విషం ఇచ్చి చంపేయండి.. ఈ నరకాన్ని భరించలేను.. స్టార్ హీరో కంటతడి

హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కన్నడ సూపర్ స్టార్ దర్శన్ కోర్టులో న్యాయమూర్తి ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నరకాన్ని భరించలేను.. తనకు విషం ఇచ్చి చంపేయండి అంటూ కోర్టును వేడుకొన్నారు. రేణుకా స్వామి అనే వ్యక్తి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో దర్శన్ తాజాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బెంగళూరు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జైలులో తాను అనుభవిస్తున్న బాధలను న్యాయమూర్తి ముందు ఏకరువు పెట్టారు. ఈ కేసు విచారణ సందర్భంగా ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

దర్శన్ మర్డర్ కేసు వివరాల్లోకి వెళితే.. సినీ అభిమాని రేణుకస్వామి హత్య విషయంలో సినీ నటి పవిత్రతోపాటు మొత్తం 14 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడ‌తోపాటు మొత్తం 14 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని నెలల క్రితం వారికి బెయిల్ కూడా లభించింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో దర్శన్ బెయిల్‌ను రద్దు చేశారు. తాజాగా బెయిల్ రద్దు కావడంతో ఆయన తిరిగి రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్లారు.

Actor Darshan

కోర్టు విచారణ సందర్భంగా తన బాధను వెల్లడిస్తూ... గత కొద్ది రోజులు వెలుతురు కూడా చూడలేదు. దాంతో నా చేతుల మీద ఫంగస్ ఏర్పడింది. జైలులో తన గది నుంచి బయటకు వెళ్లడానికి కూడా అనుమతించడం లేదు. నా బట్టలు మురికి, చెమట వాసనతో కంపు కొడుతున్నాయి. జైలులో చాలా సమస్యలు ఉన్నాయి. నన్ను వేరే జైలుకు మార్చండి అని న్యాయమూర్తికి దర్శన్ మొరపెట్టుకొన్నారు. ఓ దశలో ఆయన కంటతడి కూడా పెట్టుకొన్నట్టు తెలిసింది.

న్యాయమూర్తితో దర్శన్ తన బాధను పంచుకొంటూ.. ఇలాంటి నరక ప్రాయమైన పరిస్థితుల్లో బతకలేను. ఈ జీవితాన్ని భరించలేను. కాబట్టి నాకు కాస్త విషం ఇస్తే హాయిగా చచ్చిపోతాను. అంతకంటే నాకు మరో ఉపశమనం ఉండదు. ఇక ఇలాంటి జీవితాన్ని నేను ముందుకు కొనసాగించలేను అని మొరపెట్టుకొన్నాడు. దాంతో దర్శన్ మాటలకు న్యాయమూర్తి స్పందిస్తూ.. అాలాంటి పనులు మేము చేయలేం. అలాంటి మాకు సాధ్యపడవు అని సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. తదనంతరం ఈ కేసు విచారణను సెప్టెంబర్ 19వ తేదీకి వాయిదా వేశారు. దర్శన్‌పై అభియోగాలను నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు

ఈ కేసు వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన దర్శన్ అభిమాని రేణుకస్వామి సినీ నటి, ఫ్యాషన్ డిజైనర్ పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడు. చాలాకాలంగా పవిత్రతో అఫైర్ ఉన్న దర్శన్ తీవ్రంగా పరిగణించి.. తన అనుచరులతో అతడిని కిడ్నాప్ చేశారు. ఆ సమయంలో దారుణంగా కొట్టడంతో చనిపోయాడు. ఆ తర్వాత అతడి శవాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించారు. ఈ కేసులో 14 మందిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ప్రస్తుతం సుప్రీం కోర్టు ఆదేశాలతో దర్శన్, పవిత్ర గౌడతోపాటు 7 గురిని రిమాండ్‌కు తరలించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X