For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ముఖ్యమంత్రిగా విజయ్ సేతుపతి: ఎన్నికల ముందు ఆ పార్టీ నేతల మాస్టర్ ప్లాన్

  |

  కొంత కాలంగా ఇండియాలోని అన్ని ఇండస్ట్రీలో బయోపిక్‌ మూవీల హవా కనిపిస్తోంది. ఇప్పటికే ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ల జీవిత కథలను ఆయా పరిశ్రమల ఫిల్మ్ మేకర్స్ సినిమాలుగా మలిచారు. వీటిలో చాలా వరకూ సూపర్ హిట్లుగా నిలిచాయి. ఫలితంగా ఈ క్రమంలోనే మరికొంత మంది లెజెండ్‌ల కథలతో ప్రాజెక్టులను రెడీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో మాజీ ముఖ్యమంత్రి బయోపిక్ కూడా పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలపై టార్గెట్ చేస్తూ ఈ ప్లాన్ చేశారట. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

  తెరపైకి సిద్దరామయ్య బయోపిక్

  తెరపైకి సిద్దరామయ్య బయోపిక్

  రామ్ మనోహర్ లోహియా శిష్యుడిగా రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి.. ఆ తర్వాత జనతాదళ్ యునైడైట్‌లో నాయకుడిగా మారి.. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన నేత సిద్దరామయ్య. కర్నాటకకు సీఎంగా చేసిన ఆయన జీవిత చరిత్రను బయోపిక్‌ మూవీగా తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో ఇది హాట్ టాపిక్ అవుతోంది.

  నెట్ డ్రెస్‌లో గబ్బర్ సింగ్ బ్యూటీ: ఈ ఏజ్‌లోనూ మరీ ఇంత ఘోరంగానా!

  కాంగ్రెస్ పార్టీ నేతల మాస్టర్ ప్లాన్

  కాంగ్రెస్ పార్టీ నేతల మాస్టర్ ప్లాన్

  సిద్దరామయ్య బయోపిక్‌ను తెరపైకి తెచ్చింది ఏ దర్శకులో, నిర్మాతలో కాదు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయన శిష్యులు అని తెలిసింది. అందులోనూ ఈ మాజీ సీఎం క్యాబినెట్‌లో పని చేసి, వీరవిధేయులుగా పేరు తెచ్చుకున్న శివరాజ్ తంగడాగి, శివకుమార్‌లే సిద్ధరామయ్య బయోపిక్‌ కోసం మాస్టర్ ప్లాన్లు చేస్తున్నారట. ఇప్పటికే కొన్ని పాయింట్లతో కథను కూడా రెడీ చేయించారట.

  ఆయనతో చర్చలు.. ఓకే అంటే

  ఆయనతో చర్చలు.. ఓకే అంటే

  కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య బయోపిక్ మూవీకి సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ అవుతోన్నా.. దీనిపై ఇంకా స్పష్టత రాలేదని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. శివరాజ్ తంగడాగి, శివకుమార్ డిసెంబర్ 2 లేదా 3వ తేదీని సిద్దరామయ్యతో సమావేశం కాబోతున్నారట. అప్పుడు ఆయనకు స్టోరీ లైన్‌ను వినిపిస్తారని, దానికి ఓకే చెబితేనే ఇది పట్టాలెక్కుతోందని టాక్.

  బాత్రూంలో ఏమీ లేకుండా అషు రెడ్డి: సెల్ఫీ వీడియోలో మొత్తం చూపిస్తూ!

  సిద్దరామయ్య పాత్రలో విజయ్

  సిద్దరామయ్య పాత్రలో విజయ్

  మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య బయోపిక్ మూవీ ప్రకటన జరగక ముందే.. ఇందులో టైటిల్ రోల్ చేసే హీరో పేరును కూడా శివరాజ్ తంగడాగి, శివకుమార్‌లు ఫైనల్ చేసుకున్నారని తెలిసింది. కోలీవుడ్‌లో విలక్షణ పాత్రలతో మెప్పిస్తోన్న స్టార్ హీరో విజయ్ సేతుపతిని ఈ రోల్‌ కోసం తీసుకోబోతున్నారట. ఇప్పటికే అతడి నుంచి దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందట.

  ఎన్నికలే టార్గెట్... రిలీజ్ డేట్

  ఎన్నికలే టార్గెట్... రిలీజ్ డేట్

  వచ్చే ఏడాదిలో కర్నాటక రాష్ట్ర అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ నుంచి మార్చి వరకూ సిద్దరామయ్య బయోపిక్ సినిమా షూటింగ్‌ను జరుపుకుని.. ఎలక్షన్ ముందు దీన్ని విడుదల చేసేలా కొందరు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. ఇందుకోసం అంతా పక్కాగా ప్లాన్లు చేసుకున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.

  Hyper Aadi Gundu: హైపర్ ఆదికి చేదు అనుభవం.. గుండు కొట్టించి మరీ.. అమ్మాయి ముద్దు ఎఫెక్ట్

  హైకమాండ్ ఒప్పుకుంటుందా?

  హైకమాండ్ ఒప్పుకుంటుందా?

  సిద్దరామయ్య బయోపిక్ మూవీ న్యూస్ దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతోన్న తరుణంలో దీనిపై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. ఇది చేయడానికి ఈ మాజీ సీఎం ఒప్పుకున్నప్పటికీ.. నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు అని అంటున్నారు. అయితే, ఇప్పుడా పార్టీకి చావో రేవో పరిస్థితి కావడంతో బయోపిక్‌కు ఒప్పుకోవచ్చని కూడా పలువురు చెబుతున్నారు.

  English summary
  Few Congress Party Leaders Plans Karnataka Former Chief Minister Siddaramaiah Biopic Movie. Vijay Sethupathi to Play Title Role in Film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X