ్య సీన్లు ఉన్నాయి. స్టోరినే హీరో అని వరలక్ష్మీ చెప్పారు.

  పైసా వసూలు సినిమా యశోద..

  పైసా వసూలు సినిమా యశోద..

  యశోద సినిమా ఫుల్ ఎంటర్‌టైనింగ్ ఉంటుంది. కథ పరంగా సైఫై, సస్పెన్స్ థ్రిల్లర్. ఈ సినిమాలో ప్రోడక్షన్ వాల్యూస్ బాగా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ సుకుమార్ అద్భుతంగా షూట్ చేశారు. సినిమాలో సంగీతానిది కీలక పాత్ర. మణిశర్మ మంచి సంగీతం అందించారు. మీరు పెట్టే టికెట్ రేటుకువేల్యూ ఉంటుంది. సినిమాలోఅంతమంచి కంటెంట్ ఉంది. క్వాలిటీ విజువల్స్ ఉంటాయి. మా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ గారు ఎంతో ఖర్చుపెట్టి సెట్స్ వేశారు. ఆర్ట్ డైరెక్టర్ వర్క్ కనబడుతోంది అని వరలక్ష్మీ శరత్ కుమార్ అన్నారు.

  English summary
  Actress Varalaxmi Sarathkumar is coming with Yashoda movie. Here She spoke many things in interview. She has shared about Yashoda movie and relation with Samantha Ruth Prabhu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X