For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  KGF Chapter 2: చరిత్ర సృష్టించిన కేజీఎఫ్.. ఇండియాలోనే తొలి సినిమాగా సంచలన రికార్డు

  |

  కన్నడ చిత్ర పరిశ్రమలో రూపొంది.. పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో విడుదలై.. అన్ని చోట్లా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమానే 'కేజీఎఫ్ చాప్టర్ 1'. ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాకింగ్ స్టార్ యశ్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ మూవీకి అన్ని భాషల్లోనూ అదిరిపోయే స్పందన దక్కింది. అంతేకాదు, విడుదలైన అన్ని భాషల్లోనూ కలెక్షన్లను కూడా భారీ స్థాయిలో రాబట్టి సత్తా చాటుకుంది. ఫలితంగా ఇది పాన్ ఇండియా స్థాయిలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ ఉత్సాహంతోనే చిత్ర యూనిట్‌ దీనికి సీక్వెల్‌గా 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే.

  మరోసారి రష్మిక మందన్నా హాట్ ట్రీట్: ఎద భాగం కనిపించేలా ఘాటుగా!

  'కేజీఎఫ్ చాప్టర్ 1' పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని దక్కించుకోవడంతో.. అదే కాంబినేషన్‌లో దీనికి సీక్వెల్‌గా 'కేజీఎఫ్ చాప్టర్ 2'ను తెరకెక్కించారు. మొదటి భాగంలో కేజీఎఫ్‌ను సొంతం చేసుకున్న రాఖీ భాయ్‌ను ఎదురించేందుకు అధీరా, రమీకా సేన్‌లు ఎంట్రీ ఇవ్వడంతో ఎలాంటి మలుపులు తిరిగాయి అనే నేపథ్యంతో ఈ సినిమాను రూపొందించారు. అందుకు అనుగుణంగానే ఇందులో మొదటి భాగానికి మించిన ఎలివేషన్ సీన్స్‌ డిజైన్ చేశారు. ఫలితంగా ఈ సినిమా ఎన్నో అంచనాలతో గత నెలలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దీనికి అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ దక్కింది. ఫలితంగా ఈ సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల్లో భారీ కలెక్షన్లను రాబట్టి సెన్సేషనల్ హిట్ అయింది.

  KGF Chapter 2 Celebrate 50 Days in 400 Centers

  భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీకి థియేటర్లలో అదిరిపోయే స్పందన వచ్చింది. ఫలితంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగానే గ్రాస్‌ను రాబట్టి సంచలనం సృష్టించింది. అలాగే, దాదాపు రూ. 600 కోట్ల షేర్‌ను కూడా వసూలు చేసింది. అంతేకాదు, విడుదలైన అన్ని భాషల్లోనూ వందకు వంద శాతం కలెక్షన్లను దాటేసి డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండించింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లతో దాదాపు రూ. 240 కోట్లకు పైగా లాభాలను కూడా ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో చిత్ర యూనిట్‌తో పాటు యశ్ ఫ్యాన్స్ యమ హ్యాపీగా ఉన్నారు.

  డ్రెస్ విప్పేసి షాకిచ్చిన అమలా పాల్: ఎద అందాలు కనిపించేలా ఘోరంగా!

  అంచనాలను నిజం చేస్తూ ఘన విజయాన్ని అందుకున్న 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీ నేటితో యాభైవ రోజును జరుపుకుంటోంది. అంతేకాదు, ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో మంచి స్పందనను దక్కించుకుంటోంది. ఈ క్రమంలోనే ఇది ఏకంగా 400 థియేటర్లలో యాభై రోజులు జరుపుకుంటోంది. అందులో ఇండియాలోని అన్ని ప్రాంతాల్లో కలిపి 390 సెంటర్లు ఉండగా.. ఓవర్సీస్‌లో 10 లొకేషన్స్‌లో ఈ ఫీట్‌ను సాధించింది. ఫలితంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ కేంద్రాల్లో యాభై రోజులు జరుపుకున్న ఏకైక చిత్రంగా ఇది రికార్డు సాధించింది. అంతేకాదు, ఓవర్సీస్‌లో ఎక్కువ లొకేషన్స్‌లో 50 రోజులు ఆడిన సినిమాగా చరిత్ర సృష్టించింది.

  KGF Chapter 2 Celebrate 50 Days in 400 Centers

  ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యశ్ నటించిన చిత్రమే 'కేజీఎఫ్ చాప్టర్ 2'. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. ఇందులో సంజయ్ దత్ విలన్‌గా నటించారు. శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా చేసింది. రవి బస్రూర్ దీనికి సంగీతాన్ని అందించాడు. సీనియర్ బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కీలక పాత్రను చేశారు.

  English summary
  Yash Did K.G.F: Chapter 2 Movie Under Prashanth Neel Direction. Now This Movie Celebrate 50 Days in 400 Centers.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X