Darshan Case: బిర్యాని తినిపించి.. రాడ్లతో కొట్టి.. ఎలక్ట్రిక్ షాక్స్ పెట్టి రేణుక స్వామి హత్య!
కన్నడ సినీ పరిశ్రమలో దర్శన్ కేసు అనేక మలుపులు తిరుగుతూ, ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన ప్రియురాలికి అసభ్యమైన ఫోటోలు, మెసేజెస్ పంపారనే కారణంపై తన అభిమాని రేణుక స్వామిని దర్శన్ అనుచరులు హత్య చేసిన విషయం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్ర గౌడను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో భాగంగా విచారిస్తున్న సమయంలో దర్శన్, పవిత్ర గౌడ, వారి అనుచరులు సంచలన విషయాలు వెల్లడించారు. ఆ విషయాల్లోకి వెళితే..
కన్నడ సినీ పరిశ్రమలో అభిమానుల నుంచి భారీ ఫాలోయింగ్ ఉన్న నటుడు దర్శన్ అరెస్ట్ తర్వాత ఆయన ఫ్యాన్స్ రోడ్లమీదకు వచ్చి నానా హంగామా సృష్టించేందుకు ప్రయత్నించారు. అరెస్ట్ చేసి ఆయనను ఉంచిన పోలీస్ స్టేషన్ బయట ధర్నాలు, రాస్తారోకోలు చేసేందుకు యత్నించారు. అయితే వారిని అదుపులోకి తీసుకొని కొన్ని ప్రదేశాల్లో 144 సెక్షన్ విధించారు.

ఇక పోలీసులు విచారణలో వెలుగు చూసిన అంశాల వివరాల్లోకి వెళితే.. రేణుక స్వామిని దర్శన్ అభిమానులు కిడ్నాప్ చేసి చిత్ర హింసలు పెట్టారు. ఆయనను ఇనుప రాడ్లుతో తీవ్రంగా కొట్టారు. అలాగే ఎలక్ట్రిక్ షాక్‌లు కూడా ఇచ్చారు. వాటి బాధ తట్టుకోలేక రేణుక స్వామి ప్రాణాలు విడిచాడు అనే కథనాలు కన్నడ మీడియాలో వస్తున్నాయ.ి
ఇదిలా ఉంటే.. రేణుక స్వామి శాఖాహరి. ఆయనను చిత్ర హింసకు గురిచేసే సమయంలో అతడికి బిర్యానీ తినిపించారు. నాన్ వెజ్ తినను అని మొండికేస్తే దారుణంగా కొట్టి బలవంతంగా తినిపించారు. నీవు నాన్ వెజ్ తింటే.. దెబ్బలను ఓర్చుకొనే శక్తి వస్తుంది. లేకపోతే దెబ్బలను తట్టుకోలేవు అంటూ హేళన చేస్తూ దారుణంగా టార్చర్‌కు గురి చేశారు అనే విషయం తాజగా వెలుగులోకి వచ్చింది.
అయితే తాను పవిత్రకు క్షమాపణ మాత్రమే చెప్పించాలని ప్రయత్నించాను. అతడికి కొంత డబ్బు కూడా ఇచ్చాను. అతడిని తన గ్రామానికి చేర్చండి అని చెప్పి.. ఆ తర్వాత ఆ ప్రదేశం నుంచి వెళ్లిపోయాను. ఇక అనంతరం ఏం జరిగింది? అతడు ఎలా చనిపోయాడనే విషయం గురించి నాకు తెలియదు అని దర్శన్ విచారణలో వెల్లడించినట్టు సమాచారం.
ఇదిలా ఉండగా, రేణుక స్వామి దెబ్బలకు తాళలేక మరణించిన తర్వాత అతడి మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించారు. ఫామ్ హౌస్ నుంచి అతడిని బాడీని తరలించే సమయంలో దర్శన్ సొంత కారు ఉండటం సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టం కనిపించింది. ఈ విచారణ జరుగుతుండగా.. దర్శన్ కారు డ్రైవర్ పరారీలో ఉండటంతో మరింతగా అనుమానాలు బలపడుతున్నాయి.


Click it and Unblock the Notifications











