»   » రష్మిక అఫైర్ గాసిప్స్‌కు శాశ్వత తెర.. కన్నడ హీరోతో నిశ్చితార్థం!

రష్మిక అఫైర్ గాసిప్స్‌కు శాశ్వత తెర.. కన్నడ హీరోతో నిశ్చితార్థం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కన్నడ నటి రష్మిక మందన అఫైర్ సాగిస్తున్నట్టు వస్తున్న గాసిప్స్‌కు తెరపడింది. కన్నడలో ఘన విజయం సాధించిన కిరిక్ పార్టీ చిత్రం ద్వారా ప్రేక్షకుల మనసు దోచుకొన్న రష్మిక వివాహ నిశ్చితార్థం తన సహనటుడు రక్షిత్ శెట్టితో జరిగింది. కిరిక్ పార్టీ చిత్రంలో కలిసి నటించడం ద్వారా వీరి మధ్య పరిచయం జరిగింది. ఆ తర్వాత పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలుపడంతో పెళ్లికి లైన్ క్లియర్ అయింది. రష్మిక, రక్షిత్ నిశ్చితార్థం సోమవారం జరిగింది.

ఆనందోత్సాహాల మధ్య..

ఆనందోత్సాహాల మధ్య..

రష్మిక మందన, రక్షిత్ శెట్టి నిశ్చితార్థం జూలై 3వ తేదీ కర్నాటకలోని కూర్గ్ సమీపంలోని విరాజ్‌పేట్‌లో జరిగింది. ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు దాదాపు 2 వేలకు పైగా మంది హాజరయ్యారు. ప్రైవేట్ కార్యక్రమంగా సాగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు, సన్నిహితులు హాజరయ్యారు.

ఉంగరాలు మార్చుకొన్నారిలా..

ఉంగరాలు మార్చుకొన్నారిలా..

నిశ్చితార్థ వేడుకలో శ్రద్ధ పొన్నప్ప డిజన్ చేసిన పింక్, సిల్వర్ రంగు ఉన్న గౌనును రష్మిక, బ్లాక్ సూట్ ధరించారు. వేడుకలో భాగంగా తన మిత్రులు, సన్నిహితుల మధ్య రష్మిక, రక్షిత్ ఇరువురు ఉంగరాలు మార్చుకొన్నారు.

హై సెక్యూరిటీ మధ్య

హై సెక్యూరిటీ మధ్య

నిశ్చితార్థ వేడుక వేదిక వద్ధ భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నండటంతో భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా చేశారు. మెటల్ డిటెక్టర్ల ద్వారా తనిఖీ చేసిన తర్వాతే వారిని లోనికి అనుమతించారు. వేదిక సమీపంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి నిశితంగా పరిశీలించారు.

ఇన్విటేషన్ ఉన్నవారికే..

ఇన్విటేషన్ ఉన్నవారికే..

భద్రతాపరమైన సమస్యలు ఉన్నందున్న ఎంగేజ్‌మెంట్ ఇన్విటేషన్ ఉన్నవారినే కన్వెన్షన్ హాల్‌లోకి అనుమతించామని రష్మిక తండ్రి మందన తెలిపారు. ఈ వేడుకకు హాజరైన అతిథుల కోసం రకరకాల వెరైటీ ఫుడ్‌ను అందించారు.

హాజరైన ప్రముఖులు..

హాజరైన ప్రముఖులు..

ఈ కార్యక్రమానికి సంయుక్త హెగ్డే, యగ్నా శెట్టి, మేఘన గావోంకర్, దర్శకుడు యోగ్‌రాజ్ భట్, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన తదితరులు హాజరయ్యారు. కిరిక్ పార్టీ దర్శకుడు రిషబ్ శెట్టి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

పునీత్ రాజ్ కుమార్‌తో..

పునీత్ రాజ్ కుమార్‌తో..

పునీత్ రాజ్‌కుమార్తో అంజనీపుత్ర అనే చిత్రంలో రష్మిక నటిస్తున్నది. అంతేకాకుండా కన్నడ నటుడు గణేశ్ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే తెలుగులో నాగశౌర్య చిత్రంలో నటించడానికి అంగీకారం తెలిపింది.

షూటింగ్ దశలో అవనే శ్రీమన్నారాయణ

షూటింగ్ దశలో అవనే శ్రీమన్నారాయణ

రష్మిక నటిస్తున్న అవనే శ్రీమన్నారాయణ చిత్రం షూటింగ్ దశలో ఉంది. సచిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శాన్వీ శ్రీవాస్తవ, అచ్చుత్ కుమార్ తదితరులు నటిస్తున్నారు.

English summary
Kannada actors Rakshit Shetty and Rashmika Mandanna exchanged rings in a private ceremony on Monday. It was only last month that Kannada actors Rakshit Shetty and Rashmika Mandanna confirmed their relationship status. And now the lovebirds are engaged. Rakshit and Rashmika exchanged rings in a dreamy ceremony on Monday (July 3) in Virajpet, Karnataka.While Rashmika looked pretty in a pink and silver gown, Rakshit cut a suave figure in a beige suit.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu