పండంటి కవలలకు జన్మనిచ్చిన యువ హీరోయిన్.. డబుల్ ధమాకా అంటూ భర్త ఆనందోత్సాహం

కన్నడ యువ హీరోయిన్ అమూల్య దంపతులు పండంటి కవల బిడ్డలకు జన్మనిచ్చారు. మహాశివరాత్రి పండుగ రోజున జంట పిల్లలు వారి జీవితాల్లోకి ప్రవేశించడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విషయాన్ని అమూల్య భర్త జగదీష్ ఆర్ చంద్ర స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి.. అమూల్య అభిమానులకు శుభవార్త. మార్చి 1వ తేదీన అంటే మంగళవారం మాకు పండంటి కవలలు పుట్టారు. తల్లి, ఇద్దరు పిల్లలు ఆరోగ్యం ఉన్నారు. ఒకరు కాదు.. ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. మా జీవిత ప్రయాణంలో అండగా ఉన్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను అని ఇన్స్‌టాగ్రామ్ పోస్టులో వెల్లడించారు.

అమూల్య కవల పిల్లలకు జన్మనిచ్చారనే వార్తతో ఫ్యాన్స్, అభిమానులు సంతోషంలో శుభాకాంక్షలు తెలిపారు. కన్నడ పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు హర్షిక, కారుణ్య, దివ్యా స్పందన, ఆశిఖా రంగ్‌నాథ్, స్పూర్తి విశ్వాస్, సోను గౌడ, అద్వైతి శెట్టి తదితరులు శుభాకాంక్షలు అందించిన వారిలో ఉన్నారు.

Kannada Heroine Amulya blessed with twins on Mahashivaratri

ఇటీవల జరిగిన అమూల్య శ్రీమంతం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రియాంక ఉపేంద్ర, గోల్డెన్‌స్టార్ గణేష్, నేనాపిరాలి ప్రేమ్, రమ్య, రాధిక పండిట్, అనిరుధ్, భారతీ విష్ణువర్ధన్, సోను గౌవడ, కారుణ్య రామ్ లాంటి సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అమూల్య కెరీర్ విషయానికి వస్తే.. 2001లో విష్ణువర్ధన్ నటించిన పర్వ చిత్రం ద్వారా బాలనటిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత గణేష్ నటించిన చెలువినా చిత్తారా చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. అలాగే సుదీప్, దర్శన్, పునీత్ రాజ్‌కుమార్, ప్రేమ్ కుమార్, యష్‌ చిత్రాల్లో అమూల్య నటించింది.

అమూల్య 2017లో జగదీష్ ఆర్ చంద్రను ఆదిచుంచనగిరి మఠంలో వివాహం చేసుకొన్నారు. కన్నడ రాజకీయాల్లో ప్రముఖ నేత రామచంద్రగౌడ కుమారుడే జగదీష్. లండన్‌లో ఎంబీఏ చదువుకొన్నారు. ప్రస్తుతం వ్యాపార రంగంలో ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X