For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Banaras ప్యాన్ ఇండియా మూవీగా.. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో.. మిస్టీరియస్ ప్రేమకథగా..

  |

  కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'బనారస్‌' తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న బనారస్ నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానుంది. 'నాంది' సతీష్ వర్మ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో హీరో జైద్ ఖాన్ మాట్లాడుతూ..

  తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు మాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. మొన్న జరిగిన వైజాగ్ ఈవెంట్‌లో మాపై ఎంతో అభిమానం కురిపించారు. ఈ అభిమానం, ప్రేమ నేను ఊహించలేదు. తెలుగు ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి వుంటాను. నవంబర్ 4వ బనారస్‌ ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. బనారస్‌ మిస్టీరియస్, మెచ్యూర్ లవ్ స్టొరీ. యాక్షన్ కామెడీ థ్రిల్ సస్పెన్స్ ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ వుంటాయి. ఇందులో ఒక వినూత్నమైన ప్రయోగం చేశాం. అది ప్రేక్షకుడు గుర్తుపెట్టుకునేలా ఉంటుంది. చాలా ఫ్రెష్ కంటెంట్ వున్న సినిమా బనారస్. సినిమాని తెలుగులో విడుదల చేస్తున్న సతీష్ గారికి కృతజ్ఞతలు. నవంబర్ 4వ అందరూ థియేటర్ కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి అని కోరారు.

  Zaid Khans Banaras movie to release on November 4th

  సోనాల్ మాంటెరో మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు మాకు ఎంతో గొప్పగా ప్రోత్సాహం ఇస్తున్నారు. ముందుకు తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోహిస్తున్నాను. అందరికీ కనెక్ట్ అయ్యే పాత్ర ఇది. సతీష్ గారు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. నవంబర్ 4న సినిమా విడుదలౌతుంది. మీ అందరి ప్రేమ, అభిమానం కావాలి'' అని కోరారు.

  సతీష్ వర్మ మాట్లాడుతూ.. బనారస్ బలమైన కంటెంట్ వున్న చిత్రం. ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాం. నవంబర్ 4న సినిమా విడుదలౌతుంది. అందరూ థియేటర్ లో సినిమా చూసి ఆదరించాలని కోరారు.

  Zaid Khans Banaras movie to release on November 4th

  తారాగణం: జైద్ ఖాన్, సోనాల్ మాంటెరో, సుజయ్ శాస్త్రి, దేవరాజ్, అచ్యుత్ కుమార్, సప్నా రాజ్, బర్కత్ అలీ తదితరులు
  రచన, దర్శకత్వం: జయతీర్థ
  నిర్మాత: తిలకరాజ్ బల్లాల్
  బ్యానర్: ఎన్ కె ప్రొడక్షన్స్
  సంగీతం: బీ అజనీష్ లోక్‌నాథ్
  డీవోపీ: అద్వైత గురుమూర్తి
  యాక్షన్: ఎ వుయి, డిఫరెంట్ డానీ
  డైలాగ్స్: రఘు నిడువల్లి
  లిరిక్స్ : డాక్టర్ వీ నాగేంద్రప్రసాద్
  ఎడిటర్: కేఎం ప్రకాష్
  ఆర్ట్: అరుణ్ సాగర్, శీను
  కొరియోగ్రాఫర్: జయతీర్థ, ఎ హర్ష
  పోస్ట్ సూపర్‌వైజర్ - రోహిత్ చిక్‌మగళూరు
  కాస్ట్యూమ్: రష్మీ, పుట్టరాజు
  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వైబి రెడ్డి
  ప్రొడక్షన్ కంట్రోలర్: చరణ్ సువర్ణ, జాకీ గౌడ
  పబ్లిసిటీ డిజైన్: అశ్విన్ రమేష్
  పీఆర్వో : వంశీ-శేఖర్

  English summary
  Karnataka Politician Jameer Ahmed's son is going to introduce with Banaras. This movie is going to hit the screen on November 4th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X