Don't Miss!
- News
టర్కీలో తీవ్ర భూకంపం.. నిముషాల వ్యవధిలో రెండుసార్లు; రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదు!!
- Sports
INDvsAUS : వాళ్లకు కూడా గాయాలైతే సిరీస్ ముగిసినట్లే.. ఆసీస్ టెస్టులపై పేలుతున్న మీమ్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
చిరంజీవి సర్జా విషాదం మరవక ముందే.. ధ్రువ సర్జా ఫ్యామిలీకి మరో కష్టం
కన్నడ నటుడు ధ్రువ సర్జాను విషాదాలు, సమస్యలు వెంటాడుతున్నట్టు కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం తన సోదరుడు చిరంజీవి సర్జా మృతితో మహా విషాదంలో కూరుకుపోయిన ధ్రువ తాజాగా కరోనా బారిన పడ్డారు. తనకు, తన భార్యకు కరోనా సోకిన విషయాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ప్రకటించారు. కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా, ప్రధానంగా బెంగళూరును కరోనావైరస్ వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ ..

బెంగళూరులో కరోనా విలయతాండవంతో
కన్నడ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి ప్రభావంగా భారీగా ఉంది. ఇప్పటికే బెంగళూరుతోపాటు కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించి కరోనా కట్టడికి నివారణ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఎంపీ, సినీ నటి సుమలత, నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ లాంటి ప్రముఖులకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో యువ హీరో ధ్రువ సర్జా చేరారు.

నాకు, నా భార్యకు కరోనావైరస్
తనకు కరోనావైరస్ సోకిందనే విషయాన్ని ధ్రువ్ సర్జా తన ట్విట్టర్‌లో వెల్లడిస్తూ.. నా భార్యకు, నాకు కరోనావైరస్ పాజిటివ్‌గా తేలింది. కోవిడ్19 లక్షణాలు ప్రాథమిక ధశలోనే ఉన్నాయి. దాంతో మేమిద్దరం హాస్పిటల్‌లో చేరాం. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వస్తాం. ఎవరూ మా ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దు అని తెలిపారు.

నాతో కాంటాక్ట్ అయిన వారు కూడా
అలాగే నాకు కరోనావైరస్ సోకినందున్న నా సన్నిహితులు, స్నేహితులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కొద్ది రోజులుగా నాతో సన్నిహితంగా ఉన్న మిత్రులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు కూడా తగిన పరీక్షలు చేయించుకొండి. తప్పని సరిగా కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. మీరంతా క్షేమంగా ఉండాలని కోరుకొంటున్నాను అని ధ్రువ్ సర్జా తెలిపారు.
Recommended Video

గత నెల చిరంజీవి సర్జా మృతితో
ధ్రువ సర్జా కుటుంబాన్ని గత నెల తీవ్ర విషాదం వెంటాడింది. ధ్రువ సోదరుడు చిరంజీవి సర్జా గుండెపోటుతో బెంగళూరులో మరణించిన సంగతి తెలిసిందే. ఆ మహా విషాదం నుంచి కోలుకోకముందే ధ్రువ సర్జా దంపతులు కరోనావైరస్ బారిన పడ్డారు. వీరి ఫ్యామిలీ మొత్తం ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంది. ధ్రువ దంపతులు బెంగళూరులోని ప్రముఖ హాస్పిటల్‌లో వారు చికిత్స పొందుతున్నారు. ప్రముఖ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్‌కు వీరిద్దరూ సమీప బంధువులు అనే విషయం తెలిసిందే.