Just In
- 27 min ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 1 hr ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 2 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
- 3 hrs ago
యుద్దమే ధర్మం కానప్పుడు ధర్మయుద్దాలెక్కడివి.. ‘అర్దశతాబ్దం’ టీజర్ రచ్చ
Don't Miss!
- News
కల్నల్ సంతోష్ బాబుకు మహవీర్ చక్ర పట్ల తండ్రి అసంతృప్తి, గర్వంగా ఉందంటూ భార్య సంతోషి
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Sports
టీమిండియాను బలమైన జట్టుగా ఆయనే తీర్చిదిద్దాడు: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్
- Automobiles
ఇంటర్నేషల్ మార్కెట్లలో బజాజ్ పల్సర్ మోటార్‌సైకిళ్లకు భలే డిమాండ్!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కీలక ప్రకటన చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్: భారీ చిత్రం నుంచి సర్‌ప్రైజ్ రాబోతుంది
ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలై.. రూపొందిన అన్ని భాషల్లోనూ భారీ విజయాన్ని అందుకున్న చిత్రం 'KGF Chapter 1'. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌కు తోడు హీరో యశ్ స్టైలిష్ యాక్షన్‌కు ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో హీరో ఎలివేషన్ సీన్లకు ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. ఓ మూస ధోరణిలో సాగిపోతోన్న కన్నడ చిత్ర పరిశ్రమ ఖ్యాతిని దేశ వ్యాప్తం చేసిన ఈ చిత్రానికి జాతీయ అవార్డు సైతం వచ్చింది. ఇండియన్ సినిమాపై ఎంతో ప్రభావం చూపిన దీనికి సీక్వెల్ కూడా రూపొందుతోన్న విషయం తెలిసిందే.
మొదటి పార్ట్ సూపర్ హిట్ అవడంతో 'KGF Chapter 2'పై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీనిని రూపొందిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అంతేకాదు, ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్‌ను తీసుకొచ్చారు. ఇక, ఇటీవలే హైదరాబాద్‌లో జరిగిన చివరి షెడ్యూల్‌లో క్లైమాక్స్ ఫైట్స్ సహా కీలక సన్నివేశాలను తెరకెక్కించి, షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టబోతున్నారు. ఇందులో భాగంగానే సినిమా టీజర్‌ను విడుదల చేయబోతున్నారు.

కొద్ది రోజుల క్రితం చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. 'రాఖీ భాయ్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8 ఉదయం 10.18 గంటలకు టీజర్ విడుదల చేస్తున్నాం' అని అందులో పేర్కొన్నారు. ఇప్పుడు దీనిపై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్పందిస్తూ.. 'మా సామ్రాజ్యపు ద్వారాలను తెరిచేందుకు కౌంట్‌డౌన్ ప్రారంభం అయింది' అని ట్వీట్ చేశాడు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా, చాప్టర్ 1 చివర్లో గరుడను చంపి కేజీఎఫ్‌ను తన సొంతం చేసుకుంటాడు రాఖీ భాయ్. ఇలాంటి సమయంలో అతడికి అధీర రూపంలో మరో శత్రువు పుట్టుకొస్తాడు. అతడిని ఎలా అంతమొందిచాడు అన్న కథతో రెండో భాగం రూపొందుతోంది. ఇందులో శ్రీనిథి శెట్టి నటిస్తుండగా, బాలీవుడ్ నటి రవీనా టాండన్ కీలక పాత్రను పోషిస్తున్నారు.