For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. క్యాన్సర్‌తో పోరాడుతూ యువ నటి మృతి

  |

  సినిమా ఇండస్ట్రీలో కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది సినీ తారలు ప్రాణాలు కోల్పోయారు. కొలుకుంటున్నారని అనుకుంటున్న సమయంలోనే ఒక్కసారిగా మరణవార్తతో షాక్ ఇచ్చిన లిస్టు అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇక సోమవారం అయితే రెండు వేర్వేరు సినిమా పరిశ్రమలకు చెందిన సినీ తారలు ఒకేరోజు ప్రాణాలు కోల్పోవడం అందరిని షాక్ కు గురి చేసింది. నేడు ఉదయం బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ శ్యామ్ తుది శ్వాస విడువగా మరోవైపు మలయాళం బ్యూటీఫుల్ నటి శరణ్య శశి కూడా ప్రాణాలు కోల్పోవడం రెండు ఇండస్ట్రీలలో తీవ్ర స్థాయిలో విషాదాన్ని నింపింది.

  తిరువనంతపురంలో ప్రముఖ మలయాళ నటి శరణ్య శశి సోమవారం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించినట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. 35 ఏళ్ల ఈ నటి గత కొన్నేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది. ఇక ఆర్థిక పరిస్థితులు ఏ మాత్రం బాగోలేకపోవడంతో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆమె చికిత్సలో భాగంగా అనేకసార్లు శస్త్రచికిత్స చేయించుకుంది. ఇక తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు, శరణ్య స్నేహితులు అలాగే శ్రేయోభిలాషులు ట్రీట్మెంట్ ఖర్చుల కోసం నిధులను సేకరించారు. ఇబ్బందులు పడుతూనే శరణ్య ఇన్ని రోజులు తన ప్రాణాల కోసం ఎంతగానో పోరాడింది. అయితే దురదృష్టవశాత్తు చికిత్స పొందుతున్నప్పుడు, ఆమె ఈ ఏడాది మే నెలలో కోవిడ్-19 బారిన పడింది.

  Kerala beautiful Actress Saranya Sasi Dies Aged 35

  ఆమె వైరస్ ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న క్రమంలోనే ఇతర అనారోగ్య సంబంధిత సమస్యల కారణంగా ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. ప్రాణాలు కాపాడేందుకు కుటుంబ సభ్యులు కూడా భారీగానే ఖర్చు చేశారు. ఎంతోమంది ప్రముఖులు ఆర్థికంగా సహాయం కూడా చేశారు. నిరంతరం ఆమె తన జీవితం కోసం పోరాడుతు వచ్చింది, ఇక తీవ్రంగా పోరాడిన శరణ్య అలసిపోయి చివరికి సోమవారం ఉదయం కన్నుమూశారు. ఈ వార్త సినీ ప్రముఖులను ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది.

  కన్నూర్ జిల్లాలోని పాతయంగడికి చెందిన శరణ్య 'చాకో రందమన్', 'చోటా ముంబై' వంటి కొన్ని మలయాళ సినిమాల్లో నటించింది. వాటితో ఆమెకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఎక్కువగా తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వచ్చిన శరణ్య రెమ్యునరేషన్ లో కొంత భాగాన్ని సమాజాసేవకు కూడా ఉపయోగించేవారు. ఇక రాష్ట్రంలో ప్రముఖ టీవీ నటి మరణ వార్త గురించి తెలుసుకున్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలియజేశారు, నటి ఆత్మవిశ్వాసంతో పోరాడింది అంటూ సమాజం పట్ల ఆమె నిబద్ధతను ప్రశంసించారు. ఆమె గొప్ప నటి మాత్రమే కాదు మంచి మనసున్న మహిళ అని కొనియాడారు. ఇక గతంలో రాష్ట్రం వరదలతో అతలాకుతలమైనప్పుడు శరణ్య తన వైద్య ఖర్చుల నుండి ఒక మొత్తాన్ని ప్రజల కోసం కూడా కేటాయించిన విషయాన్ని ముఖ్యమంత్రి విజయన్ గుర్తు చేసుకున్నారు. ఇక శరణ్య మృతిపట్ల ఇతర ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు కూడా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.

  English summary
  Malayalam actress Saranya Sasi deth news, she was diagnosed with brain tumour years ago,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X