నరికేస్తారా? నేను ఏమైనా జంతువునా? తనపై మర్డర్ ప్లాన్‌పై హీరో యష్

కన్నడ హీరో, రాకింగ్ స్టార్ యష్ హత్యకు కుట్ర పన్నారనే వార్త దక్షిణాది మీడియాలో సంచలనం రేపింది. ఎన్నికల సమయంలో కర్ణాటకలో రౌడీషీటర్ల అరెస్ట్ నేపథ్యంలో ఈ వార్త మీడియాలో హల్‌చల్ చేయడంతో సినీ వర్గాలు ఆందోళనకు గురయ్యాడు. కొందరు కాంట్రాక్టు హంతకులను కర్ణాటక క్రైమ్ బ్రాంచ్ అధికారులు అరెస్ట్ చేసిన అనంతరం ఈ వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. తన హత్యకు కుట్రపన్నారనే వార్తలపై హీరో యష్ స్పందిస్తూ..

నాపై మర్డర్ ప్లాన్ గురించి

నాపై మర్డర్ ప్లాన్ గురించి

నాపై మర్డర్ ప్లాన్ చేశారని, అందుకు భారీగా సుపారీ చెల్పించారనే వార్తల నేపథ్యంలో కర్ణాటక పోలీసు అధికారులతో మాట్లాడాను. తాజా అరెస్టులకు తనపై హత్యకు కుట్ర పన్నారనే వార్తకు ఎలాంటి సంబంధం లేదు అని పోలీసులు స్పష్టంగా చెప్పారు. నా అభిమానులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని ఆయన అన్నారు.

నేనేమైనా జంతువునా, నరకడానికి?

నేనేమైనా జంతువునా, నరకడానికి?

కర్ణాటకలో ఎవరైనా గ్యాంగ్‌స్టర్ అరెస్టయితే నా ప్రాణాలకు ముప్పు ఉందనే వార్తలు మీడియాలో వెలుగుచూస్తాయి. నన్ను నరకడానికి నేనేమైనా జంతువునా?. నా బలమేంటో నాకు బాగా తెలుసు అని యష్ పేర్కొన్నారు. తన ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని ఆయన స్పష్టం చేశారు.

 ప్రాణాలకు హాని ఉందనే వార్తలతో

ప్రాణాలకు హాని ఉందనే వార్తలతో

నా ప్రాణాలకు హాని ఉందనే వార్తలను మీడియా ప్రసారం చేయవద్దు. నా హత్య కుట్రపన్నారనే రూమర్లను దయచేసి సోషల్ మీడియాలో వైరల్ చేయకండి. ఎందుకంటే నా ఫ్యామిలీ, స్నేహితులు, సన్నిహితులు మానసిక క్షోభకు గురవుతారు. అలా వారిని బాధకు గురిచేయకండి అని మీడియాను యష్ వేడుకొన్నారు.

యష్ ప్రాణాలకు ముప్పు లేదని

యష్ ప్రాణాలకు ముప్పు లేదని

యష్‌పై మర్డర్ ప్లాన్ చేశారనే వార్తలపై బెంగళూరు అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని మీడియా ఛానెల్లు తప్పుడు వార్తలను ప్రసారం చేశాయి. మీడియా పేర్కొన్నట్టు యష్ ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదు. కాంట్రాక్టు కిల్లర్స్‌కు సుపారీ చెల్లించలేదు. అయితే శాండల్‌వుడ్‌లో ఓ ప్రముఖుడి ప్రాణాలకు ముప్పు ఉందనే విషయం మాకు తెలిసింది అని అన్నారు.

కేజీఎఫ్‌తో దేశవ్యాప్తంగా క్రేజ్

కేజీఎఫ్‌తో దేశవ్యాప్తంగా క్రేజ్

ఇదిలా ఉండగా, కేజీఎఫ్‌తో దేశవ్యాప్తంగా యష్‌కు క్రేజ్ ఏర్పడింది. యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 1 చిత్రం ప్రపంచవ్యాప్తంగా అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకొన్నది. దాదాపు రూ.200 కోట్లకుపైగా వసూళ్లను సాధించి కన్నడ పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది. త్వరలోనే కేజీఎఫ్ చాప్టర్2 సెట్స్‌పైకి వెళ్లనున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X