అత్యాచారం చేసి చంపేస్తాం.. స్టార్ హీరోయిన్‌కు స్టార్ హీరో ఫ్యాన్స్ బెదిరింపులు
కన్నడ స్టార్ హీరో, రేణుకా స్వామి హత్యకేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శన్ అభిమానులపై కన్నడ నటి, రాజకీయ నేత రమ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకరమైన పోస్టులు, అత్యాచారం, హత్య చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నామని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల కాలంలో తనకు వారి నుంచి వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. ఆన్‌లైన్‌లో మాటలకు చెప్పలేని విధంగా ట్రోల్ చేస్తున్నారు అంటూ ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఇలాంటి నీచ సంస్కృతిని సోషల్ మీడియా కొనసాగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరింది. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
గత కొద్దికాలంగా సోషల్ మీడియాలో దర్శన్ ఫ్యాన్స్ నుంచి వేధింపులకు గురవుతున్నాను. ఈ విషయాన్ని కన్నడ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాను. ఈ క్రమంలోనే బెంగళూరు కమిషనర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. నా లాయర్లతో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే విషయంపై సంప్రదింపులు జరిపాను. ఇప్పటికే సోషల్ మీడియాలో నాపై చేసిన అభ్యంతరకరమైన పోస్టులను సేకరించి ఫిర్యాదుతోపాటు అందజేశాం అని నటి రమ్య మీడియాకు తెలిపారు.

సెలబ్రిటీలను టార్గెట్‌గా చేసుకొని సోషల్ మీడియాలో చాలా దారుణమైన ఎటాక్ చేస్తున్నారు. ఇది అత్యంత దురదృష్టకరం. మహిళలను అసభ్య పదజాలంతో దూషించడం కామన్ అయిపోయింది. అలాంటి వాటికి చట్టపరమైన చెక్ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. మహిళల అత్మగౌరవం, వారి ప్రతిష్టకు భంగం కలిగేలా చేస్తున్నారు. మౌనంగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకొని వారి క్యారెక్టర్‌ను చంపేస్తున్నారు అని రమ్య చెప్పారు.
దర్శన్ అభిమానులు నన్ను టార్గెట్ చేస్తూ కొన్ని దారుణమైన పోస్టులు పెడుతున్నారు. రేణుకా స్వామి మాదిరిగానే నిన్ను కూడా చంపేస్తే బాగుంటుంది. నిన్ను రేప్ చేసి చంపేస్తాం. దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడపై కామెంట్ చేసిన రేణుకా స్వామికి దర్శన్ ఫ్యాన్స్‌కు పెద్దగా తేడా లేదనిపిస్తుంది. కేవలం నన్నే కాదు. నా ఫ్యామిలీని కూడా వెంటాడుతున్నారు. చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా నీచంగా ప్రవర్తిస్తున్నారు అని రమ్య అన్నారు.
సోషల్ మీడియాలో నటి రమ్యపై జరుగుతున్న ట్రోలింగ్ దాడిపై కర్ణాటక మహిళా కమిషన్ స్పందించింది. ఇలాంటి అసభ్య సందేశాలను పోస్టు చేస్తున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలి. సోషల్ మీడియాలో ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని ఉమెన్ కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ ఫిర్యాదుపై దర్యాప్తుపై రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. హీరోయిన్ పవిత్ర గౌడపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని రేణుకాస్వామి అనే అభిమానిని హత్య చేసిన కేసులో హీరో దర్శన్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు.
నటి రమ్య విషయానికి వస్తే.. కన్నడ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పాపులారిటీ సంపాదించుకొన్న నటి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండ్యా లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2013 సంవత్సరంలో ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. ఆమె 2023 సంవత్సరంలో హాస్టల్ హుడుగారు బెకజిడ్డారే అనే చిత్రంలో నటించారు.


Click it and Unblock the Notifications











