twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టీవీ నటి అరెస్ట్.. 57 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం..!

    By Rajababu
    |

    నకిలీ కరెన్సీని సృష్టించి చెలామణి చేయాడానికి ప్రయత్నించిన టెలివిజన్ నటితోపాటు వారి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయడం మలయాళ ఇండస్ట్రీలో సంచలనం రేపింది. కొల్లాంలో జరిగిన ఈ ఘటనలో టవీ నటి సూర్య శశి కుమార్, ఆమె సోదరి శృతి, తల్లి రమాదేవిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి అరెస్టు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

     టీవీ నటి సూర్య శశిని అరెస్ట్ చేశాం

    టీవీ నటి సూర్య శశిని అరెస్ట్ చేశాం

    నటి సూర్య శశికుమార్‌తో ఆమె తల్లి, సోదరిని అరెస్ట్ చేశాం. వారివద్ద నుంచి రూ.57 లక్షల విలువైన నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకొన్నాం. కోచికి సమీపంలోని ఇడుక్కిలో వారిని అరెస్ట్ చేసి కట్టపనకు తరలించాం అని జిల్లా ఎస్పీ కేబీ వేణుగోపాల్ మీడియాకు తెలిపారు.

     నకిలీ కరెన్సీ ప్రింటింగ్

    నకిలీ కరెన్సీ ప్రింటింగ్

    నకిలీ కరెన్సీ తయారీ రాకెట్‌లో శశి తల్లి రమాదేవి కీలక నిందితురాలు. తమ ఇంటిలోని పై పోర్షన్‌లో పలు అక్రమాలకు పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నకిలీ కరెన్సీ ప్రింటింగ్ కోసం సుమారు రూ.5 లక్షలు ఖర్చు చేశారు. అందులో వచ్చే లాభం నుంచి వాటా తీసుకొనే విధంగా ఒప్పందం జరిగింది అని పోలీసులు వెల్లడించారు.

    7 కోట్ల నకిలీ కరెన్సీకి కుట్ర

    7 కోట్ల నకిలీ కరెన్సీకి కుట్ర

    నకిలీ కరెన్సీ కుంభకోణంలో మరో పది మంది ఉన్నారు. వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం. సుమారు రూ.7 కోట్ల మేర నకిలీ కరెన్సీని ప్రింటింగ్ చేసేందుకు కుట్ర పన్నారు అని ఎస్పీ వేణుగోపాల్ పేర్కొన్నారు.

    Recommended Video

    చిన్న బాబు ఆడియో లాంచ్ లో హీరో సూర్య స్పీచ్
    నకిలీ దందా బయటపడిందిలా

    నకిలీ దందా బయటపడిందిలా

    ఇడుక్కిలోని ఓ మాజీ సైనికుడితో సహా ముగ్గురిని అరెస్ట్ చేయడంతో ఈ దందా బయటపడింది. వారి వద్ద నుంచి కూడా రూ.2.25 లక్షల కరెన్సీని స్వాధీనం చేసుకొన్నాం. వారిని విచారించడంతో టెలివిజన్ నటి సూర్య శశికుమార్ వ్యవహారం మా దృష్టికి వచ్చింది అని వేణుగోపాల్ మీడియాకు వివరించారు.

    English summary
    A Malayalam television actress and two members of her family were arrested on Tuesday in connection with the seizure of counterfeit currency notes with face value of Rs 57 lakh from their residence at Kollam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X