For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లాక్‌డౌన్‌ హుష్‌కాకి.. హీరో నిఖిల్ పెళ్లికి భారీగా ఏర్పాట్లు.. వివాదం మధ్య మాజీ ప్రధాని ఇంట్లో..

  |

  కరోనావైరస్ భయాలు, లాక్‌డౌన్ అంశాల మధ్య మాజీ సీఎం కుమారస్వామి తన కుమారుడి వివాహాన్ని జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు నిఖిల్ గతంలో జాగ్వర్ అనే సినిమా ద్వారా దక్షిణాది సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. నిఖిల్ వివాహ నిశ్చితార్థం కొద్ది నెలల క్రితం బెంగళూరుకు సమీపంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత వేద పండితుల సలహా మేరకు పెళ్లికి ఏప్రిల్ 17వ తేదీన ముహుర్తం నిర్ణయిచారు. అయితే కరోనా ముప్పు కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో పెళ్లి జరుగుతుందా? లేదా అనే విషయం మీడియాలో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

  గ్రీన్ జోన్ ఏరియాలో

  గ్రీన్ జోన్ ఏరియాలో

  కర్ణాటకలో కరోనావైరస్ రహిత ప్రాంతంగా రామనగర్ జిల్లాను ప్రకటించారు. ఈ జిల్లాను గ్రీన్ జోన్‌గా ప్రకటించడంతో నిఖిల్ కుమారస్వామి పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో మాజీ ప్రధాని దేవగౌడ కుటుంబానికి పెద్ద ఎత్తున్న ఫామ్‌హౌస్‌లు ఉండటంతో పెళ్లికి అనువైన ప్రదేశంగా నిర్ణయించారు.

  జాగ్రత్తలు తీసుకోకుండా ఏర్పాట్లు

  జాగ్రత్తలు తీసుకోకుండా ఏర్పాట్లు

  రామనగర్ జిల్లాలోని తమ ఫామ్‌హౌస్‌లో వర్కర్లు పెళ్లి పనుల్లో భారీగా నిమగ్నమయ్యారు. అయితే వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పనిచేయడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. కూలీలు మాస్కులు, శుభ్రత పాటించకుండా వేదిక నిర్మాణాలు, స్వాగత తోరణాలు నిర్మిస్తూ కనిపించారు. దీనిపై పలువురు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు.

  వీడియో ప్రెస్‌మీట్‌లో మాజీ సీఎం మాట్లాడుతూ

  వీడియో ప్రెస్‌మీట్‌లో మాజీ సీఎం మాట్లాడుతూ

  మాజీ సీఎం కుమారస్వామి తాజాగా ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. కేవలం 80 మంది కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొంటారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలను రావొద్దని స్పష్టం చేశారు. అయితే గురువారం నాడు జరుగుతున్న ఏర్పాట్లను బట్టి చూస్తే ఈ హై ప్రొఫైల్ పెళ్లికి సుమారు 500 మందికిపైగా హాజరయ్యే అవకాశం ఉందని కొందరు పేర్కొంటున్నారు. భారీగా టెంట్లు, షామియానాలతో వేదిక కళకళలాడుతున్నది.

  జాతకాలు, ముహుర్తాలపై నమ్మకమే..

  జాతకాలు, ముహుర్తాలపై నమ్మకమే..

  సీఎం కుమారస్వామి ఎలాగైనా తన కుమారుడు నిఖిల్, రేవతి వివాహం జరిపించేందుకు మంచి మొండిపట్టుతో ఉన్నారు. ఆయనకు జాతకాలు, ముహుర్తాలను బలంగా నమ్ముతారు. గ్రహాస్థితి బట్టి ప్రస్తుతం పెట్టిన ముహుర్తమే నిఖిల్‌కు మంచిదని భావిస్తున్నందున్న వివాదాలు చుట్టుముడుతున్నా పట్టించుకోవడం లేదని మీడియా కథనాలు వెల్లడించింది.

  కర్ణాటక హోం మంత్రి స్పందన

  కర్ణాటక హోం మంత్రి స్పందన

  మాజీ సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ వివాహా ఏర్పాట్లపై హోం మంత్రి బోమ్మై మాట్లాడుతూ.. అది కేవలం ఓ కుటుంబంలో జరిగే ప్రైవేట్ వేడుక. లాక్‌డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా జరపడం లేదు. కేవలం 50 మంది కుటుంబ సభ్యులే హాజరవుతున్నారు. వారి కుటుంబంలో చాలా మంది డాక్టర్లు ఉన్నారు. అన్నీ జాగ్రత్తలు తీసుకొన్న తర్వాతనే ఈ వివాహాన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరిపిస్తున్నాం అని తెలిపారు.

  Nikhil Siddharth About His Honeymoon
  శుక్రవారం (ఏప్రిల్ 17న) ఉదయమే

  శుక్రవారం (ఏప్రిల్ 17న) ఉదయమే

  నిఖిల్ కుమారస్వామి వివాహం మాజీ మంత్రి ఎం కృష్ణప్ప మనవరాలు రేవతితో శుక్రవారం ఉదయం జరుగుతునున్నది. ఈ వేడుకకు కేతగానహళ్లి పట్టణంలోని ఫామ్‌హౌస్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యంత ప్రైవేట్ కార్యక్రమంగా జరిగే ఈ వేడుకను వేద పండితులు నిర్ణయించిన ముహుర్తానికే నిర్వహించడం విశేషం.

  English summary
  Nikhil’s father and former Karnataka CM, HD Kumaraswamy recently addressed the media to confirm that the wedding will indeed take place on April 17 as it is an 'auspicious day’. He said,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X