KGF Chapter 2 నుంచి షాకింగ్ అప్‌డేట్: యశ్ కంటే ఆయన పాత్రకే ప్రాధాన్యం

ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలై అన్ని భాషల్లోనూ భారీ విజయాన్ని అందుకున్న చిత్రం 'KGF Chapter 1'. హీరో యశ్‌ పాత్రను ఎలివేట్ చేస్తూ ఇందులో చూపించిన విధానానికి సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. మూస ధోరణిలో పోతోన్న కన్నడ పరిశ్రమకు కొత్త జీవం పోసిన ఈ సినిమా.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అంతేకాదు, జాతీయ అవార్డును సైతం అందుకుంది. ఇంతటి ఘన విజయాన్ని నమోదు చేసుకున్న ఈ సినిమాకు సీక్వెల్ రూపొందిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. తాజాగా ఆ సినిమా గురించి ఓ షాకింగ్ న్యూస్ లీకైంది.

మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ అవడంతో.. దానికి కొనసాగింపుగా 'KGF Chapter 2'ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. చాప్టర్ 1లో చివర్లో గరుడను చంపి కేజీఎఫ్‌ను తన సొంతం చేసుకుంటాడు రాఖీ భాయ్‌. ఇలాంటి సమయంలో అతడికి అధీర రూపంలో మరో శత్రువు పుట్టుకొస్తాడు. అతడిని ఎలా అంతమొందిచాడు అన్న కథతో రెండో భాగం రూపొందుతోంది. ఇందులో అధీరగా బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీలో హీరో కంటే ఆయన పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందట.

Sanjay Dutt Role Highlight in KGF Chapter 2

సినిమాలో హీరో స్టామినా తెలియాలంటే విలన్ పాత్ర బలంగా ఉండాలి. ఇదే కాన్సెప్ట్‌ను ఫాలో అయిపోయిన ప్రశాంత్ నీల్.. రాఖీ భాయ్‌ కంటే అధీర పాత్రనే ఎక్కువ ఎలివేట్ చేసి చూపించాడట. దానికి సంబంధించిన సీన్స్ అన్నీ అద్భుతంగా వచ్చాయని అంటున్నారు. ఇక, ఈ మూవీ క్లైమాక్స్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇదిలా ఉండగా, యశ్ పుట్టినరోజు సందర్భంగా 'KGF Chapter 2' టీజర్ జనవరి 8న విడుదల చేయబోతున్నారు. అలాగే, ఈ సినిమా వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X