నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటుడికి యాక్సిడెంట్.. విషమ పరిస్థితి, ఐసీయూలో చికిత్స!

సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తాజాగా ఒక విషాదకర విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇది టాలీవుడ్ కి సంబంధించిన విషయం కాదు. కన్నడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ప్రముఖ నటుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన పరిస్థితి ఇప్పుడు తీవ్రంగా విషమంగా ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే

సంచారి విజయ్ కి యాక్సిడెంట్

సంచారి విజయ్ కి యాక్సిడెంట్

జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన కన్నడ నటుడు సంచారి విజయ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదం నిన్న రాత్రి జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ బెంగళూరులోని బన్నేర్ఘట్ట రోడ్ లో ఉన్న అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఆయన మెదడు సహా కుడి తొడ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

పరిస్థితి విషమం

పరిస్థితి విషమం

ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నిన్న రాత్రి విజయ్ తన స్నేహితులతో కలిసి బైక్ మీద వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. తలకు దెబ్బ తగలడంతో మెదడు వద్ద తీవ్ర రక్తస్రావం అవుతోందని అలాగే కుడితొడ పూర్తిగా విరిగిపోయిందని తెలుస్తోంది.

జేపీ నగర్ సెవెన్త్ ఫేజ్ లో

జేపీ నగర్ సెవెన్త్ ఫేజ్ లో

శనివారం రాత్రి విజయ్ తన స్నేహితుడు నవీన్ తో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బెంగళూరులో జేపీ నగర్ సెవెన్త్ ఫేజ్ లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విజయ్ స్నేహితుడు నవీన్ కి కూడా తీవ్ర గాయాలయ్యాయని ఆయనను కూడా ఆస్పత్రిలో చేర్చారు అని అంటున్నారు. నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని శాండిల్ వుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

ఎలా జరిగింది?

ఎలా జరిగింది?

అయితే ప్రస్తుతం విజయ్ ఆరోగ్యం ఆందోళన కలిగిస్తోందని అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే సమాచారం కూడా అందుబాటులో లేదని అంటున్నారు. జాతీయ అవార్డు అందుకున్న నటుడు విజయ్ కృష్ణ తులసి, కిల్లింగ్ వీరప్పన్ లాంటి అనేక సినిమాల్లో నటించారు. నాన్ అవనుల్లా, అవలు సినిమాకి ఆయనకు జాతీయ అవార్డు దక్కింది. ఇక అలాగే విజయ్ కేవలం కన్నడ వరకే పరిమితం కాకుండా అనేక తమిళ సినిమాల్లో కూడా నటించడం గమనార్హం.

కరోనా రోగులకు సేవ

కరోనా రోగులకు సేవ

ఆస్పత్రి వర్గాలు అందిస్తున్న సమాచారం మేరకు ఆయనకు ఇప్పటికే మెదడుకు సంబంధించిన శస్త్ర చికిత్స చేశారని అయితే ప్రస్తుతం ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారని తెలుస్తోంది. మరో బాధాకరమైన విషయం ఏమిటంటే కరోనా సమయంలో ఆయన ఎంతో మంది కరోనా పేషెంట్స్ కి ఆక్సిజన్ అందించేందుకు నిరంతరం శ్రమించారు. అలాంటి ఆయన ఇప్పుడు ఆక్సిజన్ సపోర్ట్ తో బెడ్ మీద పడుకొని ఉండడం కన్నడ సినీ అభిమానులను కంటతడి పెట్టిస్తోంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X