twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Puneeth : ఆ విషయంలో కూడా గ్రేట్.. ఎక్కడా లేని విధంగా నలుగురికి కంటి చూపు.. ఎలా కుదిరిందంటే?

    |

    కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరణానంతరం అక్టోబరు 29న కళ్లను దానం చేయడంతో నలుగురు యువకులు చూపు పొందారు, అంటే ఒకరకంగా వారు కొత్త జీవితాన్ని పొందారనే చెప్పాలి. పునీత్ నేత్రదానం కారణంగా నారాయణ నేత్రాలయలో గత రెండు రోజుల్లో ముగ్గురు పురుషులు మరియు ఒక స్త్రీకి కంటి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే..

    చనిపోయిన వెంటనే

    చనిపోయిన వెంటనే

    2006లో తన తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్ మరియు 2017లో తల్లి పార్వతమ్మ తర్వాత పునీత్ రాజ్‌కుమార్ తన కళ్లను దానం చేసిన తన కుటుంబంలో మూడో సభ్యుడు అయ్యారు. డాక్టర్ రాజ్‌కుమార్ కుమారుడు పునీత్ శుక్రవారం గుండెపోటుతో 46 ఏళ్ల వయసులో కన్నుమూశారు. పునీత్ చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించిన తర్వాత, పునీత్ రాజ్‌కుమార్ సోదరుడు రాఘవేంద్ర నటుడి కళ్లను సేకరించడానికి నారాయణ నేత్రాలయ నిర్వహిస్తున్న డాక్టర్ రాజ్‌కుమార్ ఐ బ్యాంక్‌కి కాల్ చేశాడు.

    నలుగురికి

    నలుగురికి

    దివంగత నటుడికి రెండు కళ్ళు ఉండడంతో ఇద్దరు కళ్ళు లేని వ్యక్తులకు చూపు తెప్పిస్తారని భావించారు. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం సాధారణంగా ఒక వ్య‌క్తి దానం చేసిన క‌ళ్ల‌తో ఇద్ద‌రికీ మాత్రమే చూపును అందించ‌గ‌లరు. కానీ పునీత్ రాజ్‌కుమార్‌గారి కార్నియాలోని సుపీరియ‌ర్‌, డీప‌ర్ లేయ‌ర్స్‌ను వేరు చేయడంతో ఆ కార‌ణంగా న‌లుగురికి చూపును ప్ర‌సాదించ‌గ‌లిగామని చెబుతున్నా

    ఎలా సాధ్యం అయింది అంటే?

    ఎలా సాధ్యం అయింది అంటే?

    అంటే సూప‌ర్‌ఫీషియ‌ల్ కార్నియ‌ల్ వ్యాధితో ఇబ్బంది ప‌డుతున్న ఇద్ద‌రికీ.. అలాగే డీప్ కార్నియ‌ల్ లేయ‌ర్ వ్యాధితో ఇబ్బంది ప‌డుతున్న మ‌రో ఇద్ద‌రికీ చూపును అందించ‌గ‌లిగారట. బ‌హుశా క‌ర్ణాట‌క‌లో ఇలాంటి నేత్రాదానం ఎక్క‌డా జ‌రిగి ఉండ‌దని పేర్కొన్నారు. నారాయణ నేత్రాలయ ఛైర్మన్ డాక్టర్ భుజంగ్ శెట్టి మాట్లాడుతూ, నలుగురు రోగులు 20-30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారేనాని, ఐదుగురు వైద్యులతో కూడిన బృందం మార్పిడి చేసిందని పేర్కొన్నారు.

    అందుకే అలా

    అందుకే అలా

    కోవిడ్ -19 కారణంగా నేత్రదానం పూర్తిగా ఆగి పోయినందున నలుగురు యువకులు ఆరు నెలలకు పైగా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారని, అప్పటి నుంచి ఆసుపత్రిలో నెలకు 200 మార్పిడి శస్త్రచికిత్సలు మాత్రమే చేయగలిగామని పేర్కొన్నారు. లామెల్లార్ కెరాటోప్లాస్టీ యొక్క రెండు వేర్వేరు పద్ధతులు ఈ కేస్ లో ఉపయోగించబడ్డాయని పేర్కొన్నారు.

    సినిమాల విషయానికి వస్తే

    సినిమాల విషయానికి వస్తే

    ఇక ఆ సంగతి పక్కన పెడితే పునీత్ నటించిన చివరి సినిమా 'జేమ్స్' ఇప్పుడు ఎంతవరకు వచ్చింది అనేది చర్చనీయాంశంగా మారింది. లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం అయితే దాదాపు సినిమా షూటింగ్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. కేవలం డబ్బింగ్ పనులు మాత్రం మిగిలి ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాలో తెలుగు హీరో శ్రీకాంత్ కూడా ఓ కీలక పాత్రలో నటించారు. ప్రియా ఆనంద్ మెయిన్ హీరోయిన్ గా నటించగా చేతన్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో పునీత్ ఒక బాడీ బిల్డర్ గా కనిపించబోతున్నాడు. శ్రీకాంత్ నెగిటివ్ పాత్రలో నటిస్తుండగా అతనికి సంరక్షకుడిగా పునీత్ సరికొత్తగా దర్శనమివ్వనున్నాడు.

    Recommended Video

    Vishal చర్య ప్రతీ Star Hero కి పాఠం.. ఇదీ కదా హీరోయిజం అంటే || Filmibeat Telugu
     డబ్బింగ్ కోసం అలా

    డబ్బింగ్ కోసం అలా

    ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ జేమ్స్ మూవీకి పునీత్ రాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పాల్సి ఉంది. ఇప్పుడు ఆయన మృతి చెందడంతో డబ్బింగ్ విషయంలో చిత్రయూనిట్ ఒక కీలక నిర్ణయం తీసుకుందట. పునీత్ షూటింగ్ సమయంలో చెప్పిన ఆన్-లొకేషన్ వాయిస్ అలాగే ఉంటుంది కాబట్టి దాన్ని టెక్నాలజీతో మరింత క్వాలిటీతో వచ్చేలా మార్చబోతున్నట్లు సమాచా

    English summary
    Power Star Puneeth Rajkumar's eyes gave sight to four youth.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X