twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ నిర్మాత కన్నుమూత.. చిరంజీవి, సుదీప్, ఉపేంద్రతో సినిమాలు..

    |

    కన్నడ సినీ రంగంలో ప్రముఖ నిర్మాత, దర్శకురాలు నారా జయశ్రీ దేవి కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గుండెపోటుతో బుధవారం ఉదయం మరణించారు. ఆమె వయసు 60 సంవత్సరాలు. జయశ్రీ మృతిపట్ల కన్నడ, తెలుగు సినీ రంగాల ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. జయశ్రీ సినీ జీవితం గురించి మరిన్ని వివరాలు..

    హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు

    హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు

    హైదరాబాద్ అపోలో హాస్పిటల్ నుంచి జయశ్రీ భౌతిక కాయాన్ని బెంగళూరుకు తరలించనున్నారు. గురువారం ఆమె అంత్యక్రియలు జరిపించే అవకాశం ఉంది. సినీ ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించేందుకు ఫిలిం చాంబర్‌లో పార్ధీవ దేహాన్ని ఉంచుతాం. అంత్యక్రియల వివరాలను మీడియాకు తెలియజేస్తాం అని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

    కన్నడ సూపర్‌స్టార్‌తో కెరీర్ ఆరంభం

    కన్నడ సూపర్‌స్టార్‌తో కెరీర్ ఆరంభం

    కన్నడ సూపర్‌స్టార్ విష్ణువర్ధన్, హీరో కుమార్ గోవింద్ కలిసి నటించిన కోన ఇదైతే చిత్రంతో నిర్మాతగా, దర్శకురాలిగా కన్నడ సినిమా ప్రపంచానికి పరిచయం అయ్యారు. భవానీ అనే చిత్రానికి ఆమె దర్శకత్వం కూడా వహించారు. ఆ తర్వాత దర్శకత్వ బాధ్యతలు పక్కన పెట్టి పూర్తి స్థాయి నిర్మాతగా మారిపోయారు.

     20కుపైగా సినిమాల నిర్మాణం

    20కుపైగా సినిమాల నిర్మాణం

    కన్నడ, తెలుగు రంగాల్లో కలిపి మొత్తం 20 చిత్రాలను నిర్మించారు. జయశ్రీ నిర్మించిన చివరి చిత్రం ముకుందా మురారీ. ఈ చిత్రంలో కిచ్చ సుదీప్, ఉపేంద్ర కలిసి నటించారు. కన్నడలో మంచి విజయాన్ని అందుకొన్నది. కొంతకాలంగా ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల సినీ నిర్మాణానికి దూరంగా ఉన్నట్టు సమాచారం.

    మెగాస్టార్ చిరంజీవితో శ్రీ ముంజునాథ

    మెగాస్టార్ చిరంజీవితో శ్రీ ముంజునాథ

    నిర్మాతగా జయశ్రీ అద్భుతమైన చిత్రాలను అందించారు. పలు చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. నమ్మూరా మందారా హువే, అమృత వర్షిణి, స్నేహలోకం, హబ్బా, శ్రీ మంజునాథ లాంటి బ్లాక్ బస్టర్లు అందుకొన్నారు. శ్రీ మంజు నాథలో చిరంజీవి హీరోగా నటించిన సంగతి తెలిసిందే.

    English summary
    Jayashree Devi, well-known Kannada producer, has passed away on Wednesday, 13 February, after suffering heart attack in Hyderabad Apollo Hospital evening they are taking body to Bengaluru. Few Kannada, Telugu film personalities are condolenced on her death.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X