దర్శన్ Vs పునీత్ ఫ్యాన్ వార్.. గొడవల్లో ఒకరు మృతి.. అసలేం జరిగిందంటే?
కర్ణాటక రాష్ట్రంలో సినీ అభిమానుల మధ్య గొడవలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. గత కొద్దికాలంగా కన్నడ సినీ పరిశ్రమలో స్వర్గీయ పునీత్ రాజ్‌కుమార్, హీరో దర్శన్ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ కొనసాగుతున్నది. అయితే తాజాగా దర్శన్ అభిమానులు, పునీత్ అభిమానుల మధ్య భారీ గొడవ జరిగిందని, ఆ గొడవ భారీ ఆందోళనకు దారి తీసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫ్యాన్ వార్ గొడవకు కారణం ఏమిటి? ఆ గొడవకు దారి తీసిన పరిస్థితులు ఏమిటనే విషయంలోకి వెళితే...
మైసూర్‌కు సమీపంలోని టీ నర్సిపూర అనే ప్రాంతంలో ఆంజనేయస్వామి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా భజరంగ్ ఉత్సవంలో భాగంగా భారీ ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపు కార్యక్రమంలో భారీగా స్వర్గీయ పునీత్ రాజ్‌కుమార్ అభిమానులు పాల్గొన్నారు. ఈ ఊరేగింపులో స్థానికులు, రాజకీయ నేతలు కూడా ఉండటం గమనార్హం.

అయితే భజరంగీ ఉత్సవాల్లో ఆంజనేయ స్వామి, భరతమాత ప్లకార్డులు, పోస్టర్లు, కటౌట్లను ప్రదర్శించారు. పోస్టర్లు, కటౌట్లతో ఊరేగింపును కొనసాగించారు. అయితే ఈ వేడుకలో పునీత్ అభిమానులు ఆయన ఫోటోలను కూడా ప్రదర్శించడంతో కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో ర్యాలీలో గొడవ చోటు చేసుకొన్నది. ఆ గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. దాంతో భారీ ఘర్షణ వాతావరణం నెలకొన్నది అని స్థానికుల తెలిపారు.
భజ్‌రంగీ ఉత్సవాల ఊరేగింపును యువ బ్రిగేడ్ అనే ఆర్గనైజన్ నిర్వహించింది. ర్యాలీలో జరిగిన గొడవలో ఇరు వర్గాలు కొట్టుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఈ గొడవలో యువ బ్రిగేడ్ కార్యకర్త మరణించడం అత్యంత విషాదంగా మారింది. అయితే యువ బ్రిగేడ్ కార్యకర్త పునీత్ అభిమాని కావడం గమనార్హం. అభ్యంతరం వ్యక్తం చేసిన వ్యక్తి హీరో దర్శన్ అభిమానులు అని స్థానికులు ఆరోపిస్తున్నారు.
భజ్‌రంగీ ఉత్సవాల ర్యాలీలో ఓ భక్తుడు మరణించడం అత్యంత దారుణంగా మారింది. అయితే ఈ గొడవ వెనుక పునీత్, దర్శన్ అభిమానుల ఫ్యాన్ వార్ ఉందనే కోణం ప్రస్తుతం ఆసక్తిగా మారింది. అయితే స్థానిక పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. గొడవ కారణం, భక్తుడి మరణానికి కారణం ఏమిటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అని తెలిసింది.
యువ బ్రిగేడ్ గ్రూప్‌కు చెందిన కార్యకర్త మరణించడంతో పునీత్ రాజ్ కుమార్ అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. పునీత్ అభిమానులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అయితే ఈ దుర్ఘటన జరిగినప్పటి నుంచి సోషల్ మీడియాలో వార్త వైరల్ అయింది. పునీత్ అభిమానులకు హీరో దర్శన్ సారీ చెప్పాలనే డిమాండ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నది. #DarshanApologizeToPuneeth హ్యాష్ ట్రెండింగ్‌గా నిలిచింది. ట్విట్టర్ స్పేస్‌లో అభిమానులు భారీగా చర్చ పెట్టి హీరో దర్శన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











