Murder Case: దర్శన్‌కు ఉరిశిక్ష వేయండి.. టాప్ హీరోయిన్ రమ్య రీట్వీట్ సంచలనం!
కన్నడ సినిమా పరిశ్రమలో స్టార్ హీరో దర్శన్, హీరోయిన్ పవిత్ర గౌడ అరెస్ట్ వ్యవహారం సంచలనం రేపుతున్నది. ఈ కేసులో వెలుగు చూస్తున్న విషయాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. బాధితుడు రేణుక స్వామి హత్యకు ముందు చోటు చేసుకొన్న విషయాలు దిగ్బ్రాంతిని కలిగిస్తున్నాయి. ఈ కేసులో ఏం జరిగింది? నిందితులకు ఎలాంటి శిక్ష విధించాలనే విషయంపై సీనియర్ హీరోయిన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..
దర్శన్‌తో రిలేషన్‌షిప్ పెట్టుకొన్న నటి, ఫ్యాషన్ డిజైనర్ పవిత్ర గౌడపై తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో రేణుక స్వామి అనుచితమైన పోస్టు పెట్టారు. దర్శన్, పవిత్రకు ఉన్న సంబంధంపై అసభ్యంగా పోస్టులో పేర్కొన్నారు. దాంతో తన అభిమాన సంఘానికి చెందిన నేతకు ఈ విషయాన్ని చెప్పి.. స్వామిని పట్టుకొని రావాలని సూచించారు అని మీడియా కథనాలు వచ్చాయి.

అయితే మరో ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌ను క్రియేట్ చేసిన దర్శన్ అనుచరులు అతడిని ట్రాక్ చేశారు. గత వారం రోజులుగా రేణుక స్వామి కదలికలను పసిగట్టి.. అతడిని కిడ్నాప్ చేసుకొని వచ్చి మైసూర్‌కు తరలించారు. ఆ తర్వాత తీవ్రంగా కొట్టడంతో అతడు మరణించారు. అతడి మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా అదృశ్యం చేసే ప్రయత్నం చేశారు.
అయితే తన కొడుకు కనిపించకపోవడంతో రేణుక స్వామి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో దర్యాప్తు చేపట్టిన బెంగళూరు పోలీసులు తీగ లాగితే డొంక బయటపడింది. వెంటనే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి, జాగిలాలను రంగంలోకి దించడంతో రేణుక స్వామి శవం లభ్యమైంది. తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేసి.. దర్శన్ అనుచరులను విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది.

రేణుక స్వామి హత్య కేసులో విచారణ ప్రారంభించిన బెంగళూరు పోలీసులు. దర్శన్, పవిత్ర గౌడను అరెస్ట్ చేశారు. అయితే వారిద్దరిని హత్య కేసులో ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష గానీ, జీవిత ఖైదు విధించాలని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్‌ను నటి, మాజీ ఎంపీ రమ్య అలియాస్ దివ్య స్పందన రీ ట్వీట్ కొట్టడం వైరల్ అయింది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ, సినీ నటి రమ్య రీట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో దర్శన్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం వల్లే ఆమె ఈ విధంగా ప్రవర్తించిందా? అనే విషయంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రమ్య రీ ట్వీట్ వెనుక ఆంతర్యం ఏమిటనే ప్రశ్న ప్రస్తుతం చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











