Don't Miss!
- Sports
విరాట్ కోహ్లీ ఆ బంతిని వదిలేయాల్సింది.. ఇన్ని తప్పులు ఎప్పుడూ చేసుండకపోవచ్చు: సెహ్వాగ్
- News
పీఎం కిసాన్ వద్దా..? సగ మందికి కూడా రావడం లేదు: రాములమ్మ ఫైర్
- Finance
తెలంగాణలో యూరియా ప్లాంట్‌ను తెరిపించింది మేమే: మోడీ: రూ.8 లక్షల కోట్లు
- Automobiles
భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్
- Lifestyle
'ఈ' టీ తాగడం వల్ల మీ గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు అని మీకు తెలుసా?
- Technology
Xiaomi Pad 6 లాంచ్ వివరాలు వచ్చేసాయి ! స్పెసిఫికేషన్లు చూడండి
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
KGF Chapter 2 సినిమా హాల్‌లో కాల్పులు.. ఒకరిని తోటి ప్రేక్షకుడు కాల్చివేత
కర్ణాటకలోని సినిమా హాల్‌లో దారుణం చోటుచేసుకొన్నది. కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాను చూస్తున్న తోటి ప్రేక్షకుడి మరో ప్రేక్షకుడు కాల్పులు జరపడం సంచలనంగా మారింది. ఈ కాల్పుల్లో 27 ఏళ్ల యువకుడు తీవ్రంగా గాయపడటం విషాదంగా మారింది. ఆ ఘటన రాజశ్రీ సినిమా హాల్‌లో చోటుచేసుకొన్నది. ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన ప్రకారం.. వసంత్ కుమార్ అనే యువకుడు కేజీఎఫ్2 సినిమా చూడటానికి వెళ్లాడు. సినిమా చూస్తుండగా మరో అపరిచిత వ్యక్తితో గొడవ చోటు చేసుకొన్నది. వసంత్ సినిమా చూస్తూ ముందు సీటుపై కాళ్లు పెట్టాడు. దాంతో ఆ సీటులో కూర్చొన్న వ్యక్తి మందలించాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే వసంత్ కుమార్‌తో గొడవ పడిన వ్యక్తి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి పిస్టల్ తీసుకొని థియేటర్‌కు వచ్చాడు. అనంతరం వసంత్ కుమార్‌పై నాలుగైదు రౌండ్ల కాల్పులు జరిపాడు. అయితే గాయపడిన వసంత్‌ను సమీపంలోని కిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వసంత్ పరిస్థితి మెరుగ్గా ఉంది. తుపాకితో దాడికి పాల్పడిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటన కర్ణాటకలో సంచలనంగా మారింది.

ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేజీఎఫ్2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. ఈ చిత్రం హిందీలోనే 250 కోట్ల షేర్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 700 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఈస సినిమా కలెక్షన్లనే కాకుండా ఆల్‌టైమ్ రికార్డులను క్రియేట్ చేస్తున్నది.
కరోనా లాక్‌డౌన్ తర్వాత సంక్షోభంలో కూరుకుపోయిన సినిమా పరిశ్రమకు కేజీఎఫ్2 చిత్రం మంచి జోష్‌ను కలిగించింది. చాలాకాలంగా థియేటర్లకు దూరమైన ప్రేక్షకులను మళ్లీ సినిమా హాళ్లకు రప్పించింది. దాంతో భారీ కలెక్షన్లు నమోదు అవుతున్నాయి.