twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    104 ఏళ్ల వయసున్న ప్రముఖ నిర్మాత మృతి!

    |

    ప్రముఖ కన్నడ నిర్మాత, వందేళ్లకుపైగా జీవించిన వ్యక్తిగా వార్తల్లోకి ఎక్కిన జిఎన్ లక్ష్మీపతి ఇక లేరు. కన్నడ చిత్ర సీమలో పలు చిత్రాలు నిర్మించిన ఆయన గురువారం(మే 16) కన్నుమూశారు. లక్ష్మిపతి వయసు 104 సంవత్సరాలు. కొంత కాలంగా వయసు సంబంధమైన సమస్యలతో బాధ పడుతున్నారు.

    కర్ణాటకలోని తుమ్మక్కురు జిల్లా గుబ్బిలో లక్ష్మీపతి జన్మించారు. కన్నడ నాటక రంగానికి మార్గదర్శకుడిగా కీర్తిగాంచిన గుబ్బి వీరన్న కుటుంబంతో లక్ష్మిపతి ఫ్యామిలీకి క్లోజ్ రిలేషన్ ఉంది. ఆయన నాటకాలు చూస్తూ పెరిగిన లక్ష్మీపతి సినిమా నిర్మాణంపై ఆసక్తి పెంచుకున్నారు. మారుతి మూవీస్ బేనర్లో పలు మెమొరబుల్ చిత్రాలు నిర్మించారు.

    కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్, జయంతి నటించిన 'దేవర మక్కలు' చిత్రం ద్వారా జీఎన్ లక్ష్మీపతి నిర్మాతగా మారారు. తనకెరీర్లో మొత్తం 7 చిత్రాలు నిర్మించారు. ఎన్.లక్ష్మినారాయణ నటించిన 'ఉయ్యాలే', గిరీష్ కర్నాడ్, శంకర్ నాగ్ నటించిన 'ఆనడనోండు కలాదల్లి'తో పాటు పలు కన్నడ చిత్రాలు నిర్మించారు.

    Kannada film producer GN Lakshmipathy passed away

    జిఎన్ లక్ష్మీపతి నిర్మించిన చిత్రాలు పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో కూడా ప్రదర్శితం అయ్యాయి. కన్నడ చిత్రసీమకు ఆయన చేసిన సేవలకుగాను రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ విష్ణువర్దన్ అవార్డుతో సత్కరించింది.

    కన్నడ చిత్ర పరిశ్రమకు శంకర్ నాగ్, జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత గిరిష్ కర్నాడ్ లాంటి వారిని పరిచయం చేసిన ఘనత లక్ష్మీపతి సొంతం చేసుకున్నారు. ఆయన మరణం పట్ల కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంతాపం వ్యక్తం చేసింది.

    English summary
    Kannada film producer GN Lakshmipathy, who had funded many notable movies in Sandalwood, passed away on Thursday, May 16. He was aged 104 and breathed his last due to age-related ailments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X