Just In
- 35 min ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరో కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 1 hr ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 2 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 11 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
Don't Miss!
- News
నిమ్మగడ్డ అదను చూసి దెబ్బకొట్టారా ? జగన్ కొంపముంచిన నిర్ణయమిదే- టర్నింగ్ పాయింట్
- Sports
మౌమా, సుధా సింగ్‌తో సహా ఏడుగురికి పద్మశ్రీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నాన్న, ఆయన స్నేహితుడు నన్ను దారుణంగా కొట్టారు.. స్టార్ హీరోపై కేసు పెట్టిన కుమార్తె!
కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ కు చిక్కులు ఎక్కువవుతున్నాయి. తరచుగా విజయ్ పై ఏదోఒక ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలు కేసులు విజయ్ పై నమోదయ్యాయి. జిమ్ ట్రైనర్ పై దాడి చేసిన కేసులో దునియా విజయ్ ఇటీవల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల విజయ్ బెయిల్ పై విడుదలయ్యాడు. తాజాగా విజయ్ పై అతడి కుమార్తె కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది.

ఇంటాబయటా గొడవలే
జిమ్ ట్రైనర్ పై దాడి చేసిన ఘటనలో విజయ్ పై కేసు నమోదైంది. ఇదిలా ఉండగా విజయ్ కుటుంబ పరంగా కూడా సమస్యలు ఎదుర్కొంటున్నాడు. విజయ్ మొదటి భార్య నాగరత్న ప్రెస్ మీట్ పెట్టి మరీ అతడిని ఏకిపారేసింది. విజయ్ పై, అతడి రెండవ భార్యపై తీవ్రమైన విమర్శలు చేసింది.

తండ్రిపై కేసు
దునియా విజయ్ నుంచి అతడి కుమార్తె మోనికా కూడా దూరంగా ఉంటోంది. విజయ్, నాగరత్న సంతానమే మోనిక. తన తండ్రి, ఆయన స్నేహితుడు తనపై దాడి చేసారంటూ మోనిక పోలీసు కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది.

తలని గోడకేసి మోదారు
ఏడాది కాలంగా మోనికా తండ్రికి దూరంగా ఉంటోంది. తన దుస్తులు, డ్రైవింగ్ లైసెన్సు, ఇతర వస్తువులు తెచ్చుకునేందుకు ఇంటికి వెళ్లగా నాన్న, ఆయన స్నేహితుడు, డ్రైవర్ కలసి నాపై దాడి చేశారు. తలని గోడకేసి మోదారు. కాలితో తన్నారు. అసభ్యంగా తిడుతూ తీవ్రంగా కొట్టారని మోనికా పోలిస్ ఫిర్యాదులో పేర్కొంది.

తాళం పగలగొట్టి
తన కుమార్తె మోనికా ఆరోపణలపై విజయ్ స్పందించాడు. తన మొదటి భార్య నాగరత్న, మోనికా తనపై కావాలనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని విజయ్ తెలిపాడు. మోనిక తాళం పగలగొట్టి మరీ బలవంతంగా ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించింది. మోనిక చేస్తున్న ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదని విజయ్ అభిప్రాయ పడ్డాడు.