KGF Chapter 2 నుంచి షాకింగ్ అప్‌డేట్: ఆ ఒక్క దాని కోసమే రూ. 12 కోట్లు ఖర్చు

స్టైలిష్ హీరో యశ్ - టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో వచ్చిన కన్నడ చిత్రం 'KGF Chapter 1' ఇండియన్ సినిమాపై చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ సినిమా.. భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. మరీ ముఖ్యంగా ఇందులో హీరోను ఎలివేట్ చేసి చూపించిన తీరుకు ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఉన్న సినీ ప్రియులంతా ఫిదా అయిపోయారు. అలాగే, ఇందులోని యాక్షన్ సీన్స్ అన్నీ హాలీవుడ్ స్థాయిలో ఉండడంతో జాతీయ అవార్డు సైతం దక్కింది.

Recommended Video

KGF Chapter 2 Demand In Tollywood | Filmibeat Telugu

మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ అవడంతో.. దీనిని కొనసాగింపుగా 'KGF Chapter 2'ను తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్. ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ.. ఇటీవల చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల యశ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ వీడియో ఏ రేంజ్‌లో పేలిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకూ ఇండియన్ సినిమా హిస్టరీలో ఉన్న రికార్డులన్నీంటినీ తుడిచి పెట్టేసిందీ టీజర్. ఫలితంగా KGF Chapter 2పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

KGF Chapter 2 Climax Scene Budget Leaked

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికరమై వార్త బయటకు వచ్చింది. 'KGF Chapter 2' క్లైమాక్స్ సీన్ కోసం చిత్ర యూనిట్ ఏకంగా రూ. 12 కోట్లు ఖర్చు చేసిందట. దీనికి సంబంధించిన చిత్రీకరణను హైదరాబాద్‌లోనే షూట్ చేశారు. మొత్తంగా సినిమాకు రూ. 100 కోట్లు పైగానే బడ్జెట్ అయిందని అంటున్నారు. ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇదిలా ఉండగా, ఇందులో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ విలన్‌గా చేస్తున్నారు. ఆయనతో పాటు ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X