For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Puneeth Rajkumar: ఆఖరి సినిమాకు డబ్బింగ్ చెప్పకుండానే పునీత్ మృతి.. మళ్ళీ ఒరిజినల్ వాయిస్‌తోనే మ్యాజిక్

  |

  కన్నడ సినిమా ప్రపంచం లో పునీత్ రాజ్ కుమార్ ఏ స్థాయిలో గుర్తింపు అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతను చనిపోయాడు అని తెలియగానే అభిమానులు ఎంతో మనో వేదనకు గురయ్యారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా పునీత్ రాజ్ కుమార్ పార్ధివ దేహాన్ని చూసేందుకు బెంగళూరు కి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. మరి కొందరు హీరోలు అంతిమయాత్రలో కూడా పాల్గొని కంటతడి పెట్టుకున్నారు. అంతటి మంచి వ్యక్తి ఇంత త్వరగా చనిపోవడం తీవ్రంగా కలచి వేస్తోంది అని భావోద్వేగానికి లోనయ్యారు. అయితే పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా ఎంతవరకు వచ్చింది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సినిమా డబ్బింగ్ విషయంలో చిత్రయూనిట్ సభ్యులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

  నష్టపోయిన సందర్భాల్లో..

  నష్టపోయిన సందర్భాల్లో..

  పునీత్ రాజ్ కుమార్ ఎలాంటి సినిమా చేసినా కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసే విధంగా అడుగులు వేస్తూ ఉంటాడు. అతడితో నిర్మాతలు సినిమా చేసేందుకు ఎంతగానో ఇష్టపడతారు. నష్టపోయిన సందర్భాల్లో చాలా వరకు అతను డిస్ట్రిబ్యూటర్లను నిర్మాతలను ఆదుకున్నాడు కూడా. నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు అందరూ బాగుండాలని కోరుకునే అతి కొద్ది మంది కన్నడ హీరోలలో పునీత్ రాజ్ కుమార్ టాప్ లో ఉంటాడు అని చెప్పవచ్చు.

  పునీత్ ఆఖరి సినిమా

  పునీత్ ఆఖరి సినిమా

  పునీత్ రాజ్ కుమార్ మృతిచెందాడు అనగానే కన్నడ ఇండస్ట్రీ లోనే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా చాలా మంది సినీ ప్రముఖులు భావోద్వేగానికి లోనయ్యారు. అంతేకాకుండా కూడా కొందరు హీరోలు అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూన్నారు. ఇక పునీత్ నటించిన చివరి సినిమా 'జేమ్స్' ఇప్పుడు ఎంతవరకు వచ్చింది అనేది చర్చనీయాంశంగా మారింది. లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం అయితే దాదాపు సినిమా షూటింగ్ కూడా పూర్తయిందిని తెలుస్తోంది.

  బాడీ బిల్డర్ పాత్రలో..

  బాడీ బిల్డర్ పాత్రలో..

  కేవలం డబ్బింగ్ పనులు మాత్రం మిగిలి ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాలో తెలుగు హీరో శ్రీకాంత్ కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. ఇక ప్రియా ఆనంద్ మెయిన్ హీరోయిన్ గా నటించగా చేతన్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో పునీత్ ఒక బాడీ బిల్డర్ గా కనిపించబోతున్నాడు. శ్రీకాంత్ నెగటివ్ పాత్రలో నటిస్తుండగా అతనికి సంరక్షకుడిగా పునీత్ సరికొత్తగా దర్శనమివ్వనున్నాడు.

  మరణం తరువాత..

  మరణం తరువాత..

  జేమ్స్ సినిమా పై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి.. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని పునీత్ రాజ్ కుమార్ గత వారం నుంచి ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టాలని ప్రణాళికలు రచిస్తున్నాడు. అయితే ఇంతలోనే అతను శుక్రవారం రోజు గుండెపోటుతో మృతి చెందడంతో ఒక్కసారిగా ఆ ప్లాన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. సినిమాకు సంబంధించిన పనులు కూడా ఎక్కడిక్కడే ఆగిపోయాయి.

  Recommended Video

  Varudu Kavalenu Movie Team Interview
  పునీత్ డబ్బింగ్.. ఎలా అంటే..?

  పునీత్ డబ్బింగ్.. ఎలా అంటే..?

  ఇక ప్రస్తుతం పోస్ట్ ఎలక్షన్ లో జేమ్స్ మూవీకి పునీత్ రాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పాల్సి ఉంది. ఇప్పుడు ఆయన మృతి చెందడంతో డబ్బింగ్ విషయంలో చిత్రయూనిట్ ఒక కీలక నిర్ణయం తీసుకుందట. ఎంత మిమిక్రీ చేసిన కూడా అనుకున్న వాయిస్ ను రప్పించడం అంత ఈజీ కాదని.. ముంబైకి చెందిన ఒక ప్రముఖ ఆడియో కంపెనీ నీతో చేతులు కలిపినట్లు సమాచారం. పునీత్ షూటింగ్ సమయంలో చెప్పిన ఆన్-లొకేషన్ వాయిస్ ఎలాగూ ఉంటుంది కాబట్టి దాన్ని టెక్నాలజీతో మరింత క్వాలిటీగా ఉండేలా మార్చబోతున్నట్లు సమాచారం. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.

  English summary
  Puneeth Rajkumar last movie james dubbing work with high technology,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X