For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అందుకే డ్రగ్స్ వాడాను.. కానీ వెన్ను పోటు పొడిచారు.. హాస్పిటల్ పాలైన సంజన గల్రానీ

  |

  దాదాపు ఒక సంవత్సరం క్రితం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత ఒక్క సారిగా డ్రగ్స్ వాడకం గురించి ఫోకస్ చేసారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున డ్రగ్స్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అనేక ప్రముఖుల పేర్లు బయటపడగా , నటీమణులు సంజన గాల్రాణి మరియు రాగిణి ద్వివేది కొన్ని నెలలు జైలులో గడిపారు.

  ఇద్దరూ ప్రస్తుతం షరతులతో కూడిన బెయిల్‌పై బయట ఉండగా, ఈ వారంలో, ఇద్దరూ జైలుకు తరలించడానికి ముందు పరీక్ష కోసం సమర్పించిన హెయిర్ ఫోలికల్ నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ( FSL) నుండి డ్రగ్స్ వినియోగించినట్టు రిపోర్ట్ వచ్చిందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ అంశం మీద సంజనా స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే

  Anita Hassanandani: పెళ్ళయి పిల్లాడున్నా తగ్గని నువ్వు నేను హీరోయిన్...మాల్దీవుల్లో మత్తెక్కిస్తూ!

  వెన్నుపోటు పొడిచారు

  వెన్నుపోటు పొడిచారు

  ఈ పరిణామం గురించి సంజన మాట్లాడుతూ ఈ ఊహాజనిత నివేదికలతో తాను కలత చెందానని పేర్కొంది. ఈ కేసు తర్వాత జీవితం చాలా కష్టంగా ఉందన్న ఆమె నా చీకటి సమయాల్లో కొంతమంది మాత్రమే నాతో ఉన్నారని, తాను తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నానని చెప్పుకొచ్చారు. డబ్బు పెట్టుబడి పెట్టిన స్నేహితులు నాకు వెన్నుపోటు పొడిచారన్న ఆమె ఆర్థికంగా, వ్యక్తిగతంగా, చట్టపరంగా మరియు భావోద్వేగపరంగా తాను ఇబ్బంది పడుతున్నానని ఆమె చెప్పుకొచ్చింది.

  Anchor Shyamala చిలిపిగా కవ్విస్తూ.. అందంతో ఆకట్టుకొంటున్న బిగ్‌బాస్ బ్యూటీ

  ప్రతిరోజూ 16 మాత్రలు

  ప్రతిరోజూ 16 మాత్రలు

  ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదిక ప్రకారం, ఆమె ఖచ్చితంగా డ్రగ్స్ సేవించిందని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు సంజన దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది మరియు నివేదిక తర్వాత మొదటిసారి స్పందించింది. నిద్ర మాత్రలు మరియు అనాల్జేసిక్ మాత్రలతో సహా ఇతర ఆరోగ్య సమస్యల కోసం నేను ప్రతిరోజూ 16 మాత్రలు తీసుకుంటున్నానని, ఈ కేసు ప్రారంభమైన రోజు నుండి నేను నిద్ర లేమి మరియు మానసిక అనారోగ్యంతో ఉన్నానని ఆమె వెల్లడించింది.

  నేను ఒక వైద్యుడిని సందర్శించానని, జైలు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత, నాకు శస్త్రచికిత్స జరిగిందని పేర్కొంది. ఏడుపును నియంత్రించడానికి మరియు నన్ను నిద్రపోనివ్వడానికి వైద్యులు నాకు అధిక-మోతాదు మూడ్ ఎలివేటర్లను ఇచ్చారు "అని సంజన పేర్కొన్నారు.

  Mahesh Babu's Goa Trip Photos: సితార, మంజుల, వంశీ పైడిపల్లి హంగామా.. జెట్ విమానంలో ఫోటోలు వైరల్

  3 నెలల పాటు ప్రతిరోజూ ఏడుస్తూనే

  3 నెలల పాటు ప్రతిరోజూ ఏడుస్తూనే

  3 నెలల పాటు ప్రతిరోజూ ఏడుస్తూనే ఉన్నానని, ఈ మందులు, రసాయనాలు వంటివి తీసుకోవడానికి అవసరమైన డాక్యుమెంటేషన్ నా దగ్గర ఉంది. న్యాయవ్యవస్థపై పూర్తి ఆధార పడ్డానని పేర్కొన్న ఆమె మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, "అని సంజన అన్నారు. ఈ మెడికేషన్స్ లో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయనేది అధికారికంగా రికార్డుల్లో నమోదైందని ఆ కారణంగా ఆ నివేదికలో డ్రగ్స్ వాడినట్టు ఉండటం పెద్ద విషయం కాదని పేర్కొని.

  హాస్పిటల్ లో చేరిన సంజనా

  హాస్పిటల్ లో చేరిన సంజనా

  ఇక మొత్తం విషయం తెలియక ముందు నన్ను నిందించడం మానేయండి. ఇది నా హృదయపూర్వక అభ్యర్థన. నా జీవితం సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నా. ఆరోపణల ద్వారా నన్ను మానసికంగా వేధించే వారిని శిక్షించాలనుకోవడం లేదని ఆమె పేర్కొంది. ఇక మరో పక్క డ్రగ్స్‌ కేసులో నిందితురాలైన సంజనా గల్రాని అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారని ఆమె. ఆమె తల్లీ రేష్మా గల్రాని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదని, పేదలకు రోజూ అన్నదానం చేస్తున్నాం అని ఆమె చెప్పారు. అయితే సంజన అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు ఆమె తెలిపారు. ఇక అన్నింటికీ తలరాత బాగుండాలని ఆమె అన్నారు.

  Sanjana Galrani డ్రగ్స్‌ కేసు పై స్పందించిన హీరోయిన్ సంజన | Interview Part 3
  దేవుడి ప్లాన్ ఇది

  దేవుడి ప్లాన్ ఇది

  మరోపక్క డ్రగ్స్‌ కేసులో మరో నిందితురాలు, నటి రాగిణి ద్వివేది స్పందించారు. దేవుడు వేసిన ప్లాన్‌పై మనకు భరోసా ఉండాలి. అనుకున్నట్లు నడవకపోయినా కోపం ఉండకూడదు. ఆత్మవిశ్వాసం ఉంటేనే గెలవడం సాధ్యం అని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేశారు. ఇంటికే పరిమితమైన రాగిణి మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. ఈ కేసులో ఏం చేయాలనేదానిపై లాయర్‌తో సంప్రదిస్తున్నారు. ఇక మరో పక్క జైలు నుంచి బయటకు రాగానే సంజన తన స్నేహితుడైన ముస్లిం డాక్టర్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.

  English summary
  Finally actress Sanjjanaa Galrani, Ragini Dwivedi opens up on drug scandal.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X