»   » కర్నాటక సీఎం భార్య థర్డ్ ఇన్నింగ్స్, నాలుగు సినిమాలతో సంచలనం!

కర్నాటక సీఎం భార్య థర్డ్ ఇన్నింగ్స్, నాలుగు సినిమాలతో సంచలనం!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య రాధిక మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వడం చర్చనీయాంశం అయింది. ఒకటి కాదు రెండు ఏకంగా ఆమె నాలుగు కన్నడ సినిమాలకు సైన్ చేశారు. కంట్రాక్ట్, బైరా దేవి, రాజేంద్ర పొన్నప్ప, నిమగై చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. ఆమె భర్త, కర్నాటక సీఎం కుమారస్వామి క్షణం తీరకలేకుండా రాజకీయాల్లో మునిగితేలుతున్న నేపథ్యంలో ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక రాధిక సినిమాల వైపు ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. ఇది ఆమెకు థర్డ్ ఇన్నింగ్స్.... కావడం గమనార్హం.

  రాధిక కుమార స్వామి సినిమా కెరీర్

  రాధిక కుమార స్వామి సినిమా కెరీర్

  రాధిక 2002లో నినగగి అనే కన్నడ సినిమాతో కెరీర్ ప్రారంభించారు. 2004లో ‘భద్రాద్రి రాముడు' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కొన్ని తమిళ సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు లభించక పోవడంతో కన్నడ సినిమాలకే పరిమితం అయ్యారు.

  ఇపుడు థర్డ్ ఇన్నింగ్స్

  ఇపుడు థర్డ్ ఇన్నింగ్స్

  2002 నుండి 2008 వరకు వరస సినిమాలు చేసిన రాధిక.... కుమారస్వామిని పెళ్లాడిన తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. 2012 వరకు ఆమె ఏ సినిమాల్లో నటించలేదు. వీరికి ఓ కూతురు కూడా జన్మించింది. 2013 నుండి 2015 మధ్యలో సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించి మూడు సినిమాలు చేసిన తర్వాత మళ్లీ బ్రేక్ ఇచ్చారు. తన భర్త సీఏం అయిన తర్వాత రాధిక మళ్లీ థర్డ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు.

  కుమారస్వామి, రాధిక వ్యవహారం కన్నడనాట సంచలనం

  కుమారస్వామి, రాధిక వ్యవహారం కన్నడనాట సంచలనం

  కుమార స్వామి, రాధిక వ్యవహారం అప్పట్లో కన్నడనాట సంచలనం అయింది. 2006లో వీరి వివాహం జరుగినప్పటికీ మూడేళ్ల తర్వాత బయటి ప్రపంచానికి తెలిసింది. కుమార స్వామికి అప్పటికీ పెళ్లయి భార్య పిల్లు ఉన్నారు. రాధికకు అంతకు ముందు 2000 సంవత్సరంలో రతన్ కుమార్ అనే వ్యక్తితో వివాహం జరుగగా 2002లో అతడు గుండె పోటుతో మరణించారు.

  కన్నడనాట హాట్ టాపిక్

  కన్నడనాట హాట్ టాపిక్

  కన్నడనాట మీడియాలో కొన్ని రోజులుగా అటు పొలిటికల్ పరంగా, ఇటు సినిమా పరంగా కుమార స్వామి కుటుంబానికి చెందిన వ్యక్తుల పేర్లే వినిపిస్తున్నాయి. కుమారస్వామి మొదటి భార్య కుమారుడు నిఖిల్ గౌడ కూడా హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

  English summary
  Karnataka politician Kumarswamy is busy as Chief Minister, his wife Radhika is focusing on her film assignments. After a long gap, Radhika is making a comeback into Films. As many as four projects have been signed by her already.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more