బిగ్‌బాస్‌లో పెళ్లి చేసుకోబోతున్న ప్రేమపక్షులు .. పెళ్లి పెద్దగా మోహన్‌లాల్!

By Rajababu

Recommended Video

Bigg Boss Malayalam Contestants Prepared To Get Married

మలయాళ బిగ్‌బాస్ రియాలిటీ షో సెన్సేషనల్ వార్తలతో ముందుకు సాగుతున్నది. ప్రేమ వ్యవహారాలకే పరిమితమైన బిగ్‌బాస్ ఇప్పుడు పెళ్లి వేదిక కాబోతున్నది. మలయాల సెలబ్రిటీలు శ్రీనియాస్ అరవింద్, పర్లే మన్నె పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తం చేసుకొన్నారు. మరో అడుగు ముందేసి పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. వీరి పెళ్లికి హోస్ట్ మోహనలాల్ కూడా పెద్దగా వ్యవహరించడం విశేషం. వివరాల్లోకి వెళితే..

శ్రీనియాష్ అరవింద్, పర్లే మన్నే

శ్రీనియాష్ అరవింద్, పర్లే మన్నే

బిగ్‌బాస్ ఇంటిలో గత కొద్దికాలంగా శ్రీనియాష్ అరవింద్, పర్లే మన్నె చాలా సన్నిహితంగా ఉంటున్నారు. వారి మధ్య ఉన్న రిలేషన్ ఫ్రెండ్‌షిప్ కంటే ఎక్కువేనని గుర్తించారు. ఒకరికొకరు ప్రేమను వ్యక్తం చేసుకోవడంతో వారి రిలేషన్‌లో క్లారిటీ వచ్చేసింది. పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం కూడా తీసేసుకొన్నారు.

పెళ్లి చేసుకొంటాం.. సపోర్ట్ కావాలి

పెళ్లి చేసుకొంటాం.. సపోర్ట్ కావాలి

శ్రీనియాస్ అరవింద్, పర్లే మన్నె ఇద్దరు మాట్లాడుకునే ఓ స్పెషల్ ప్లేస్‌లో వారు తమ ప్రేమను ఒకరికొకరు తెలుపుకోవడం గమనార్హం. స్పెషల్ ప్లేస్‌లో ఉన్న కెమెరాల వైపు చూస్తూ మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకొంటున్నాం. మీ ఆశీర్వాదం కావాలి అని తమ కుటుంబాలకు రిక్వెస్ట్ చేశారు.

పెళ్లి పెద్దగా మోహన్‌లాల్

పెళ్లి పెద్దగా మోహన్‌లాల్

శ్రీనియాస్ అరవింద్, పర్లే మన్నె పెళ్లికి బిగ్‌బాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న మోహన్‌లాల్ కూడా ఆమోద ముద్ర వేశాడు. ఇరు కుటుంబాల పెద్దలతో సంప్రదింపులు జరిపి వారిని ఒప్పిస్తానని వారికి హామీ ఇచ్చారు. మోహనలాల్ మధ్యవర్తిత్వాన్ని ఇరు అంగీకరిస్తాయా లేదా వేచి చూడాల్సిందే.

షాకింగ్ ఎలిమినేషన్

షాకింగ్ ఎలిమినేషన్

గతవారం బిగ్‌బాస్ హౌస్ నుంచి సెలబ్రిటీ రజనీ హరిదాస్ ఎలిమినేట్ అయింది. రజనీ అనూహ్యంగా ఎలిమినేట్ కావడం షాకిచ్చింది. ఎలిమినేషన్‌కు ముందు మోహన్ లాల్ ఇచ్చిన టాస్క్‌లో గెలిచి అందర్నీ ఆకట్టుకొన్నది. ఆ తర్వాత జరిగిన ఎలిమినేషన్ రౌండ్‌లో ఇంటి నుంచి బయటకు వెళ్లింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X